S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయణం... మీరే డిటెక్టివ్

09/29/2018 - 22:18

తన పరివారంతో కలిసి భరతుడు భరద్వాజుడి ఆతిథ్యం స్వీకరించి, ఆ రాత్రి అక్కడ గడిపి వెళ్లడానికి అనుమతి కోసం ఆయన దగ్గరికి వెళ్లాడు. చేతులు జోడించి తన దగ్గరికి వచ్చిన భరతుడ్ని సంధ్యావందనం పూర్తి చేసుకుని ఆశ్రమం నించి బయటకి వచ్చిన గొప్ప తేజస్సు గల ఆయన చూసి అడిగాడు.
‘పాపం చేయని ఓ భరతా! మా ఆశ్రమంలో ఈ రాత్రి నీకు సుఖంగా గడిచిందా? నీ పరివారం అంతటికీ పూర్తి ఆతిథ్యం లభించిందా? చెప్పు’

09/29/2018 - 22:16

ఆ చుట్టుపక్కల భూమి చదును చేయబడి, అంతటా ఇంద్ర, నీల, వైఢూర్యాలు, మాణిక్యాల్లా ఉన్న అనేక పచ్చిక బీళ్లు వ్యాపించి ఉన్నాయి. ఆ ప్రదేశంలో పళ్లతో నిండిన మారేడు, వెలగ, పనస, మాదీఫలం, ఉసిరి, మామిడి, జామ, సీతాఫలం చెట్లు వెలిసాయి. ఉత్తర కురుదేశం నించి దివ్యమైన భోగ్య వస్తువులు గల వనం, అనేక వృక్షాలతో నిండిన తీరాలు గల దివ్యమైన నది అక్కడికి వచ్చాయి.

09/29/2018 - 22:15

ధర్మవేతె్తైన భరతుడు భరద్వాజుడి ఆశ్రమాన్ని కోసు దూరం నించే చూసి, సైన్యాన్ని అక్కడే నిలిపి, ఆయుధాలని, పరివారాన్ని విడిచి, వశిష్టుడు ముందు నడవగా మంత్రులతో కలిసి కాలినడకన అక్కడికి నడిచాడు. చాలా దూరంలో భరద్వాజుడు కనపడగానే మంత్రులను ఉండమని భరతుడు వశిష్ఠుడి వెనక తనొక్కడే నడిచాడు. వశిష్టుడిని చూడగానే మహాతపశ్శాలైన భరద్వాజుడు అర్ఘ్యం తీసుకురమ్మని శిష్యులకి చెప్పి, ఆసనం మీంచి లేచాడు.

09/29/2018 - 22:13

మంత్రితో కలిసి భరతుడు ఆ మాటలన్నీ శ్రద్ధగా విని వృక్షం దగ్గరికి వెళ్లి రాముడి పడకని చూసి తల్లులందరితో చెప్పాడు.

09/29/2018 - 22:12

హరిదాసు ఆ రోజు కథని ఇలా ఆరంభించాడు.
‘ఇవాళ మీకు 85, 86 సర్గలు చెప్తాను. అరణ్యవాసైన గుహుడు మంచి గుణాలు గల భరతుడికి మహాత్ముడైన లక్ష్మణుడి సోదర ప్రేమ మొదలైన సద్గుణాల గురించి చెప్పాడు.

09/29/2018 - 22:10

గంగానది పొడవునా విడిది చేసి ఉన్న ఆ సేనని చూడగానే గుహుడు తక్షణం తన బంధువులతో చెప్పాడు.

07/21/2018 - 20:01

గౌరవనీయమైన జనాలతో నిండిన సభ బుద్ధిశాలైన భరతుడికి పూర్ణచంద్రుడు ఉత్తమ గ్రహాలతో కూడిన రాత్రిలా తోచింది. సభ్యులంతా ఎవరికి తగ్గ ఆసనాలలో వాళ్లు కూర్చుంటూంటే వారి బట్టలకి పూసుకున్న సుగంధ ద్రవ్యాల కాంతి చేత ఆ సభంతా కళకళలాడుతోంది. పండితులతో నిండిన అందమైన ఆ సభ శరదృతువులో పూర్ణచంద్రుడితో కలిసి రాత్రిలా కళకళలాడింది. వాళ్లని చూసి ధర్మవేతె్తైన వశిష్ఠుడు భరతుడితో మృదువుగా ఇలా చెప్పాడు.

07/14/2018 - 19:56

మీకో ప్రశ్న
భరతుడు అంటే అర్థం ఏమిటి?

07/07/2018 - 22:19

పదోరోజు గడిచాక భరతుడు శుద్ధి చేసుకుని, పనె్నండో రోజు శ్రాద్ధకర్మలు చేయించాడు. బ్రాహ్మణులకి రత్నాలు, డబ్బు, కడుపు నిండా భోజనం, విలువైన బట్టలు, మంచి వస్తువులు దానం చేసాడు. దశరథుడి ఉత్తమగతికి పూజలు చేసే సమయంలో భరతుడు అనేక తెల్లటి మేకల మందని, వందల కొద్దీ ఆవులని, దాసదాసీ జనాన్ని, వాహనాలని, పెద్ద ఇళ్లని దానం చేసాడు.

06/30/2018 - 22:34

మీకో ప్రశ్న
-----------
సరయు నదికి గల మరో పేరు ఏమిటి?

Pages