S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయణం... మీరే డిటెక్టివ్

06/23/2018 - 22:34

వీరుడైన భరతుడు చాలాసేపటికి తిరిగి స్పృహలోకి వచ్చి లేచి, మంత్రుల మధ్య కన్నీటితో ఉన్న దీనురాలైన తల్లిని చూసి ఆవిడని నిందించాడు.

06/16/2018 - 21:59

తన తండ్రి ఇంట్లో ఆయన కనపడకపోవడంతో తల్లిని చూడటానికి భరతుడు ఆమె ఇంటికి వెళ్లాడు. దూరదేశం నించి తిరిగి వచ్చిన తన కొడుకుని చూడగానే సంతోషించిన కైకేయి, బంగారు ఆసనం మీంచి ఒక్క ఉదుటున లేచింది. ధర్మాత్ముడైన భరతుడు కళ తప్పిన తన ఇంట్లోకి ప్రవేశించి, తన తల్లి పాదాలని తాకి నమస్కరించాడు. ఆమె కీర్తివంతుడైన భరతుడిని కౌగిలించుకుని ఒళ్లో కూర్చోపెట్టుకుని ప్రశ్నించసాగింది.

06/09/2018 - 21:57

భరతుడు తోరణం అనే ప్రదేశానికి దక్షిణంగా వున్న జంబూప్రస్థ అనే గ్రామానికి, అక్కడ నించి వరూధం అనే అందమైన గ్రామానికి చేరాడు. అక్కడి అందమైన అడవుల్లో విడిది చేసి, అక్కడ నించి తూర్పు వైపు ప్రయాణించి ఔదుంబర వృక్షాలు అధికంగా గల ఉజ్జిహాన అనే నగరంలోని ఉద్యానవనానికి చేరాడు.

06/02/2018 - 20:40

మీకో ప్రశ్న
---------------
కేకయ రాజు పేరేమిటి?

05/26/2018 - 21:51

వారి మాటలు విన్న వశిష్ఠుడు మిత్రులతో, మంత్రులతో, బ్రాహ్మణులతో ఇలా చెప్పాడు.
‘మేనమామ ఇంటి దగ్గర భరతుడు శతృఘు్నడితో కలిసి సుఖంగా ఉన్నాడు. వీరులైన ఆ అన్నదమ్ములు ఇద్దరినీ తీసుకుని రావడానికి వేగంగా పరిగెత్తే గుఅరాల మీద దూతలు వెంటనే వెళ్లాలి. దశరథుడే భరతుడికి రాజ్యం ఇచ్చాక ఆ విషయంలో ఇంక మనం ఆలోచించాల్సింది ఏమీ లేదు’
‘అలాగే, దూతలని పంపుతాం’ వారు చెప్పారు.

05/19/2018 - 21:42

అయోధ్యలో ఆనందవిహీనమైన ఆ రాత్రి ఆర్తనాదాలతో, దుఃఖాన్ని గొంతుల్లో దాచుకున్న ప్రజలతో చాలా సుదీర్ఘంగా గడిచింది. సూర్యోదయమైన తర్వాత బ్రాహ్మణులతో కలిసి సభకు వచ్చిన మార్కండేయుడు, వౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, గౌతముడు, గొప్ప కీర్తిగల జాబాలి అనే బ్రాహ్మణుడు, తమ మంత్రులతో, రాజ పురోహితుడైన వశిష్ఠుడితో వేరువేరుగా ఇలా చెప్పారు.

05/12/2018 - 20:01

మీరే డిటెక్టివ్....
==========

మీకో ప్రశ్న:
రామ శబ్దాన్ని రామాయణంలో వాల్మీకి ఎన్ని రకాలుగా ప్రయోగించాడు?

05/04/2018 - 14:31

మీకో ప్రశ్న
దశరథుడు చంపిన ముని కుమారుడి పేరేమిటి?
-----------------------------------------------------------

04/21/2018 - 22:41

రామాయణం..77

మీకో ప్రశ్న
దశావతారాల్లో ఏకకాలంలో జీవించిన ఇద్దరు అవతార పురుషులు ఎవరు?
---------------------------

04/14/2018 - 21:37

దశరథుడు కొద్దిసేపటికి మేలుకుని శోకంతో బాధపడే మనసుతో ఆలోచించసాగాడు. రామలక్ష్మణులని అడవికి పంపడంతో ఆ దశరథుడ్ని గొప్ప ఆపద ఆక్రమించింది. రాముడు భార్యతో కలిసి అడవికి వెళ్ళాక దశరథుడికి పూర్వం తను చేసిన పాపం జ్ఞాపకం వచ్చి దాన్ని నల్లటి కళ్ళుగల కౌసల్యకి చెప్పదలచుకున్నాడు. రాముడ్ని అరణ్యానికి పంపేసిన ఆరో రోజు అర్ధరాతి దశరథుడికి తను పూర్వం చేసిన పాపం గుర్తుకువచ్చింది.

Pages