S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయణం... మీరే డిటెక్టివ్

01/06/2018 - 20:54

మహాత్ముడు, నిజమైన పరాక్రమం గల శూరుడైన రాముడు వనవాసానికి వెళ్తూండగా అతని మీద ప్రేమతో పౌరులంతా దశరథుడితో పాటు రాముడ్ని అనుసరించి వెళ్లారు. రాముడి రథం వెంట వెళ్లే ప్రజలు వెనక్కి తిరగలేదు. గొప్ప కీర్తిగల, సద్గుణ సంపన్నుడైన రాముడు అయోధ్యలో నివసించే ప్రజలందరికీ పూర్ణచంద్రుడిలా ప్రియమైన వాడు, తన ప్రజలంతా ఎంత ప్రార్థించినా వినక, రాముడు తండ్రి ఇచ్చిన మాటని నిలబెట్టడానికి అడవికి బయలుదేరాడు.

12/23/2017 - 21:45

విచారంతో కృంగిపోయి పక్కమీద పడుకున్న రాజుని చూసి పుత్ర శోకంతో బాధపడే కౌసల్య చెప్పింది.

12/17/2017 - 00:59

పురుష శ్రేష్ఠుడైన ఆ రాముడు నమస్కరిస్తూ అడవికి వెళ్తూంటే అంతఃపురం నించి స్ర్తిల ఏడుపు ప్రతిధ్వనించింది.

12/03/2017 - 00:10

తర్వాత సీతా, రామ, లక్ష్మణులు దీనంగా తమ చేతులని జోడించి రాజు పాదాలని తాకి, నమస్కరించి ఆయనకి ప్రదక్షిణం చేసారు. దశరథుడు అనుమతించాక ధర్మం తెలిసిన రాముడు, సీత దుఃఖంగా కౌసల్యకి నమస్కరించారు. లక్ష్మణుడు కూడా కౌసల్యకి నమస్కరించి, తన తల్లి సుమిత్ర పాదాలని తాకి నమస్కరించాడు. తనకి నమస్కరించే కొడుకు లక్ష్మణుడి తలని సుమిత్ర వాసన చూసి ఏడుస్తూ, అతని మంచి కోరుతూ చెప్పింది.

11/25/2017 - 21:51

నాథుడు గల ఆ సీత అనాథలా నార చీర కట్టుకోవడం చూసి ప్రజలంతా గట్టిగా ఏడుస్తూ దశరథుణ్ని నిందించారు. వెంటనే దశరథుడు దుఃఖంతో తన జీవితాన్ని, ధర్మాన్ని, కీర్తిని కూడా పట్టించుకోకుండా, వేడిగా నిట్టూరుస్తూ కైకేయితో చెప్పాడు.

Pages