S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళాంజలి

12/22/2018 - 20:29

కె.పరంజ్యోతి గారు ప్రఖ్యాత తబలా విద్వాంసులు. దాదాపు 75 సంవత్సరాలు సంగీతానికే అంకితమై, ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలిచ్చారు. అమెరికాలో నలభై ఏళ్లు నివసించి, ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. పండిట్ రవిశంకర్, హరిప్రసాద్ చౌరాసియా, సంతూర్ శివకుమార శర్మ, లక్ష్మీశంకర్, జి.ఎస్.సచ్‌దేవ్, వసంతరాయ్, నిఖిల్ బెనర్జీ వంటి ఎంతో గొప్ప కళాకారుల ప్రదర్శనలలో తబలా వాయించారు.

12/15/2018 - 19:59

డాక్టర్ చింతా ఆదినారాయణ శర్మగారు ప్రఖ్యాత కూచిపూడి గురువు, నర్తకుడు. వీరు దశాబ్దాలుగా కూచిపూడి నృత్యానికే అంకితమయ్యారు. వీరి కళాసేవకు తార్కాణం గౌరవ డాక్టరేట్. త్యాగరాజ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్‌లో కూచిపూడి అధ్యాపకుడిగా పనిచేసి, రిటైరయ్యారు. దాదాపు 15వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఉత్తమ అధ్యాపకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే సత్కరింపబడ్డారు.

12/08/2018 - 20:00

శ్రీమతి కె.నిర్మల ప్రఖ్యాత గాయని, నటి, రచయిత్రి. అమెరికాలో 40 ఏళ్లు నివసించారు. గృహిణిగా, తల్లిగా వ్యక్తిగత బాధ్యతలు నిర్వర్తిస్తూ, 36 సంవత్సరాలు సైంటిస్టుగా పనిచేసి ఎంతో పేరు తెచ్చుకున్నారు. స్పెక్స్ ఇండస్ట్రీలో సైంటిస్టు, వైస్ ప్రెసిడెంట్‌గా దశాబ్దాలు పనిచేసి రిటైరయ్యారు. లలిత సంగీతంలో కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చారు. ఎంతోమందికి సంగీతం నేర్పిస్తున్నారు.

12/01/2018 - 20:09

ప్రఖ్యాత నర్తకి శ్రీమతి గంటి ఇందుమతి గురువు, పరిశోధకురాలు, సంగీత విద్వాంసురాలు. వ్యక్తిగతంగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ నృత్యంలో సంగీతంలో దశాబ్దాలుగా కళాసేవ చేస్తున్నారు. వీరు తమ తల్లి వద్దే కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు.
జీవన ప్రస్థానం..

11/24/2018 - 19:38

గన్ను కృష్ణమూర్తిగారు ప్రఖ్యాత కవి, కథకుడు, వ్యాసకర్త, పరిశోధకుడు. ఇన్ని సంగతులు ఒకరిలో దాగి ఉండటం చాలా అరుదైన విషయం. వీరు రాసిన ‘రాముడండే ఎవరు? రామాయణమంటే ఏమిటి?’ ఎంతో అద్భుతమైన పరిశోధనా గ్రంథం. కృష్ణాయణం ఒక నక్షత్ర మహాయానం, ఋషి హృదయం - వేదాల మీద.. చతుర్వేద సాగర మథనం బృహద్గ్రంథాలు. మహా అపభంజనం, యార్లగడ్డ వారి వస్త్రాపహరణం, రంగనాయకమ్మ గారి రామాయణ పరిజ్ఞానం? వంటి సాహిత్య విమర్శలు ఎన్నో రాశారు.

11/17/2018 - 18:30

కూచిపూడి సంప్రదాయ కుటుంబానికి చెందిన డా.ఆచార్య భాగవతుల సేతురాం ప్రఖ్యాత గురువు, నర్తకుడు, పరిశోధకుడు, ప్రొఫెసర్. ఆచార్య సేతురాం గారి తండ్రి ప్రఖ్యాత భాగవతుల రామకోటయ్య గారు. రామకోటయ్య గారు తెలంగాణలో మొట్టమొదట కూచిపూడి శిక్షణాలయం ప్రారంభించి (1946-1979) కళాసేవ చేశారు. తండ్రికి తగ్గ తనయుడు ఆచార్య భాగవతుల సేతురాం.

11/10/2018 - 19:39

శ్రీమతి లక్ష్మీకృష్ణగారు పవిత్ర కృష్ణానదీ తీరంలో విజయవాడలో 17 అక్టోబర్ 1954లో జన్మించారు. వీరు ప్రఖ్యాత వీణ, సంగీత విద్వాంసురాలు. స్వయంగా వీణ వాయిస్తూ పాడటం వీరి ప్రత్యేకత. ఎన్నో అవార్డులు పొందారు. హైదరాబాద్‌లో ‘శ్రీ విశ్వవాణి మ్యూజిక్ స్కూలు’ 1994లో స్థాపించి కర్ణాటక సంగీతం, లలిత సంగీతం, వీణ నేర్పిస్తూ కళాసేవ చేస్తున్నారు. వీరు భగవాన్ విశ్వయోగి విశ్వంజీ భక్తురాలు.
ప్రస్థానం

11/03/2018 - 20:04

డా.శ్రీదేవి ప్రఖ్యాత నర్తకి, గురువు, పరిశోధకురాలు, రచయిత్రి. ఎన్నో దశాబ్దాలుగా కళాసేవకే అంకితమయ్యారు. వీరు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ‘యక్షగానం - ప్రదర్శనా రీతులు’ అనే పరిశోధనాంశం మీద పిహెచ్.డి. జానపద కళల విభాగం నుండి 2007లో పొందారు. ఇందులో చిందు యక్షగానం, కూచిపూడి యక్షగానం, కర్ణాటక యక్షగానం, తంజావూరు యక్షగానం, మేలట్టూరు భాగవత మేళ నాటకములపై పరిశీలన చేశారు.

10/27/2018 - 19:42

శ్రీమతి రాధిక కోడిమాల ప్రఖ్యాత కూచిపూడి నర్తకి. సంప్రదాయ కూచిపూడి నృత్యంతోపాటు కథక్, జానపదం, లలిత సంగీతంలో నిష్ణాతురాలు. శ్రీమతి రాధిక బహుముఖ ప్రజ్ఞాశాలి. తల్లిగా, గృహిణిగా, వ్యక్తిగతంగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ, కొన్ని దశాబ్దాలుగా కళాసేవ చేస్తున్నారు. ‘కురుగంటి కళాక్షేత్రం’ స్థాపించి నృత్యం నేర్పుతూ ఉత్తమ కళాకారులను తీర్చిదిద్దుతున్నారు. దేశ విదేశాలలో ఎన్నో ప్రదర్శనలిచ్చారు.

10/20/2018 - 19:16

యోగా చేయడంవల్ల శరీరం, మనస్సు, ఆత్మ, బుద్ధి శక్తివంతం, పటిష్టం అవుతాయి. యోగ అంటే ఒక జీవన విధానం. ఒక ప్రయాణం. ప్రగతిబాట అంటారు ప్రఖ్యాత యోగ గురువు సునీతా జైస్వాల్. గృహిణిగా, తల్లిగా, యోగా గురువుగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన వీరికి యోగ అంటే చెప్పలేని ఇష్టం. సరస్వతీ వాసుదేవన్ గారి వద్ద యోగ నేర్చుకున్నారు. ఈయన చెన్నైలో ప్రఖ్యాత యోగా గురువు.

Pages