S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళాంజలి

10/13/2018 - 19:29

డా.పసుమర్తి శేషుబాబుగారు ప్రఖ్యాత కూచిపూడి నర్తకులు, గురువు, సంగీత విద్వాంసులు. దేశ విదేశాలలో 2000 పైగా ప్రదర్శనలిచ్చి, కూచిపూడి కీర్తిపతాక నెగురవేశారు. ఎన్నో ముఖ్యమైన సంగీత, నృత్య పరీక్షలకు ఎగ్జామినర్‌గా వెళ్తూంటారు. కూచిపూడి నృత్య భారతి 1985లో హైదరాబాద్‌లో స్థాపించి, ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దుతున్నారు. సిసిఆర్‌టి ప్యానల్ జడ్జిగా ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు.

10/06/2018 - 20:02

శ్రీమతి కందాళ రోహిణి ప్రఖ్యాత నర్తకి, పరిశోధకురాలు, గురువు. వీరు కూచిపూడి, భరతనాట్యం రెండింటిలో నిష్ణాతులు. తల్లిగా, గృహిణిగా, ఒకవైపు వ్యక్తిగత బాధ్యతలు నిర్వహిస్తూ, మరోవైపు దశాబ్దాలుగా కళాసేవ చేస్తున్నారు. దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కూచిపూడిలో పిహెచ్.డి. చేస్తున్నారు.

09/29/2018 - 19:20

వేముగంటి శ్రీ్ధరాచార్య ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు. ఘటం, కంజీర, మోర్సింగ్, కోలు, చండి, తబలా మొదలగు ఎన్నో వాయిద్యాలతోపాటు మృదంగం కూడా వాయిస్తారు. 12వేలకు పైగా దేశ విదేశాల్లో ప్రదర్శనలిచ్చారు. ప్రఖ్యాత డాన్స్ ఫెస్టివల్స్‌లో ఎంతో మంది ప్రఖ్యాత నర్తకుల ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఫుల్‌టైమ్ సంగీత విద్వాంసునిగా అవక ముందు హైదరాబాద్ పాతబస్తీలో గుడిలో అర్చకునిగా ఉండేవారు. కళ కూడా పూజే!

09/22/2018 - 19:22

అహల్యా ద్రౌపదీ సీతా తారా మండోదరీ తథా
పంచ కన్యాః స్మరేన్నిత్యం మహాపాతక నాశినః
అర్థం: అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరీ అనే ఈ పంచ కన్యలను ఎల్లప్పుడూ స్మరించుకుంటే మహా పాపాలు నాశనమవుతాయి.

09/15/2018 - 21:57

కృషి, పట్టుదల, నిరంతర పరిశ్రమ, భవిష్యత్తును అంచనా వేయగలిగే నేర్పు, కష్టనష్టాలను సమాన దృష్టితో చూడగలిగే మనోస్థైర్యం కలవారు జీవితంలో తప్పకుండా ఉన్నత స్థాయికి చేరుతారు. తాము అభివృద్ధిలోకి రావడమే కాదు తమ తోటివారి అభివృద్ధికి కూడా బాటలు నిర్మిస్తూ ముందుకు సాగుతారు.

09/01/2018 - 18:47

డా. విజయ్‌పాల్ పాత్‌లోత్ ప్రఖ్యాత నర్తకుడు, గురువు, పరిశోధకుడు, రచయిత. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నృత్యశాఖలో 2009 నుండి బోధిస్తున్నారు. వీరి నృత్య శిక్షణాలయం- ‘పాత్‌లోత్ కళాక్షేత్ర’. ఇందులో దీక్షతో నేర్చుకునే విద్యార్థులకు నృత్యం నేర్పిస్తున్నారు.

08/25/2018 - 19:58

డా.వోలేటి పార్వతీశం గారి పేరు వినని, చూడని తెలుగువాళ్లు బహుశా చాలా అరుదుగా ఉంటారు. ఒక శ్రవ్య మాధ్యమం, ఒక దృశ్యమాధ్యమం, వెరసి ప్రసార మాధ్యమం, వీరిని తెలుగు ప్రజానీకానికి అత్యంత సన్నిహితుణ్ణి చేసింది.

08/17/2018 - 20:28

అచ్యుతుని రాధాకృష్ణగారు రచయిత, కవి, పరిశోధకుడు. 30కి పైగా నాట్య రూపకాలు రచించారు. వారి వృత్తి కంప్యూటర్స్‌తో సాగింది. అయినా ప్రవృత్తి సాహిత్యం, నాటకరంగం, నాట్యం. వీరి జీవిత భాగస్వామి శ్రీమతి శ్రీదేవి ప్రఖ్యాత నర్తకి, గురువు, పరిశోధకురాలు. భార్యాభర్తలిద్దరూ కళాసేవకే అంకితమయ్యారు.

08/14/2018 - 19:36

డా.ఆర్.వాసుదేవ్‌సింగ్ రచయిత, నర్తకుడు, పరిశోధకుడు. వీరు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద కళల విభాగంలో పిహెచ్.డి. చేసి, తన సిద్ధాంత వ్యాసానికి స్వర్ణ పతకం పొందారు. ఇప్పుడు కూచిపూడి నృత్యంలో అదే విశ్వవిద్యాలయంలో పిహెచ్.డి. చేస్తున్నారు. ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎన్నో గ్రంథాలు, వ్యాసాలు ప్రచురించారు. ఎన్నో భాషలలో వీరి పుస్తకాలు ప్రచురింపబడ్డాయి.

08/11/2018 - 19:16

**శ్రీ త్యాగరాయ గానసభలో ఎన్నో అత్యాధునిక హంగులతో కూడిన వేదికలు, అత్యంత రమణీయంగా కనిపించే చిత్రపటాలు, నిరంతర సన్మానాలు, సత్కారాలు, గానామృతాలు, సప్తాహాలు, మహానుభావుల జయంతులు, వర్థంతులు, గ్రంథావిష్కరణలు, దీపాలంకారాలు.. నిత్యం ఉత్సవమే ఇక్కడ. వీటన్నిటికీ తోడు తలపై మణిమయ కిరీటంలా ‘్భరతరత్న’ల తైలవర్ణ చిత్రాలు.

Pages