S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాల భూమి
భాస్కర శతకం
---------------
శ్రీగల భాగ్యశాలిఁగడుఁ జేరఁగవత్తురు తారుదారె దూ
రాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వ ను
ద్యోగము చేసి; రత్ననిల యుండని కాదె సమస్త వాహినుల్
సాగరు జేరుటెల్ల ముని సన్నుత మద్గురుమూర్తి భాస్కరా
పరాచకాలు
==========
వదినగారూ మీరు వాసిగలవారు
వండబోయినచోట కుండ నాకేరు!
పరాచకాలు
వదినగారూ మీరు వాసిగలవారు
వండబోయినచోట కుండ నాకేరు!
బావగారూ మీరు ప్రతిభకలవారు
నిండిన సభలోను పిండిబొక్కేరు!
చక్కిలాలాబుట్ట చంకబెట్టుకొని,
సభలోను మా బావ సంగీతపరుడు!
అత్తింటి కోడలూ అలిగి పడుకుంది
అలుకలు తీర్చవే ములుకుల్లకఱ్ఱ!
తాడాట బలాలు తెలుసుకొనే ఆటగా తెలుస్తుంది. ఈ ఆటను పదిమందితో గానీ ఎనిమిది మంది గానీ ఉండి ఆడుతుంటారు. ఒక పెద్ద తాడుకు అటు ఇటు రెండు వైపులా సమాన సంఖ్యలో పిల్లలు నిలబడుతారు. మధ్యలో ఒక గీతను గీస్తారు. ఆ గీతను ఎవరు దాటకుండా ఇరువైపుల జట్లల్లో ఉండే పిల్లలు ఎదుటి జట్టువాళ్లు ఆ గీతను దాటాలనే కోరికతో తాడును గట్టిగా అందరూ కలసి లాగుతుంటారు. ఒక్కొక్కరు ఒక్కోసారి ఆ తాడును లాగుతారు.
శేషుకు చాలా మామిడి తోటలు ఉన్నాయి. ఆ ఏడాది మామిడి పిందెలు విరగకాసాయి. వీటిని చక్కగా సంరక్షించుకుంటే కాయలైన పిదప అమ్ముకుని ధనార్జన చేయవచ్చని శేషు భావించాడు. దొంగల భయంవల్ల ఇద్దరు కావలి వాళ్లను నియమించాడు. వాళ్లు కంటికి రెప్పలా రాత్రి, పగలు అనే తేడా లేకుండా కాపలా ఉండి మామిడి పిందెలను కాయసాగారు. కొంతకాలానికి ఆ పిందెలు కాయలుగా మారాయి. అయితే తోటలోని మామిడి కాయలు మాయవౌతున్నట్లు శేషు కనిపెట్టాడు.
మాధవాపురంలో సోమరితనానికి మారుపేరైన వేణు అను కుర్రవాడు వుండేవాడు. ఏకైక సంతానమైన అతనికి మంచి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకుణ్ణి చేయాలన్నది తండ్రి సుందరయ్య ఆశ. కానీ వేణు ఎప్పుడూ ఆటలతో, ఊరి వాళ్లతో పేచీలు పెట్టుకుంటూ తిరగటం, పంతుళ్లను లెక్కచేయకుండా బడికి వెళ్లక మారాం చేస్తూ, తండ్రి ఆశల్ని అడియాసలు చేయసాగాడు.
అ: అనే్వషించడం మొదలుపెట్టు
ఆ: ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు
ఇ: ఇష్టపడటం నేర్చుకో
ఈ: ఈర్ష్యపడటం మానుకో
ఉ: ఉన్నంతలో జీవించు
ఊ: ఊహకందేలా ఆచరించు
ఋ: ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించు
ఎ: ఎదగడం కోసం ఒకరితో పోల్చుకోకు
ఏ: ఏకాగ్రతను అసలు కోల్పోకు
ఐ: ఐకమత్యాన్ని సాధించడం మర్చిపోకు
ఒ: ఒంటరి జీవితం ఎన్నో గుణపాఠాలు నేర్పుతుంది
పల్లెల్లో పిల్లలంతా ఒక గుంపుగా చేరి ఈ ఆట ను ఆడుకుంటారు. ఇందులో ఆడ, మగపిల్లలు కూడా ఉంటుంటారు. రెండు జట్లుగా ఏర్పడుతారు. ఎర్రమట్టితో చిన్న బొమ్మరిల్లు కడతారు. అందులో, వంటిల్లు, ముందిల్లు, చుట్టిల్లు, పడమటిల్లు అంటూ వేర్వేరుగా కడతారు. వీటిని ముగ్గుతో వేర్వేరుగా ఏర్పరుస్తారు.
* అంగిట్లో బెల్లం, ఆత్మలో విషం
* అరవై ఏళ్లు నిండినవాణ్ని ఆలోచన అడక్కు, ఇరవై ఏళ్లు నిండని వానికి పెత్తనమీయకు
* అరువు సొమ్ములు బరువులు చేటు తీయాబెట్టా తీపుల చేటు. అందులో ఒక్కటి పోతే అప్పుల చేటు
* అలకాపురికి రాజైనా అమితంగా ఖర్చు చేయకూడదు
* అల్ప పాండిత్యం అనర్థానికి మూల కారణం
* అలిగి అత్తవారింటికి, చెడి చెల్లెలింటికి పోకూడదు