S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల భూమి

03/31/2018 - 23:39

మనం మాట్లాడే ప్రతి పలుకూ ప్రేమతో నిండి ఉండాలి.
-మదర్ థెరెసా

03/31/2018 - 23:38

అడవిలో పుట్టింది
అడవిలో పెరిగింది
వొంటినిండా గాయాలు
కడుపునిండా రాగాలు?
జవాబు: -మురళి

03/31/2018 - 23:36

వర్తమాన కలియుగం క్రీ.పూ.3102 ఫిబ్రవరి 20వ తేదీ మధ్యాహ్నం 2గంటల 27నిమిషాల 30సెకండ్ల కాలమున ప్రారంభమైనదని నిర్ణయించారు. ఫ్రెంచిదేశపు ఖగోళ శాస్తవ్రేత్త ‘‘బెయిలీ’’ భారతీయుల ఖగోళ విజ్ఞాన మేధా సంపత్తికి జోహార్లర్పించారు. 14వ లూరుూ ఆజ్ఞానువర్తియైన లాబెరే క్రీ.శ.1687లో ఐరోపాకు ఇండియా నుండి తీసుకెళ్ళిన పథకాలను ‘‘కాసిని’’, ‘‘మేయర్’’ పథకాలతో పోల్చి ఎట్టి తేడా లేదని తేల్చారు.

03/31/2018 - 23:35

పూర్వం దండకారణ్యంలో చిదానంద మహర్షి అనే ముని తపస్సు చేసుకుంటూ, తమ ఆశ్రమానికి విద్యార్జన కోసం వచ్చిన వారికి విద్యాబోధ చేస్తూ ప్రశాంతంగా జీవించసాగారు. ఆయన ఆశ్రమానికి చుట్టూ ఉండే పశు పక్ష్యాదులన్నీ ఆయన ఆశ్రమ విధులకు, తపస్సుకు ఏ మాత్రం భంగం కలుగకుండా దూరదూరంగా తిరుగుతూ, ఐకమత్యంగా జీవించేవి. ఆయన ప్రభావం వల్ల అవి పోట్లాడుకోకుండా స్నేహభావంతో మసలేవి.

03/24/2018 - 22:13

ఒక విషయాన్ని పట్టుకుని తర్కిస్తూ పోతే, అంటే ఒక క్రమంలో చర్చిస్తూ పోతే, ఆ విషయాన్ని రుజువు చేసే వీలు ఉంటుంది. కానీ ఒక కొత్త విషయాన్ని కనుగొనే అవకాశం రాదు. కొత్త విషయం కనుగొనడానికి మనసులో ఒక కొత్త ఊహ పుట్టాలి. కేవలం చర్చవల్ల అది పుట్టదు. ఈ మనసులోని ఊహకు ఇంట్యూషన్ అని పేరు. ఇందుకు తగిన మాట తెలుగులో ఉందేమో వెతకాలి.

03/24/2018 - 21:36

ఈ నాణాలను చూడండి. మనకు మార్కెట్లో దొరికే దేవుడి బొమ్మలున్న డాలర్లు కాదు. ఈస్ట్ ఇండియా కంపెనీ మనదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో ముద్రించిన అణా నాణాలు ఇవి. (అణా అంటే రూపాయిలో పదహారోవంతు). క్రైస్తవాన్ని అధికారమతంగా ప్రకటించిన ఈస్ట్ ఇండియా కంపెనీ.. హిందువుల మనోభావాలను గౌరవించటం కోసం దేవుళ్ళ బొమ్మలతో నాణాలను ముద్రించింది. దేశం మొత్తం మీద ఎక్కువమంది ప్రజలు జరుపుకునే పండుగలలో శ్రీరామనవమి కూడా ఒకటి.

03/24/2018 - 21:35

శ్రీరాముడు జన్మించిన రోజున మనం శ్రీరామనవమి పండుగను జరుపుకుంటాం. ఈ రోజున సీతారాముల కళ్యాణం కూడా చేస్తారు. ఈ రోజు ప్రతి హిందువు తమ శక్తికొలదీ సీతారామలక్ష్మణ, హనుమ, భరత శతృఘు్నల విగ్రహాలు కానీ, శ్రీరామ పట్ట్భాషేక పటమునుకానీ పెట్టి పూజించాలి.

03/24/2018 - 21:32

ప్రశ్నలు:
1. హనుమంతుడు సీతను చూసి వచ్చానని చెప్పగానే రాముడు ఏమన్నాడు?
2. ఎటువంటి సేవకుడు ఉత్తముడు?
3. ఎవరు మధ్యముడు?
4. అధముడు అంటే ఎవరు?
5. హనుమ ఏ కోవకు చెందినవాడు?
జవాబులు:

03/24/2018 - 21:32

రామాయణ మహాయజ్ఞంలో శ్రీరాముడు ‘యాజి’కాగా, సహ కార్యనిర్వహణ పరతంత్రుడై ‘ఋత్విజుడు’ అయ్యాడు ఆంజనేయుడు.
హనుమంతుడు-
సుగ్రీవునకు ఓ మంత్రి
వానరసేనకు సేవానాయకుడు
విభీషణుడు వంటివారికి సలహాదారుడు
రాయబార సమయంలో దౌత్యనీతివేత్త
సముద్రాన్ని దాటుతున్నప్పుడు మహాబలవంతుడు
సంజీవిని పర్వతాన్ని తెస్తున్నప్పుడు కార్యశీలి
అషిరావణుని బందీ నుండి రామలక్ష్మణులను

03/24/2018 - 21:29

ఓ రామ నీ నామమేమి రుచిరా
శ్రీరామ నీ నామమేమి రుచిరా !ఓ రామ!

కరిరాజ ప్రహ్లాద ధరణి విభీషణుల
గాచిన నీ నామమేమి రుచిరా !ఓ రామ!

కదళీ కర్జూరాది ఫలముల కదికవౌ
కమ్మన నీ నామమేమి రుచిరా ! ఓ రామ!

నవరసముల కన్న నవనీతముల కంటె
అధికవౌ నీ నామమేమి రుచిరా !ఓ రామ!

పనస జంబూ ద్రాక్ష ఫలరసముల కంటె
అధికవౌ నీ నామమేమి రుచిరా !ఓ రామ!

Pages