S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనం మూలం

08/17/2019 - 19:36

సంపాదన లేకపోయినా ఇనె్వస్ట్ చేయవచ్చు. ఇదేదో లాటరీ కాదు. లక్కీ స్కీం అంత కన్నా కాదు. ఇది నిజం. జీవితంలో విజయం సాధించే వారు ఆచరించి చూపిన మార్గం. సాధారణంగా 20 వరకు చదువు సాగుతుంది. ఆ తరువాత ఉద్యోగ వేట వెంటనే ఫలిస్తే, 20 నుంచి 25 ఏళ్ల వయసు నుంచి సంపాదన మొదలవుతుంది. ముందు చూపు ఉన్న వారు అప్పటి నుంచి పొదుపు, ఇనె్వస్ట్‌మెంట్‌ను ప్రారంభించవచ్చు. ఇది చాలా మంది చేసేదే.

08/10/2019 - 18:03

స్వాతంత్య్ర పోరాటం గురించి మనం చదివే ఉంటాం. స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఎంతోమంది మన జీవితాలకు ప్రేరణగా నిలిచారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆ కాలంలో విద్యార్థులు చదువులను వదిలేశారు. న్యాయవాదులు ఎంతో ఆదాయం వచ్చే వృత్తిని వదిలిపెట్టి స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. ఎందుకు? బానిసత్వం భరించరానిది కాబట్టే స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం తెగించారు.
మరి మనమేం చేస్తున్నాం?

08/03/2019 - 19:01

మన దేశం వ్రతాలకు పెట్టింది పేరు. ఉత్తరాదిలో కరువా చౌత్ ప్రఖ్యాతి. సాంప్రదాయ కుటుంబాలు వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటారు. నిజానికి ఇలాంటి నమ్మకాల వెనుక శాస్ర్తియ కారణాలు ఉన్నా, కొందరు వీటిని మూఢనమ్మకాలుగానే చూస్తారు. అన్నం తినకపోతే బూచాడు వచ్చి తీసుకు వెళతాడు అని పిల్లలను బెదిరించినట్టుగా ఆరోగ్యానికి ఉపయోగపడే అనేక అంశాలను వ్రతాలుగా అలవాటు చేశారు.

07/27/2019 - 18:52

మీ అమ్మాయి పెళ్లి కోసమేనా మీ ఆలోచన మా బ్యాంకులో పొదుపు చేయండి. పెళ్లి నాటికి అవసరమైన డబ్బు మీ చేతికి అందుతుంది. ఇలాంటి ప్రకటనలు మనం బోలెడు చూశాం. ఇంకా చూస్తున్నాం. అమ్మాయి పెళ్లి కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అనేక పథకాలు ప్రారంభించారు కూడా.. గతంలో యుటిఐ వారు అమ్మాయి పెళ్లి నాటికి మెచ్యూర్ అయ్యే పథకాన్ని ప్రకటిస్తే అనూహ్య స్పందన లభించింది. సుకన్య సమృద్థి యోజన ఇలాంటి ఓ పథకం.

07/20/2019 - 19:48

5 సెకండ్స్ రూల్ అనే అంశంపై ఒ మంచి పుస్తకం వచ్చింది. మనకు ఏ ఆలోచన వచ్చినా దానిపై మనం ఐదు క్షణాల్లో నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే దాన్ని వాయిదా వేస్తాం. మరో ఆలోచన వస్తుంది. ఉదాహరణకు ఉదయానే్న లేచి వ్యాయామం చేయాలి, వాకింగ్ చేయాలి అని గట్టిగా నిర్ణయం తీసుకుని రాత్రి నిద్ర పోతాం. తెల్లవారు జామునే మెలుకువ వస్తుంది కూడా వ్యాయామం చేయాలనే నిర్ణయం గుర్తుకు వస్తుంది కూడా!

07/06/2019 - 18:41

ఉద్యోగంలో చేరిన రోజే రిటైర్‌మెంట్ తేదీ కూడా ఖరారై ఉంటుంది. ఐతే మన మనసు దాన్ని అంత ఈజీగా అంగీకరించదు. ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే భవిష్యత్తు జీవితంపై దృష్టి సారించి దానికి తగ్గట్టు పొదుపు, ఇనె్వస్ట్‌మెంట్ అనేది అనివార్యం. పిల్లల చదువులు, సొంత ఇళ్లు, రిటైర్‌మెంట్ తరువాత జీవితంపై ముందు నుంచే ఒక అవగాహనతో ఉంటారు. ఐతే ఉద్యోగంలో చేరిన కొత్తలో చాలా మంది దీనిపై అంతగా దృష్టిసారించరు.

06/29/2019 - 17:57

మీ వద్ద డబ్బు నిలువడం లేదా? అనుకున్నట్టుగా పొదుపు చేయలేకపోతున్నారా? ఎప్పటికప్పుడు పొదుపు చేయాలి, రేపటి కోసం ఆ పొదుపును ఇనె్వస్ట్ చేయాలి అనుకుంటారు కానీ జీతం వచ్చాక ఖర్చులు పోగా మిగిలేదేమీ ఉండదు. ఎప్పటికప్పుడు ఇలానే ఈ సారి కాకపోయినా వచ్చేనెల నుంచి పొదుపు అంటూ వాయిదాలు వేయడం చాలా మంది జీవితాల్లో కనిపించేదే. ఎక్కువ మంది జీవితాల్లో ఇదే అంతులేని కథ కొనసాగుతుంటుంది. ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

06/22/2019 - 18:31

‘35 ఏళ్ల వయసులో మిలియనీర్ అవుతాను. లేదంటే నగరంలోని పెద్ద భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాను. ’

06/15/2019 - 17:41

తిరుపతికి వెళ్లాలి అంటే ఒక మధ్యతరగతి కుటుంబం కనీసం రెండు నెలల ముందు ఒక ప్రణాళిక రూపొందించుకుంటుంది. దైవదర్శనానికి, వసతి, ప్రయాణం, ఇవన్నీ సాఫీగా సాగాలి అంటే కనీసం రెండు మూడు నెలల ముందు నుంచి ప్రణాళిక చేసుకుంటేనే తిరుపతి యాత్ర విజయవంతం అవుతుంది. ఎలాంటి ఏర్పాట్లు చేసుకోక పోయినా అప్పటికప్పుడు కూడా తిరుపతికి వెళ్లవచ్చు. రైలులో నిలబడి రోజంతా ప్రయాణం చేయాలి. దైవదర్శనానికి రోజంతా క్యూలో నిలబడాలి.

06/03/2019 - 22:22

కైజెన్ జపాన్ పదం. దీని గురించి విన్నారా? సరిగా అర్థం చేసుకుంటే కైజెన్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. మిమ్ములను ఆరోగ్య వంతులుగా మారుస్తుంది. సంపన్నులను చేస్తుంది. మీకున్న చెడు అలవాట్లు అన్నీ కైజెన్ విధానంలో వదిలేయవచ్చు, ఆరోగ్య కరమైన అలవాట్లు అలవర్చుకోవచ్చు. ఇంట్లో రాగిరేకులు కట్టుకుంటే సంపద వస్తుంది, చైనా వాస్తు మిమ్ములను ఎక్కుడికో తీసుకు వెళుతుంది అనే ప్రచారానికి లోటు లేదు.

Pages