S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనం మూలం

01/12/2019 - 18:44

అమ్మాయి పుట్టినప్పటి నుంచి అత్తవారింటికి వెళ్లేంత వరకు ఎలా ఉండాలో? అత్తవారింట్లో ఎలా మసలుకోవాలో మనకెన్నో పాఠాలు ఉన్నాయి. పిల్లల పెంపకానికి సంబంధించి సూత్రాలున్నాయి. తెలియకపోతే చెప్పే పెద్దలు ఉన్నారు. మరి జీవితంలో ప్రతి క్షణం అవసరం అయిన డబ్బుకు సంబంధించి మనకు పాఠాలు లేవు. చెప్పే వారు ఉండరు.

01/05/2019 - 19:40

పత్రికలో ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి ఆకర్శిణీయమైన ప్రకటన చూడగానే పిల్లలు తండ్రి వద్దకు పరిగెత్తుకొచ్చి. నాన్నా ఇప్పుడు కొంటే పది శాతం రాయితీ నట అని ఉత్సాహంగా చెప్పారు. ఆ తండ్రి నవ్వి నిజమే కొంటే పది శాతం ఆదా అవుతుంది. కొనక పోతే వంద శాతం ఆదా అవుతుంది. ఏది బెటర్ అని తిరిగి ప్రశ్నించారు. ఒక వస్తువు మనకు అవసరమా? కాదా? అనేది ముఖ్యం కానీ రాయితీ ఇస్తున్నాడు కదా? అని అవసరం లేనివి కొంటే నష్టమే.

12/29/2018 - 17:36

ఓ సినిమాలో మధ్యవయసులో ఉన్న హాస్యనటుడు బ్రహ్మానందాన్ని మీరేం చేస్తుంటారు? అని ప్రశ్నిస్తే- కలం స్నేహం, సినిమాలు చూడడం. అంటూ వరుసగా తన హాబీలు చెబుతుంటాడు. అలానే చాలా మంది ఇంట్లో టీవీ సీరియల్స్ చూడడం, మగాళ్లయితే క్రికెట్, మందు పార్టీలు, కాలక్షేపం కబుర్లతో జీవితం గడుపుతుంటారు. ఆఫీసుల్లో పని కన్నా కబుర్లు ఎక్కువ కొందరికి. గంటల తరబడి రాజకీయ చర్చలు కొందరికి జీవితంలో అత్యంత ముఖ్యమైనవి.

12/22/2018 - 18:53

మీ సంపద బ్లూ ప్రింట్ ఎలా ఉందో మీరు చూసుకున్నారా? అదేంటి అనుకుంటున్నారా?

12/15/2018 - 17:41

సంపన్నుల గురించి చాలా మంది ఆలోచనలు చిత్రంగా ఉంటాయి. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ కనిపించింది. ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ఇల్లు కట్టిన అంబానీది, 80 గజాల స్థలంలో ఇల్లు కట్టిన నాదీ ఒకే దేశమా?
న్యూజిలాండ్‌లో షాపింగ్ కోసం 350 కోట్లతో చార్టర్డ్ ఫ్లైట్ కొన్న నీతూ అంబానీది, షాపింగ్ కోసం ఆటో ఎక్కాలా ? వద్దా అని ఆలోచించే మా అమ్మది ఒకే దేశమా?

12/08/2018 - 21:52

మనం ద్వేషిస్తే చిన్న కుక్క పిల్ల కూడా మనతో ఉండదు. ప్రేమిస్తేనే అది మనతో ఉంటుంది. అలాంటిది డబ్బును ద్వేషిస్తే అది మనతో ఉంటుందా? లా ఆఫ్ అట్రాక్షన్ అనే సిద్ధాంతం పాశ్చాత్య దేశాల్లో బాగా పాపులర్ ఈ సిద్ధాంతంపై వచ్చిన పుస్తకాలు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందాయి. మన స్ఫూర్తిగా మనం ఏది కోరుకుంటే అది సాకారం అవుతుందని చెబుతుంది ఈ సిద్ధాంతం. మన పూర్వీకులు యద్భావం తత్ భవతీ అని ఎప్పుడో చెప్పారు.

12/01/2018 - 19:53

మనిషి పుట్టినప్పటి నుంచి జీవితం ముగింపు వరకు డబ్బుతోనే జీవితం సాగుతుంది. మరణించిన తరువాత కూడా తతంగాన్ని నిర్వహించడానికి సైతం డబ్బు అవసరం. కానీ డబ్బు దేముంది అంటూ మన వాళ్లు చిత్రంగా మాట్లాడుతుంటారు. డబ్బు పాపిష్టిది కాదు. అదే విధంగా డబ్బే జీవితం కాదు. జీవితానికి డబ్బు అవసరం. డబ్బును విలన్‌గా చూడాల్సిన అవసరం లేదు. డబ్బు లక్షణాలను గుర్తించి దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలి.

11/24/2018 - 18:47

సతీ సక్కుబాయి, సతీ అనసూయ, సంతోషీమాతా సినిమా పేర్లు ఏదైతేనేం కానీ పతివ్రతల కథల సినిమాల్లో ఓ దృశ్యం తప్పనిసరిగా కనిపిస్తుంది. భక్తురాలిని వేధించేందుకు ఇంట్లో పాత్రలను, బట్టల మూటను ఆమె ముందు వేస్తారు. గుట్టల్లా పేరుకుపోయిన ఆ పాత్రలు, బట్టలు చూడగానే సినిమా చూసే ప్రేక్షకులు జాలితో కరిగిపోతారు. పాపం ఆమె ఒక్కత్తె ఆ పని ఎలా చేస్తుందా? అని బాధపడతారు.

11/17/2018 - 19:15

మనం బల్లిని చూసినా భయంతో కేకలు పెడతాం. దోమలు కూడా మనల్ని ఆటాడుకుంటాయి. కంటికి కనిపించని చిన్నచిన్న సూక్ష్మ జీవులు కూడా కొన్ని విషయాల్లో మన కన్నా శక్తివంతమైనవి. ఇక సింహం, పులి వంటి కూృర జంతువులను చూస్తే మనం వణికిపోవలసిందే. మన కన్నా ఎన్నో రెట్లు పెద్దదైన ఏనుగు, అడవికి రాజైన పులి వంటి జంతువులు. అనేక విషయాల్లో జంతువులు మనకన్నా ఎన్నో రెట్లు బలవంతమైనవి.

11/10/2018 - 18:39

ఎంత డబ్బు వచ్చినా నిలవడం లేదు. ఇద్దరు పని చేసేది ఒకే చోట. ఇద్దరి జీతం ఒకటే ఇద్దరి హోదా ఒకటే కానీ మా వద్ద డబ్బు అస్సలు నిలవదు. కానీ వారి పరిస్థితి బాగుంది. డబ్బు నిలుస్తోంది. ఎందుకిలా జరుగుతోంది. ఇలాంటి సందేహాలు మనలో చాలా మందికి వచ్చే ఉంటాయి. వస్తూనే ఉంటాయి.

Pages