S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచనాలు!

09/17/2017 - 22:56

చూడకుంటె కంటినీరు పొరకడుతుంది
వీడిపోతె మాట తీరు పొరబడుతుంది

కల వుందని జల వుందని బిగుసుకుపోకు
నీ మాటే రేపటికి బాటవుతుంది

మెరుపుందని మరపుందని నేల విడువకు
అదే కదా! మరుజన్మకు బతుకిచ్చేది

గుండెలోన ఆశరేపి చేయి వదిలితె
ప్రణయమనే తీపికబురు చేదవుతుంది

సొగలేదని గురుతేదని తప్పుకుపోతె
నీ చింతే చీకటికి పాటవుతుంది

09/17/2017 - 22:55

ఎక్కడో ఒక అపనమ్మకం
నీలి పరదాలాగా
వివేకాన్ని కప్పేస్తుంది
ఎక్కడో ఒక దుస్సంఘటన
చెవులకు చేరి
మనస్సు నాక్రమించి బాధిస్తుంది

కలల్ని మోస్తున్న కళ్లు
బేలతనంతో ఒక్కసారిగా
రెపరెపలాడుతాయి
కోటి ఆశల ఊసులతో
కొత్త ప్రపంచంలోకి
అడుగుపెట్టిన నవవధువుకి
ఏ రాయి ఎటు నుంచి వచ్చి
తగులుతుందో తెలియక
మాట వౌనాన్ని దాలుస్తుంది

09/17/2017 - 22:53

చిన్ననాటే
చిత్రాతివిచిత్రంగా
నా పయనం
కవితతో మొదలయింది
ఊరుకోలేనిక
నీటిలో
జలచరమునై
సంద్రాలు ఈదేస్తాను
ఏటి గలగల
కోయిల కూకూ
పిట్టల కితకితలు
గువ్వల కువకువలు విన్నావా
వాటిలో ఆకసంలో
విహరిస్తాను ఒక్కసారి
తారలా మెరిసిపోతూ
జాబిలిలా వెనె్నల విరజిమ్ముతూ
కనె్నవయసు రాగాలను వినిపిస్తూ

09/17/2017 - 22:52

ఖురాను, గీతా, బైబిల్
అన్నీ ఒకటే
మానవ జీవితానికి
చూపే బాటే

అవిటితనానికి
జాలి సరిపోదు
చేయూతకు
మించింది లేదు

మనిషి జీవితాన్ని
నిత్యం కరిగించే
ద్రవ పదార్థమే
మద్యం

దక్షిణ లేకపోతే
పూజారి శఠగోపం
అధికారి ఫైలూ
కదలదు

అమెరికాలో
తెలుగుకు వెలుగు
ఆంధ్రాలో
చీకటిలో తెలుగు

09/17/2017 - 22:50

చూడాలని ఉంటుంది!
వెళ్లలేని సుందర ప్రదేశాల్నీ...
చూపుండీ చూడలేని సందర్శనా స్థలాల్నీ...

చూడాలని ఉంటుంది!
సుదూర తీరాల్నీ...
ఆ తీరాల్లో భిన్న రూపాల
కొన్ని సుందర సుకుమార దేహాల్నీ..!!

చూడాలని ఉంటుంది!
స్వప్నంలో సంచరించే పరిసరాల్నీ,
విహరించే అనుభూతుల జాడల్ని తడిమి తడిమి
కట్టగట్టి తీసుకురావాలనీ...!!

09/17/2017 - 22:48

చిత్రం... భళారే విచిత్రం!
యుగాలు మారినా
తరాలు మారినా
విజ్ఞాన శాస్త్రాలు వెల్లివిరుస్తున్నా
కంప్యూటర్ ఉద్యోగాలు దేశాలను కలిపినా
సెల్‌ఫోన్లు వాటి మధ్య దూరాలను తగ్గించినా
ఇంటర్నెట్ ప్రపంచాన్ని కుగ్రామం చేసినా
మనిషిలోని అజ్ఞానపు స్థాయి తగ్గలేదు
దురహంకారం దురాక్రమణాలోచన చెరగలేదు
అలెగ్జాండర్ దుర్మరణం గాని
హిట్లర్ నికృష్టపు చావుగాని

09/08/2017 - 22:01

కదలి రండి కలసి రండి
తరతరాల చరిత వున్న
తెలుగు భాష కాపాడ!
తెగువజూపి ఉరకండి!!

ప్రాచీనత హోదా వున్న
ప్రపంచాన ప్రసిద్ధైన
అధికమంది పలుకాడె
తెలుగు భాష కాపాడ!
కదలి రండి కలసి రండి
తెలుగు భాష కాపాడ!!

09/08/2017 - 22:01

త్రాగటానికి
మంచినీళ్లు లేవు
రైతు కళ్లల్లో నిండుగా
రాత్రి
ఆకులు రాలితే
చెట్టు వణికింది

పలక మీద
అక్షరాలు బాల్యానికి
వీలునామా

వాకిట్లో
రంగవల్లి
చూపుల జలపాతం

చూపుల చినుకులతో
ఇంట్లో తుఫాను
బుల్లితెర

రొయ్య మడుగులతో
కాలుష్యం
నేలతల్లి గుండె నిండా
చీమ
క్రమశిక్షణ
మనిషికి లేదు

09/08/2017 - 21:59

అది నా అదృష్టం
ఆ కవితా చంద్రుడిని కలిశాను
వెనె్నల్లో తడిసిన కలువపూవులా మురిశాను

సినారె దర్శనం ఆకాశమంత తన్మయత్వం,
గంపెడు పూలవర్షం
ఆనందం అనంతం.

ఆ ఆనందంలో
ఆ మైమరపులో
నమస్కరించాను,
కరచాలనం ఇమ్మంటూ నా అరచేయిని
వారి ముందుకు సాగనంపాను

క్షణకాలం నా కుప్పిగంతులు చూసి
పిల్లాడిని లాలించినట్టు
సన్నగా నవ్విన ‘విశ్వంభర’,

09/08/2017 - 21:58

ఇప్పుడు
నమ్మించడమే జీవితం
నమ్మకం కాదు
కానితనపు రక్తాన్ని
నరాలూ తిరస్కరిస్తున్నప్పుడు
మనసు నవనతం చేసుకుంటే తప్పేంటి
తలెత్తుకునే కదా బతకడం
విశ్వాసాన్ని శ్వాసిస్తానంటే ఎలా
ఊపిరి అందని ద్రాక్షౌతుంది
అసలు అలల్ని అరెస్టు చెయ్యాలి
పయనానికి పడిలేవడాలు నేర్పినందుకు
గమ్యాలు చేరేది అలలు కాదు కలలు
మూతపడటం లేదంటూ

Pages