S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంటర్ స్పెషల్

08/25/2018 - 21:46

**భారతదేశంలో మతవాదం పెచ్చరిల్లడమనేది, మన చరిత్రను ముఖ్యంగా, మధ్యయుగాల చరిత్రను వక్రీకరించడంతో ప్రత్యక్షంగా ముడిపడివుంది. ఈవిధంగా పక్షపాత బుద్ధితో చరిత్రను వక్రీకరించి ప్రదర్శించడం ఘోరమైన నేరం! అది మతపరమయిన అసహనాన్ని పెంచి పోషిస్తుంది. ఇలాంటి అసహన కథనాలు, కల్పనలు, కట్టుకథలు ఇతరుల పట్ల మతపరమైన ద్వేషానికి ప్రాతిపదికలుగా మారతాయి, అది హింసకు దారితీస్తుంది.

05/05/2018 - 22:58

ప్రస్తుత సమాజంలో రోజురోజుకీ మార్పులూ చేర్పులూ జరుగుతూ ఆధునీకరణ దిశగా అందరూ అడుగేస్తున్నారు. ఇందులో భాగంగానే పాత పద్దతులు, పూర్వపు అలవాట్లు, సాంప్రదాయాల్లో కూడా మార్పులు చేర్పులు చేసుకుంటూ ఎవరికిష్టమైన రీతిలో వారికి అనుకూలంగా జీవన విధానాన్ని మలుచుకుంటున్న రోజులివి.

01/19/2018 - 18:47

ప్రపంచ తెలుగు మహాసభల సంరంభం ముగిసింది. ఇప్పుడు అక్షర సంరంభం మొదలైంది. పుస్తక ప్రియులు వేచిచూసే మహోత్సవం రానేవచ్చింది. 1985 నుంచి సంప్రదాయంగా మొదలైన పుస్తక ప్రదర్శన హైదరాబాద్‌కు ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపెట్టింది. తెలంగాణ ఏర్పడిన తరువాత పుస్తక ప్రదర్శనలు జిల్లాల వారీగా కూడా జరిపేందుకు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతున్న పుస్తక ప్రదర్శన అట్టహాసంగా మొదలైంది.

01/19/2018 - 18:45

‘పుస్తకం హస్త్భూషణం’ అన్నది ఆణిముత్యం లాంటి మాట. చదువు రాని వాడు పుస్తకాన్ని కేవలం అలంకార ప్రాయంగా ధరిస్తాడు - అన్న అర్థంలో ఆ మాట లోకంలో వ్యాప్తిలో ఉన్నప్పటికినీ, అసలు గాజులూ, గడియారాలూ, ఉంగరాలూ - ఇవి చదువుకున్న మనిషి చేతికి అలంకారాలు కావు. మంచి పుస్తకమే మనిషి చేతికి నిజమైన భూషణం.

06/10/2017 - 22:24

అసలే ఆంధ్రా ఊటీ... ప్రకృతి అందాల్లో మేటి... ఎటుచూసినా ఆహ్లాదం... ఆనందం... ఇక పర్యాటకుల కనువిందుకు కొదవేముంది? భిన్నమైన వాతావరణంతో ప్రకృతి అందాలన్నీ ఒకేచోట ఆరబోసినట్లుగా ఉండే అరకు సోయగం గురించి ఎంత చెప్పినా తక్కువే. తనివితీరా ఆస్వాదించాలే తప్ప మాటల్లో ఒదిగిపోయేది కాదు. మనసును ఆహ్లాదపరిచే అలాంటి అందాలను రైలు బోగీలోంచే తిలకించే సౌలభ్యం ఉంటే ఇక చెప్పేదేముంది?

04/30/2017 - 00:54

గంగోత్రి కొన్ని క్షణాలు వౌనంగా ఉన్నాడు.
‘నీకెంత కావాలి?’ యుగంధర్ కళ్లల్లోకి చూస్తూ అడిగేడు.
బదులుగా నవ్వి,
‘అయిదేళ్ల క్రితం లక్ష్మీ టాకీస్ దగ్గర వ్యభిచార గృహం ఉండేది. ఆ తర్వాత దాన్ని హైటెక్ వ్యభిచారంగా మార్చావు. మొత్తం ఇరవై ఎనిమిది అమ్మాయిలు, తొమ్మిదిమంది యువకులు పని చేస్తున్నారు. వివేక్ నీ వ్యాపారానికి అడ్డు తగిలాడని అతన్ని షరీఫ్‌తో చంపించావు’ చెప్పాడు యుగంధర్.

04/22/2017 - 21:18

‘సిట్‌డౌన్..’ అతని సెల్యూట్ రిసీవ్ చేసుకుని అన్నాడు కమీషనర్. ఆ తర్వాత యుగంధర్ వైపు చూసి తలూపేడు.
ఆ రూములో అందరూ చూడటానికి వీలుగా అమర్చిన టివి దగ్గరకు నడిచాడు యుగంధర్. డివడిలో ఓ కేసెట్ ఉంచి ఆన్ చేసి తిరిగొచ్చి తన సీటులో కూర్చున్నాడు. తెర మీద ఓ గది, అందులో డబుల్ కాట్ బెడ్ ప్రత్యక్షమయ్యాయి. వయసు మీరిన పురుషుడు, వయసులో ఉన్న అమ్మాయితో జరిపిన శృంగారం అది.

04/16/2017 - 01:42

ముందు క్రైంబ్రాంచ్‌కి వెళదాం. నువ్వుండటానికి మరోచోట వెతకాలి..’ సాలోచనగా అన్నాడు.
రాసమణిని తీసుకుని కంట్రోలు రూమ్ చేరుకున్నాడు రాజేష్. అప్పటికి యుగంధర్ ఇంకా రాకపోవడంతో వెయిటింగ్ హాలులో కూర్చున్నారు. క్రైం బ్రాంచ్ కంట్రోలు రూము పైభాగంలో ఉంది. అక్కడే మిగతా ఆఫీసులు ఉండటంతో సిబ్బంది అటూ ఇటూ తిరుగుతున్నారు.

04/15/2017 - 22:57

‘ఎప్పుడెళ్లింది?’ అసహనంగా అడిగేడు షరీఫ్.
‘తెలియదు... ఉదయం నేను వచ్చేసరికి మేము ఎప్పుడూ ఉంచే పూలకుండీ కింద కీ ఉంది. ఇంతవరకూ చూసి రాకపోవడంతో నీకు ఫోన్ చేశాను’ చెప్పింది రమణిమాల.
అప్పుడు ఉదయం పదకొండు అయింది సమయం.
‘బట్టలేమయినా తీసుకెళ్లిందా?’ అడిగి చుట్టూ చూశాడు.
‘లేదు’
‘సరిగ్గా చూశావా?’

04/08/2017 - 23:13

తనకి సమాచారం ఇవ్వగల భూపతి అతనేనని అర్థమయింది యుగంధర్‌కి. దాదాపుగా ఆరేళ్ల నుంచి కనిపించకుండా పోయిన మనిషి ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు. అంతేకాకుండా అదే సమయంలో వ్యభిచార వృత్తిలో కొనసాగిన సుకాంతి గురించి భూపతికి తెలిసుంటుందా? పైన తిరుగుతున్న ఫ్యాన్ నుంచి వస్తున్న గాలి కూడా యుగంధర్ బుర్రలోని ఆలోచనల వేడిని తగ్గించలేక పోతోంది.

Pages