S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'క్లాప్' కొట్టు గురూ!

09/16/2017 - 16:41

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి కెరీర్ యమ జరుమీదుంది. చేసే సినిమాలు అయితేనేమి.. పోషించే పాత్రలు అయితేనేమి... వేటికవే భిన్నంగా వుండేలా చూసుకుంటూ కెరీర్‌లో మంచి స్థాయికి ఎదిగేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది. తాజాగా నాగచైతన్యతో ‘యుద్ధం శరణం’ చిత్రం చేసింది. టాలీవుడ్‌లో అటు క్రేజీ హీరోలు, ఇటు యువతరం కథానాయకులతో జోడీ కడుతూ తనకంటూ ఓ ఇమేజ్‌ని సృష్టిచుకుంటోంది.

09/16/2017 - 16:38

చాలా కాలంగా అవకాశాలే లక్ష్యంగా గ్లామర్ విషయంలో హద్దులు మీరి నటిస్తున్న సెక్సీ నటి రాయ్‌లక్ష్మీ. తాజాగా బాలీవుడ్ చిత్రం ‘జూలీ-2’లో ఈ అమ్మడి గ్లామర్ హద్దులు మీరింది. ఈ భామ చిందించిన గ్లామర్ హద్దులు మీరిందని అందరూ అనుకుంటున్నారు. వారి మాటలను నటి రాయ్ సిల్లీగా కొట్టి పారేస్తోంది.

09/16/2017 - 16:35

నచ్చినోడు దొరికితే ఇట్టే పెళ్లికి రెడీ..అంటోందిట అందాల తార కాజల్ అగర్వాల్. టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో అతి తక్కువ సమయంలో అగ్ర హీరోలతో జోడీకట్టి తన నటనతో అందర్నీ ఆకట్టుకున్న ఈ అమ్మడు బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి అక్కడా తనేంటో నిరూపించుకునే దిశలో అడుగులు కదుపుతోంది.

09/16/2017 - 16:32

హాలీవుడ్ బ్యూటీ ఏంజెలీనా జోలీ ఏడాది విరామం తర్వాత మళ్లీ అభిమానులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఏంజెలీనా చేసిన చిత్రాలు.. ఆయా చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు మరపురానివి. తన వైవాహిక జీవితంలో ఎదురైన సంఘటనలతో కొంతకాలం ఆమె నటనకు దూరమైంది. గత సంవత్సరం బ్రాడ్‌పిట్ నుంచి విడాకులు తీసుకుంది.

09/09/2017 - 20:50

టాలీవుడ్‌లోనే కాదు, దక్షిణాదిన అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకొంటున్న భామల జాబితాలో అనుష్క పేరు కూడా వుంటుంది. అతి తక్కువ సమయంలో కోటి రూపాయల మార్కుని చేరుకోగలిగింది ఈ బ్యూటీ. నటించిన చిత్రాల్లో అనుష్క చేసిన క్యారెక్టర్స్ వేటికవే భిన్నంగా వుండడంతో అటు చిత్రసీమ, ఇటు ప్రేక్షకులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ఒకటా.. రెండా ఎన్నో వైవిధ్యమైన, అరుదైన పాత్రల్లో నటించి జీవించింది.

09/09/2017 - 20:48

....అంటున్నారు టాలీవుడ్ సినీ జనాలు నవతరం కథానాయిక సాయి పల్లవి అత్యాశను చూసి. ఎదుగుతున్న నటికి ఆశ వుండాలే కానీ, మరీ ఇంత అత్యాశ పనికిరాదని కూడా వాపోతున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘్ఫదా’తో అందరి అభిమానాన్ని చూరగొనడమేగాక, తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా యువతరం మనసుల్ని తన నటనతో కొల్లగొట్టేసి, తన వైపునకు తిప్పుకుంది సాయి పల్లవి.

09/09/2017 - 20:46

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా రూటే సపరేటు. బాలీవుడ్‌లో శత్రఘ్న సిన్హా తనయగా వెండితెరపై అడుగుపెట్టినప్పటికీ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది. కెరీర్‌లో క్రేజీభామగా బాలీవుడ్‌లో ఉన్నత స్థాయికి ఎదిగింది. తనకు లభించిన చిత్రాల్లో తను పోషించిన మంచి పాత్రలే కెరీర్‌లో ఎదిగేలా చేసాయంటోంది సిన్హా. ‘‘నటిగా నన్ను నేను నిరూపించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. అలా అనుకోను కూడా.

09/09/2017 - 20:43

నవతరం కథానాయికలకు టాలీవుడ్ ఎప్పుడూ అక్కున చేర్చుకుంటూనే వుంటుంది. వారి ప్రతిభను గుర్తించి తమ చిత్రాల్లో మంచి పాత్రలు చేసేలా ప్రోత్సహిస్తుంటుంది. ఇప్పుడు అలాంటి కోవలోకే చేరింది బ్యూటీ మేఘా ఆకాశ్. తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇస్తూనే మంచి అవకాశాలను తన ఖాతోలో వేసుకుంటూ బిజీ బిజీగా మారుతోంది. యంగ్ హీరో నితిన్ 25వ చిత్రంతో పాటు, రామ్‌తో మరో సినిమాలో నటిస్తూ యమ స్పీడుగా ఉరకలేస్తోంది మేఘా.

09/01/2017 - 21:30

తెలుగు, తమిళ చిత్రాల్లో అతి తక్కువ సమయంలో అగ్ర హీరోలందరి సరసన ఆడిపాడిన ముద్దుగుమ్మ ప్రియమణి శ్రీమతిగా కొత్త అవతారం ఎత్తింది. అవతారమంటే చిత్రాల్లో కాదు సుమా! నిజ జీవితంలో శ్రీమతిగా అడుగుపెట్టింది. ప్రముఖ వ్యాపారవేత్త ముస్త్ఫా రాజ్‌తో కొనే్నళ్లుగా పీకలోతు ప్రేమలో కూరుకుపోయింది. ఒకరినొకరు గాఢంగానే ప్రేమించుకున్నారు. ఈ ప్రేమజంట ఇటీవలే జరిగిన పెళ్లితో ఒక్కటయ్యారు.

09/01/2017 - 21:29

బాలనటిగా అనేక చిత్రాల్లో చక్కటి నటనను కనబరిచి అందర్నీ ఆకట్టుకున్న షామిలీ కథానాయికగా రంగప్రవేశం చేసి కెరీర్‌లో నిలదొక్కుకోలేకపోయింది. బాలనటిగా మాత్రమే ప్రేక్షకులు ఆమెను ఆదరించారు కానీ, హీరోయిన్‌గా మాత్రం చూడలేకపోయారు. గతంలో చాలా మంది హీరోయిన్లు దర్శకులుగా అవతారమెత్తారు. ఇప్పుడు ఆ జాబితాలో షామిలీ కూడా చేరే ప్రయత్నం చేస్తోందిట.

Pages