S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నమ్మండి! ఇది నిజం!!

09/16/2017 - 22:32

బయట వర్షం. అర్ధరాత్రి. వర్షంతో కూడిన ఉరుములు, మెరుపులు. ఎలెన్ కెవ్వున అరుస్తూ లేచి కూర్చుంది.
‘ఏమిటి?’ ఆ అరుపునకు మెలకువ వచ్చిన ఆమె భర్త జార్జ్ అడిగాడు.
‘మీరు మరణించడం చూశాను’ భయంగా చెప్పింది.
‘పీడకలై ఉంటుంది. పడుకో’
‘కల కాదు. అది నిజంగా చూస్తున్నట్లుగా అనిపించింది’ ఎలెన్ చెప్పింది.
‘పడుకుందాం. రేపు మళ్లీ బేంక్‌కి టైంకి వెళ్లాలి’ జార్జ్ భార్యతో చెప్పాడు.

09/09/2017 - 23:21

1943
రెండో ప్రపంచ యుద్ధ కాలం. లండన్ నగరం.
మిలటరీ హెడ్‌క్వార్టర్స్‌లో వేచి ఉన్న ఎమిలీ దగ్గరకి యూనిఫాంలోని ఓ కల్నల్ వచ్చాడు.
‘ఆరు వేల మంది మరణించారు. మిలటరీ ఇంటలిజెన్స్‌కి తెలీని శత్రువులు మన సైన్యం మీద ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేస్తారో మీకు ముందే ఎలా తెలుసు?’ ఎమిలీని ప్రశ్నించాడు.
‘నేను గూఢచారిని అనుకుంటున్నారా?’ ఆమె కోపంగా ప్రశ్నించింది.

09/02/2017 - 23:13

హెన్రీ లండన్‌లోని మార్నింగ్ స్టార్ దినపత్రికలో విలేకరిగా పని చేస్తున్నాడు. ఓ ఉదయం అతను అలస్యంగా నిద్ర లేచాడు. చాలా అలసటగా అనిపించింది. అతనికి నాలుగుసార్లు ఏదో పేలుడు శబ్దాలు వినిపించాయి. అన్నిసార్లు అతని శరీరంలో బాధ కలిగి తూలి కింద పడ్డాడు. తర్వాత పెన్ను తీసుకుని కాగితం మీద ఏదో రాశాడు. 27 ఆగస్టు 1883 నాడు జరిగిన ఆ సంఘటన దినపత్రికల చరిత్రలో నేటికీ ప్రశ్నార్థకంగానే నిలిచిపోయింది.

08/26/2017 - 22:18

కొత్తగా పెళ్లైన కాన్రాయ్ తన భార్య శాలీతో లూజియానా రాట్రం నించి కేలిఫోర్నియాకి హానీమూన్‌కి కార్లో బయలుదేరాడు. కార్లో కొద్దిసేపు నిద్ర పోయిన శాలీ లేచాక కాన్రాయ్ అడిగాడు.
‘కలగన్నావా?’
‘నీకెలా తెలుసు?’
‘నిద్రలో నువ్వు అర్థం కాని శబ్దాలు చేసావు’
కారు కొద్ది దూరం వెళ్లాక ఆమె చెప్పింది.

08/19/2017 - 23:40

1937

08/12/2017 - 22:09

చికాగోలోని ఎడెలా తన భర్త జోతో ఓ మ్యూజియంకు వెళ్లినప్పుడు ది టోర్మెంటా (తుపాను) అనే ఓ ఆయిల్ పెయింటింగ్‌ని చూసింది. దాని మీది పెడ్రో కస్తేరా అనే చిత్రకారుడి సంతకం చూసి కొద్దిగా ఆశ్చర్యపోయింది. అది పెడ్రో గీసిన చిత్రం కాదని, అతను మూడేళ్ల క్రితమే మరణించాడని ఎడెలా జోతో చెప్పింది.
‘అతని సంతకం నకిలీది అంటావా?’ జో అడిగాడు.
‘కాదు. కాని...’ ఆమె సందిగ్ధంగా ఆగింది.

08/06/2017 - 23:46

ప్రతీ దేశంలో తప్పిపోయిన వారి వివరాలని నమోదుచేసే ‘బ్యూరో ఆఫ్ మిస్సింగ్ పర్సన్స్’ అనే శాఖ ఉంటుంది. అమెరికాలో ఎవరూ కనుక్కోలేని విధంగా ఓ వ్యక్తి కొంతకాలం క్రితం మాయం అయ్యాడు. అతని పేరు ఛార్ల్స్ ఎల్టన్.

07/30/2017 - 23:28

బ్రిటన్‌లోని హాస్పిటల్స్ వైద్య విద్యార్థులకి పాఠాలు చెప్పడానికి శవాలని కొనేవి. కొందరు దొంగలు సమాధులని తవ్వి వాటిని తెచ్చి అమ్ముతూండేవారు. కొన్ని అస్థిపంజరాలు హాస్పిటల్స్‌కి వచ్చాక రోగులకే కాక సిబ్బందికి కొన్ని కష్టనష్టాలు రావడం పరిపాటిగా ఉండేది.

07/22/2017 - 22:42

ఆర్నాల్డ్ వృత్తి నైట్ క్లబ్స్‌లో హిప్నాటిజం వినోదాన్ని అందించడం. అతను ఎవర్నైనా హిప్నొటైజ్ చేయగలడు. బ్రిటన్‌లోని కన్నింగ్‌హేమ్‌లో ఓ పార్టీలో కొందరు అతిథుల ముందు అతను ఛెరిల్ని హిప్నొటైజ్ చేశాడు.

07/16/2017 - 04:26

ఈసంఘటన ఇండియాలో పుట్టి పెరిగిన ఇంగ్లీష్ రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్ జీవితంలో జరిగింది. ఓసారి అతను కలకత్తా నించి ముస్సోరీకి వెళ్లాడు. వర్షం, ఈదురుగాలి ఉన్న ఆ రాత్రి ఓల్డ్ రోడ్లోని గవర్నమెంట్ డాక్ బంగ్లాలో బస చేశాడు. ఎర్రటి ఇటుకల గోడలు, పైన రైలు పట్టాలని దూలాలుగా వాడిన కప్పుగల ఆ బంగ్లాలోని ప్రతీ గదిలోని ఫర్నిచర్ మీద దాని పేరు, నంబర్ తెల్లరంగుతో పెయింట్ చేసి ఉన్నాయి.

Pages