S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతో - మీరు

11/18/2017 - 22:19

కవర్‌స్టోరీ ‘చదువా చంపకే’ ఆలోచింపజేసింది. కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడటంతో సహజంగానే ఆ కాలేజీల్నే దోషులుగా చూడటం జరుగుతోంది. కాని మార్కులు, ర్యాంకులూ అంటూ తల్లిదండ్రులు పెట్టే ఒత్తిడి కూడా ముఖ్య కారణమే. ఏ చదువులూ, పరీక్షలూ లేకుండా విద్యార్థులు పదో తరగతి వరకు వచ్చేసి అక్కడ నుంచి పరీక్షల గట్టు ఎక్కలేక ఒత్తిడికి గురి కావడం మరో ముఖ్య కారణం.

11/11/2017 - 22:05

‘చదువా చంపకే’ శీర్షికన అందించిన వ్యాసం ఆలోచింపజేసేదిగా ఉంది. ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా తల్లిదండ్రులు ఇంకా తమ పిల్లలను కార్పొరేట్ కాలేజీల్లోనే చదివిస్తున్నారు. లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నారు. అందరూ డాక్టర్లు ఇంజనీర్లు అయిపోవాలి. అదే వాళ్ల కోరిక. ముందు తల్లిదండ్రులు మారాలి. పిల్లల మనసులను అర్థం చేసుకోవాలి. అప్పటివరకు ఈ ఆత్మహత్యలు ఆగవు.

11/04/2017 - 22:08

కష్టం, బాధ, నొప్పి ఉంటూనే ఉంటాయి. వాటిని అధిగమించి పని చేస్తూనే ఉండాలి. ముఖ్యంగా - సృజనకారులు - అంటూ చెప్పిన ‘ఓ చిన్న మాట’ అద్భుతంగా ఉంది. అక్షరాలోచనల్లో ‘పుస్తకం తెరిస్తే’ కవిత మాకు బాగా నచ్చింది. అలాగే నానీలు కూడా. అనురాగం లేని మనసున సుజ్ఞానం రాదంటూ అమృతవర్షిణిలో చక్కగా వివరించారు. కుంచెం తేడాగా కార్టూన్లు నవ్వించాయి.

10/28/2017 - 23:36

ఒకప్పుడు పల్లె - పట్నం అంతటా పోస్ట్ఫాస్‌తో అనుబంధం ఉండేది. ఒకరి నుండి మరొకరు క్షేమ సమాచారాలను తెలుసుకోవడానికీ, వివిధ ఉపయోగాలకు పోస్టుకార్డులు, ఇన్‌లాండ్ కవర్లు, ఎన్‌వలప్ కవర్లు ఉండేవి. మనియార్డర్ వచ్చిందంటే ఎక్కడలేని ఆనందం. టెలిగ్రాం వచ్చిందంటే టెన్షన్. నేటి సెల్‌ఫోన్లు తదితరాల మూలంగా మనిషికీ పోస్ట్ఫాసుకీ అనుబంధం తగ్గిపోయింది.

10/21/2017 - 21:33

తపాలా వ్యవస్థ భారతీయ సమాజంలో విడదీయలేని బంధాన్ని... పెనవేసుకుంది.... ఒకప్పుడు ఆ ఒక్క కాగితం ముక్క మనసులోని మాటను మోసుకొచ్చేది.. రాయబారాలు నడిపేది.. శ్రీవారికి ప్రేమలేఖ అదేమరి. మంచి వార్తలను, బాధ కలిగించే పరిమాణాలకు ప్రమాణపత్రంలా ఉండేది. ఊసులు, ఉబుసుపోని కబుర్లు, ప్రేమపాఠాలు, ప్రేమరాగాలు, సందేశాలు ఒకటేమిటి.. కవితలు.. కాలక్షేపానికి రాసే ఉపన్యాసాలు అంతేనా..

10/15/2017 - 00:31

ఎన్నో ఏళ్ల క్రితం మనం చదువుకున్న కాలేజీ, మొదటిసారి ఉద్యోగంలో చేరిన ఊరు, ఇలాంటి వాటిని దర్శించినప్పుడు అంతా నిన్న మొన్న జరిగినట్లు అనిపించడం సహజం. తెలియకుండానే కాలం గడిచిపోతుంది. కాని మిగిలిన కాలం అయినా సద్వినియోగం చేసుకోవాలని చెప్పిన ‘ఓ చిన్నమాట’ ఎంతో బావుంది. ‘చిత్రం భళారే విచిత్రం’ కవిత బాగుంది.

10/07/2017 - 22:46

మనసులో ఓ ఆలోచన రాగానే, దాన్ని సాగదీసి అనేక సమస్యలను, సంఘటనలను గుదికూర్చి సమాజానికి అందించాలంటే, తక్షణమే జేబులోనున్న ఓ చిన్న నోట్‌బుక్‌లో చిన్న మాటగా రాసుకుంటే అదే ఓ వ్యాసం రాయడానికో, కథ రాయడానికో మార్గదర్శకం అవుతుంది. గరికిపాటి నరసింహారావు గారు ఈ మాటే పదేపదే చెబుతూంటారు.

09/24/2017 - 00:09

మహిళలు వివిధ రంగాలలో ఎలా దూసుకు వెళుతున్నారో ‘సాగర కన్యలు’ వ్యాసం మరింతగా ప్రస్ఫుటింపజేసింది. ఈ వ్యాసాన్ని ఆడపిల్లలందరూ చదివి జీవితంలో వారు కూడా అలా ఉన్నత విద్యార్జనలోని లోతుపాతులను గ్రహించి అత్యున్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తున్నాం. విజయవాడ ఆకాశవాణిలో దాదాపు యాభై ఏళ్ల క్రితం ప్రసారమయిన రాగరంజిత, రసరమ్యమైన గేయాలు ఎప్పుడూ గుర్తుంచుకోదగ్గవి. నిత్యం వినదగ్గవి.

09/16/2017 - 22:46

తెలుగు భాషా వికాసానికి, గ్రంథాలయాల విస్తరణకు పాటుపడిన గిడుగు రామ్మూర్తి లాంటి వారి జయంతులకు, ఏటా జరుపుకునే తెలుగు మహాసభలలోనూ, మధ్యమధ్యలో తెలుగు భాషా పునరుద్ధరణకు సభలు, సమావేశాలు నిర్వహించడమే కాని వాస్తవంగా మన పిల్లలకు తెలుగు బోధించే విద్యాలయాలు ఎన్ని ఉన్నాయి? తెలుగు మాధ్యమంలో చదవడానికి చదివించడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు ముఖ్యంగా ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు?

09/09/2017 - 21:29

అందలమెక్కిన అందరివాడు ‘కవర్‌స్టోరీ’ మాకెంతో నచ్చింది. ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు గారు గతంలో ఎన్నికల ప్రచారానికి అనంతపురానికి వచ్చినపుడు వారి ఉపన్యాసం వినడం జరిగింది. ఆయన గొప్ప ఉపన్యాసక చక్రవర్తి. ఏ భాషలోనైనా అనర్గళంగా ఉపన్యసించి అందరినీ మంత్రముగ్ధుల్ని చేయగల వ్యక్తి. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు అందించిన చేయూత మరువరానిది.
-కైప నాగరాజు (అనంతపురం)
నమ్మకం

Pages