S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినదగు!

11/11/2017 - 21:28

మరణం తర్వాత సరాసరి స్వర్గానికే చేరతామన్న విశ్వాసాన్ని ఎవరు ఎంతలా మనలో పాదుకొల్పినా ఆ స్వర్గ సుఖం అనుభవించిన తర్వాతనైనా మరణం ఉండదన్న గ్యారంటీ ఇస్తారా? అని అడుగుతాం. ఇదీ మన సైకాలజీ... మృత్యువును గురించిన భయం. ఈ దేహ స్థితిపైన ప్రేమ.. మమకారం.. ప్రాపంచికతపై మోజు - తీరనంత కాలం, వియోగం పుట్టనంత వరకు - మృత్యువు ‘్భయం’కరంగానే కనిపిస్తుంటుంది. మృత్యు రాహిత్య స్థితిని గురించిన తపన పెరుగుతూనే ఉంటుంది.

11/04/2017 - 21:21

‘భగవద్గీతను యోగ శాస్త్రంగానే పరిగణించాలంటారా?’
నా వ్యాఖ్యానాలతో ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా చైతన్య ప్రశ్న.

10/29/2017 - 00:22

‘నాకు నేనుగా ఉండలేనా?’
కలిసిన ప్రతిసారి చైతన్యం ఇలాగే ప్రశ్నిస్తుంటాడు.
చైతన్యకు అవి ప్రశ్నలు కావచ్చు కానీ నాకు మాత్రం అవి ప్రశ్నల్లా అనిపించవు. అది ఆరాటం... తపన.
నిజానికి, ఈ ప్రశ్నలు చైతన్య ఒక్కడిదే కాదు, తన తరానికి చెందిన ఆరాటమే కాదు.. అది తరతరాల తపన.
తపనకు సమాధానం తపస్సు, యోగ సాధన తప్ప మాటల అల్లిక కాదు... ఆలోచనల గూడూ కాడు.

10/15/2017 - 00:41

మనం మన ఇంద్రియాలకు, మన మనస్సుకు, మన మేధకు అనుచరులమే! అవి కొలువున్న మానవ దేహం, మానవ అవతారం మనది. ఒక విధంగా ఈ మానవ అవతారమే ఒక అయోమయ అసందిగ్ధ స్థితి. సంఘర్షణల స్థావరం. ఒక గందరగోళ వ్యవస్థ ఈ మానవ ఉనికి. కాబట్టి అనుచరత్వం నుండి నాయక తత్వంలోకి పరిణమించాలంటే ఈ ఇంద్రియాలకు, మనస్సుకు, మేధకు అతీతం కావలసిందే! అంటే, వాటి చెప్పుచేతల్లోంచి విడివడాల్సిందే!

10/07/2017 - 21:24

జన్మతః సిద్ధించింది జ్ఞానం.
జీవన పోరాటంలో అంది వచ్చింది విజ్ఞానం.
ఇహ పర జీవన సాధనా ఫలితం ప్రజ్ఞానం.
అంటే, సంపూర్ణ పరిణితి విస్తృత సంకేతం ప్రజ్ఞానం.
ఇటువంటి ప్రజ్ఞానమూర్తి గీతా కృష్ణుడు.

09/16/2017 - 22:13

‘బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ
శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేష వ్యుదస్య చ’
‘అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్
విముచ్య నిర్మమః శాంతో...’
‘సమం సర్వేషు భూతేషు...’
‘సర్వ కర్మాణ్యసి సదా కుర్వాణో...’ అంటూ ‘పురుషోత్తమ యోగం’ అనే పేరుతో ఇహ - పర నాయకత్వ లక్షణాలను అర్జునుడి ముందుంచుతాడు కృష్ణుడు.

09/09/2017 - 21:11

మనకంటూ ‘అహం’ ఉంది.. ‘వ్యక్తిత్వం’ ఉంది. ‘స్వ ఇచ్ఛ’ ఉంది.. ‘ఆశ’ ఉంది.. ‘కోరిక’ ఉంది - ఇవన్నీ బలంగా ఉన్నంతకాలం మనది సామాన్య బ్రతుకే! మన ఆంతరిక బలాన్ని, ఆత్మధర్మాన్ని ఈ బాహిర ఆకర్షణలు కప్పిపుచ్చుతున్నంత కాలం మనం ఒకరి వెంట అనుచరులుగా అడుగులు వెయ్యవలసిన వారమే!

07/22/2017 - 21:36

‘సుఖ దుఃఖే సమేకృత్వా లాభాలాభౌ జయాజయా
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి’
- ఇది కృష్ణ ఉవాచ. నాయకుడికి ఉండవలసిన ప్రథమ లక్షణాలను ఈ కృష్ణ గీత విశదపరుస్తోంది. రాగద్వేషాలకు అంటే భావోద్విగ్నతలకు అతీతం కాగల నాయకతత్వం అవసరం అన్న ఉద్బోధ కృష్ణుడి మాటలలో కానవస్తుంది.

07/08/2017 - 23:40

విరుద్ధతులు లేని సృష్టి లేదు. విరుద్ధత చోటు చేసుకోని మానవజన్మ లేదు. విరుద్ధతకు అవకాశం ఇవ్వని సంఘటనా లేదు. ఇలా చూసినప్పుడు ఎంతటి మహిమాన్విత నాయకుడికైనా, ఎంతలా ప్రామాణిక నాయకుడనిపించుకున్నా అంతటి ఆదర్శ మార్గదర్శికి సైతం బాహ్యం, అంతరంగం అనేవి ఉండకపోవు. ఈ రెండూ ఒకే నాణేనికున్న బొమ్మాబొరుసుల్లా నాయకతత్వంపై బాహ్యం, ఆంతర్యం ప్రభావం చూపిస్తూనే ఉంటాయి.

06/24/2017 - 21:34

‘కుతస్త్వా కశ్శల మిదం విషమే సముపస్థితమ్
అనార్యజుష్ట మస్వర్గ్య మకీర్తికర మర్జున’

Pages