S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/19/2018 - 20:07

మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. హరీష్ వడ్‌త్యా దర్శకత్వంలో రూపొందిన చిత్రంలో శ్రీకాంత్, జిషాన్ ఉస్మాని, సంగీత హీరో హీరోయిన్లుగా నటించారు. చిత్ర ఆడియో విడుదల ఆదిత్య మ్యూజిక్ ద్వారా హైదరాబాద్‌లో జరిగింది. కార్యక్రమంలో హీరో శ్రీకాంత్, నిర్మాత మొహమ్మద్ జకీర్ ఉస్మాన్ చిత్ర సీడీలను విడుదల చేశారు.

11/19/2018 - 20:06

ఎం వరప్రసాద్ దర్శకత్వంలో నిర్మాత జిఎమ్ మురళీధర్ నిర్మిస్తున్న చిత్రం సమయం లేదు మిత్రమా’. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో చిత్రాన్ని ప్రారంభించారు. పూర్తి కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రంలో నోయల్, ట్వింకిల్ సౌజ్ (తొలి పరిచయం) హీరో హీరోయిన్లు. నిర్మాత జిఎమ్ మురళీధర్ మాట్లాడుతూ ‘ఇది నా మొదటి చిత్రం. డైరెక్టర్ వరప్రసాద్ చెప్పిన కథ, కథనం నచ్చి సినిమా నిర్మాణానికి ముందుకొచ్చాం.

11/19/2018 - 20:05

శివ, సోనాపటేల్ హీరోహీరోయిన్లుగా పైడి రమేష్ దర్శకత్వంలో పైడి సూర్యనారాయణ నిర్మిస్తోన్న చిత్రం రూల్ (ది పవర్ ఆఫ్ పీపుల్). 23న సినిమా విడుదలవుతోంది.

11/19/2018 - 20:03

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నేనుశైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’, ‘జనతాగ్యారేజ్’, ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బ్లస్టర్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తోన్న చిత్రం ‘చిత్రలహరి’. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం.. రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

11/19/2018 - 20:02

యు అండ్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తనీష్, పరుచూరి రవి, ప్రియాసింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, షఫీ, పోసాని కృష్ణమురళి ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘రంగు’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. కార్యక్రమంలో రాజ్‌కందుకూరి మాట్లాడుతూ తనీష్‌ను అతని బాల్యం నుంచే చూస్తున్నామని, ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందన్నారు.

11/19/2018 - 20:01

‘డియర్ కామ్రేడ్’ షూటింగ్‌లో విజయ్ దేవరకొండ చేతులమీదుగా హుషారు చిత్రంలోని ఫ్రెడ్షిప్ సాంగ్ విడదలైంది. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ నిర్మాత వేణుగోపాల్, దర్శకుడు హర్ష పాటను రిలీజ్ చేయమని అడిగారు. అప్పటికే సిద్ శ్రీరాం పాడిన పాట విన్నాను. దీనికి ముందు సినిమాకు సంబంధించిన సంఘటన ఒకటి చెప్పాలి. వాస్తవానికి పెళ్లిచూపులకు ముందే హర్ష ఈ సినిమా స్క్రిప్టు పంపించారు.

11/19/2018 - 19:51

ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం (యూనివర్సల్ చిల్డ్రన్స్ డే) నవంబర్ 20వ తేదీన జరుపుకుంటారు. నేటి బాలలే రేపటి నవ సమాజ నిర్మాతలు అనే ఆలోచనతో ఐక్యరాజ్యసమితి 1959లో బాలల హక్కుల ప్రకటన నవంబర్ 20వ తేదీన స్వీకరించడం జరిగినది.

11/19/2018 - 19:49

ఎప్పుడూ ఒకేరకమైన పులుసులు, ఇగురులూ తింటే బోర్ కొట్టేస్తాయి. అందుకే అప్పుడప్పుడూ కొత్తరకమైన వంటకాలను కోరుకుంటుంది నాలుక. పప్పు, పులుసులో కూరిన కూరలను నంజుకుని తింటే ఆ రుచే వేరు.. మరి అలాంటి కూరిన కూరలను ఒకసారి చూద్దామా..!

కాకరకాయలతో..

11/19/2018 - 19:39

మనిషి తయారు చేసిన
ఓటింగ్ యంత్రంలో లేవు
మాయలు, మంత్రాలు, తంత్రాలు!
ఉన్నదంతా మని‘షి’ మనసులోనే.!!
పెద్ద సార్లు పెట్టినారు పెడబొబ్బలు
ఉన్నది ఓటింగ్ యంత్రంలో
గడబిడ ఏదోనని..

చివరికి తేల్చారు లోటు
ఓటింగ్ యంత్రంలో కాదని
ఉన్నదంత మన వారి నోటిలోనేనని!

11/19/2018 - 19:38

కార్తీకద్వాదశినాడు మహావిష్ణువు బృందావ నానికి విహారానికి వస్తాడు. మహా భక్తురాలైన తులసి విష్ణుమూర్తిని రాకనుచూసి సంతోష తరంగిణి అవుతుంది. మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది తులసి. తులసి పూజ కోరిన కోరికలను ఈడేర్చట్టు చేస్తుంది. తులసిలో సర్వదేవతలు కూడి ఉంటారు.

Pages