S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/10/2016 - 05:34

జఫర్‌గడ్, డిసెంబర్ 9: జఫర్‌గడ్ మండలాన్ని వరంగల్ అర్బన్ జిల్లాలో కలపాలంటూ ఆందోళన చేస్తున్న జెఎసి నాయకులపై అధికారం అం డతో అక్రమ కేసులు బనాయిస్తున్నాడని మాజీమంత్రి గుండె విజయరామారావు అన్నారు.

12/10/2016 - 05:34

నర్సంపేట, డిసెంబర్ 9: 62వ పాఠశాలల క్రీడా సమాఖ్య రాష్ట్ర స్థాయి కబడ్డీ ఎంపిక క్రీడోత్సవాలను శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. నర్సంపేట పట్టణంలోని వల్లబ్‌నగర్ మినీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఎంపిక క్రీడా పోటీలు మూడు రోజుల పాటు జరగనున్న విషయం తెల్సిందే. ఈక్రమంలో శుక్రవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రారంభించి ప్రసంగించారు.

12/10/2016 - 05:34

నక్కలగుట్ట,డిసెంబర్ 9:తెలంగాణ రాష్ట్ర సాకారం చేసింది మహోన్నత నాయకురాలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాందీనే అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సోనియాగాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ అధ్వర్యంలో కృతజ్ఞతాదివస్‌ను నిర్వహించారు.

12/10/2016 - 05:32

సుల్తానాబాద్, డిసెంబర్ 9: అన్ని దానాల్లోకన్నా రక్తదానం మహాదానమని, రక్తదానం ద్వారా మరొకరి ప్రాణాలను కాపాడినవారవుతారని పెద్దపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 10వ వార్షికోత్సవం సందర్భంగా బ్యాంక్ మేనేజర్ కాసుల ముకుందరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని జ్యోతిప్రజ్వలన చేసి జెసి ప్రారంభించారు.

12/10/2016 - 05:30

భాన్సువాడ, డిసెంబర్ 9: అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అహరహం శ్రమిస్తున్న తెరాస ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అర్ధరహిత విమర్శలు చేస్తూ అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. పాదయాత్ర చేపట్టి సిపిఎం నాయకులు చేస్తున్న విమర్శల్లోనూ ఎలాంటి వాస్తవం లేదని, విమర్శలు చేసే ముందు సదరు పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు.

12/10/2016 - 05:28

విజయనగరం, డిసెంబర్ 9: వచ్చే ఏడాది జనవరి నుంచి ఆర్టీసీలోని అన్ని బస్సులకు అడ్వాన్స్ బస్ ఎంక్వైరీ సిస్టం విధానాన్ని అమలు చేస్తామని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ మాలకొండయ్య వెల్లడించారు. శుక్రవారం ఆయన ఇక్కడి ఆర్టీసీ వర్క్‌షాపు, బస్సు డిపోలను పరిశీలించారు.

12/10/2016 - 05:28

విజయవాడ, డిసెంబర్ 9: రాష్ట్రంలో కల్తీకి పాల్పడుతున్న వారిపై మరింత కఠినంగా వ్యవహరించి ఉక్కుపాదంతో అణచివేస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కల్తీ వ్యాపారులను హెచ్చరించారు.

12/10/2016 - 05:27

విజయవాడ, డిసెంబర్ 9: రాష్ట్రానికి 100 కోట్ల రూపాయల మేరకు చిన్న నోట్లను ఒకటి, రెండు రోజుల్లో సరఫరా చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిఖ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన విలేఖరులతో శుక్రవారం మాట్లాడుతూ 50, 100, 500 నోట్లు మాత్రమే ఇందులో ఉంటాయని తెలిపారు. దీని వల్ల జిల్లాల్లో చిల్లర నోట్ల సమస్య చాలా వరకూ తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

12/10/2016 - 05:26

ముంచంగిపుట్టు, డిసెంబర్ 9: విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం బరడ పంచాయితీ బొడ్డాపుట్టు రహదారి మధ్యలో మావోయిస్టులు అమర్చిన రెండు మందుపాతర్లను శుక్రవారం పోలీసులు నిర్వీర్యం చేశారు. కూంబింగ్ చేసే పోలీసులను లక్ష్యంగా చేసుకుని గతంలో మావోయిస్టులు అమర్చిన అధునాతన మందు పాత్రలను పక్కా సమాచారంతో వెలికితీసినట్టు పోలీసులు తెలిపారు.

12/10/2016 - 05:25

రేణిగుంట/్భమవరం, డిసెంబర్ 9: స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులపై ఖాతాదారులు ఎదురు తిరిగిన సంఘటన శుక్రవారం ఉదయం చిత్తూరు జిల్లా రేణిగుంటలో చోటుచేసుకుంది. రేణిగుంట ఎస్‌బిఐలో ఉదయం 7 గంటల నుంచి తమ డబ్బులు డ్రా చేసుకోడానికి ఖాతాదారులు వేచి ఉన్నారు.

Pages