S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/16/2016 - 18:10

పూణె: బంగారు చొక్కాతో పాటు వొంటినిండా పసిడి నగలు ధరిస్తూ ‘బంగారుబాబు’గా ప్రసిద్ధి చెందిన పూణె వ్యాపారి దత్తాత్రేయ పుగేను అతని కుమారుడు శుభమ్ స్నేహితులే కత్తులతో పొడిచి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. గురువారం అర్ధరాత్రి దత్తాత్రేయ ఓ పార్టీలో ఉండగా హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు సంబంధించి శుభమ్ స్నేహితులైన అయిదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

07/16/2016 - 18:09

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా తమ్రెల్ అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. పోలీసులు కూంబింగ్ జరుపుతుండగా తారసపడిన మావోలు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపగా నలుగురు మావోలు మరణించారు. మిగతా మావోయిస్టులు పరారయ్యాక సంఘటన స్థలంలో తుపాకులు, పేలుడు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

07/16/2016 - 18:09

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు మేలు జరిగేలా పార్లమెంటులో తమ గళం విప్పుతామని వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. అవసరమైతే అన్ని పక్షాలను కలుపుకుపోయి రాష్ట్రానికి మంచి జరిగేలా కృషి చేస్తామన్నారు. విభజన చట్టంలో హామీలు, పోలవరం ప్రాజెక్టు, రైల్వేజోన్ ఏర్పాటు, కేంద్రం నిధులు, ప్రత్యేక హోదా వంటి అంశాలపై తమ ఎంపీలు పోరాడతారని ఆయన ప్రకటించారు.

07/16/2016 - 18:08

ఇటానగర్: కొద్దిగంటల్లో అసెంబ్లీలో బలపరీక్ష జరుగనున్న నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి నబమ్ టుకి కాంగ్రెస్ శాసనసభా పక్షనేత పదవికి రాజీనామా చేయడంతో రాజకీయ పరిణామాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. సిఎల్‌పి నేతగా ఎన్నికైన పెమా ఖందు శనివారం రాష్ట్ర గవర్నర్ తథాగత రాయ్‌ను కలిసి తాను సిఎం పదవిని చేపట్టేందుకు సిద్ధమేనని, తనకు ఓ అవకాశం ఇవ్వాలని కోరారు.

07/16/2016 - 18:07

అనంతపురం: ప్రభుత్వం చేపట్టిన సాధికార సర్వేపై విపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని నమ్మరాదని ఎపి ఐటి, సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి శనివారం ఇక్కడ మీడియాతో అన్నారు. సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించాలన్న సంకల్పంతో సర్వేను చేపట్టామన్నారు. ప్రభుత్వానికి జనాదరణ పెరుగుతోందన్న కక్షతోనే విపక్షాలు సర్వేపై అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు.

07/16/2016 - 18:07

లెబనాన్: ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో ట్రక్కుదాడి జరిపి 84 మంది ప్రాణాలను బలిగొన్నది తామేనని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని ఉగ్రవాదుల వార్తా సంస్థ అమఖ్ శనివారం ప్రకటించింది. ట్రక్కు డ్రైవర్ తమ సంస్థలో సుశిక్షితుడైన సైనికుడని, తమను అంతం చేస్తామని సంకీర్ణదేశాలు ప్రకటించిన నేపథ్యంలో తాము నీస్‌లో దాడికి పాల్పడ్డామని ఐసిస్ స్పష్టం చేసింది.

07/16/2016 - 18:02

గుంటూరు : ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే బిడ్డల సంరక్షణకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ )ట్యాగ్‌ పథకాన్ని మంత్రి కామినేని శ్రీనివాస్‌ శనివారం గుంటూరు ఆసుపత్రిలో ప్రారంభించారు. ఇలాంటి పథకాన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలు చేయడం మన దేశంలో ఇదే తొలిసారి అని కామినేని తెలిపారు.

07/16/2016 - 17:56

హైదరాబాద్‌: తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. పాఠశాల విద్య ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ అశోక్‌ ఫలితాలను విడుదల చేస్తారు.

07/16/2016 - 17:28

ఢిల్లీ: టర్కీలోని భారతీయులంతా క్షేమంగా ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌కు 1100కి.మీ. దూరంలోని టాబ్జాన్ నగరంలో వల్డ్ స్కూల్ ఛాంపియన్‌షిప్‌ పోటీ పాల్గొనేందుకు 38మంది అధికారులతో కలిసి 148మంది భారతీయ చిన్నారులు టాబ్జాన్ వెళ్లారు. టర్కీలో సైనిక తిరుగుబాటు నేపధ్యంలో టర్కీలో ఉన్న భారతీయుల గురించి ఆందోళన వద్దని సుష్మా అన్నారు.

07/16/2016 - 17:01

దిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో శనివారం బంగారం, వెండి ధరలు తగ్గినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. రూ. 50 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ. 30,750గా ఉంది. రూ. 200 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.46,500గా ఉంది.

Pages