S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/10/2016 - 03:36

హైదరాబాద్, డిసెంబర్ 9: జెఎన్‌టియు హైదరాబాద్ యూనివర్శిటీ ఎట్టకేలకు విద్యార్ధి ఉద్యమాలకు తలొగ్గి ఫీజులను తగ్గించింది. గతంలో 1520 రూపాయిలున్న ఫీజును 765 రూపాయిలకు తగ్గించారని ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతకుంట సాయికుమార్ తెలిపారు. గత వారం రోజులుగా జెఎన్‌టియు సమస్యలపై విభిన్న రీతిలో ఉద్యమించడంతో యూనివర్శిటీ పాలనా యంత్రాంగం దిగివచ్చిందని అన్నారు.

12/10/2016 - 03:35

వికారాబాద్, డిసెంబర్ 9: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వౌలిక సదుపాయాలతో పాటు, ఆసుపత్రుల్లో ప్రసవాల నిర్దేశ లక్ష్యాలను దాటేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డి.దివ్య వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆసుపత్రుల్లో వౌలిక సదుపాయాలు, సమస్యలపై వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

12/10/2016 - 03:22

హైదరాబాద్, డిసెంబర్ 9: నానక్‌రాంగూడలో అనుమతి లేకుండా ఏడు అంతస్తుల మేడ కూలిపోయిన ఘటనకు రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారక రామారావు నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజీనామా చేసి తన నైతికతను చాటుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

12/10/2016 - 03:21

హైదరాబాద్, డిసెంబర్ 9: బ్యాంకుల ముందు చాంతాడంతో క్యూలు కనిపిస్తుంటాయి. కానీ ఈ బ్యాంకు క్యూలో ఉన్నది కొద్ది మందే అని ఉత్సాహంగా వెళ్లిన వారికి నిరుత్సాహం తప్పడం లేదు. బ్యాంకుకు వెళ్లగానే సారీ సర్వర్ డౌన్.. ఎప్పుడైనా పని చేస్తుందనే నమ్మకంతో వీళ్లు క్యూలో నిలబడ్డారు. ఆసక్తి ఉంటే మీరూ నిలబడండి అనే సలహా వినిపిస్తోంది. ఇది అల్వాల్‌లోని ఎస్‌బిహెచ్ బ్యాంకు పరిస్థితి.

12/10/2016 - 03:20

వరంగల్, డిసెంబర్ 9: వరంగల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకుని పారిపోయిన ఖైదీ రాజేశ్ యాదవ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. శుక్రవారం మట్వాడ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కమిషనర్ సుధీర్‌బాబు రాజేశ్‌యాదవ్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టారు.

12/10/2016 - 03:17

వరంగల్, డిసెంబర్ 9: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయని, కనీసం టాయిలెట్లు కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో కెసిఆర్ ప్రభుత్వం ఉందని టి-టిడిపి కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కానీ కొత్తగా క్యాంపు కార్యాలయం పేరిట ముఖ్యమంత్రి కట్టించుకున్న నివాస భవనంలోని తన బాత్‌రూంను బుల్లెట్ ప్రూఫ్ చేయించుకున్నారని ఆరోపించారు.

12/10/2016 - 03:14

హైదరాబాద్, డిసెంబర్ 9: పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాల వల్ల గణనీయంగా పడిపోయిన రాష్ట్ర ఆదాయం నేపథ్యంలో ప్రభుత్వ పంథాను ఏ విధంగా మార్చుకుందామనే అంశాన్ని మంత్రి వర్గ సహచరుల ముందు ముఖ్యమంత్రి చర్చకు పెట్టబోతున్నారు. నోట్ల రద్దు వల్ల తగ్గిన రాష్ట్ర ఆదాయాన్ని పూడ్చుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి. అలాగే వృధా ఖర్చులు ఎక్కడెక్కడా ఉన్నాయి? వాటిని ఏ విధంగా అరికడుదాం?

12/10/2016 - 03:13

హైదరాబాద్, డిసెంబర్ 9:పెద్ద నోట్ల రద్దు వల్ల డబ్బున్న పెద్ద వాళ్లకే ఇబ్బందులు అని గ్రామీణ ప్రజలు తొలుత భావించారని, కానీ పెద్దలు బాగానే ఉన్నారు, కానీ సమస్యలన్నీ సామాన్యులకే కలుగుతున్నాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. అవసరం అయిన కరెన్సీ అందుబాటులో లేక పోవడం వల్ల గ్రామీణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు , ఆర్‌బిఐ దీనిపై దృష్టిసారించారని, డబ్బుల పంపిణీ వేగవంతం చేయాలని సూచించారు.

12/10/2016 - 03:12

హైదరాబాద్, డిసెంబర్ 9: సార్వత్రిక ఎన్నికలకు ముందు టిఆర్‌ఎస్ ఇచ్చిన హామీల్లో ఏ మేరకు అమలు చేశారో బహిరంగంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారా? అని కాంగ్రెస్ నాయకుడు, శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ రాష్ట్ర మంత్రి టి. హరీష్ రావును ప్రశ్నించారు. మంత్రి హరీష్ రావుకు అసహనం ఎందుకని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ 182 హామీలు ఇచ్చిందని ఆయన చెప్పారు.

12/10/2016 - 03:12

హైదరాబాద్, డిసెంబర్ 9: తెలంగాణ శాసనమండలి, శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పేరిట శాసనమండలి (లెజిస్లేచర్) కార్యదర్శి డాక్టర్ ఎస్.రాజాసదారామ్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. ఈ నెల 23వ తేదీ వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉంది.

Pages