S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/10/2016 - 03:11

శంకర్‌పల్లి, డిసెంబర్ 9: శంకర్‌పల్లి మండల పరిధిలోని రావులపల్లి రైల్వేస్టేషన్ వద్ద పట్టా విరిగిన సంఘటనలో శక్రవారం ఉదయం షిర్డీ నుండి కాకినాడకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ప్రత్యక్షంగా చూసిన ప్రయాణికులు, శంకర్‌పల్లి స్టేషన్ మాస్టర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

12/10/2016 - 03:02

భద్రాచలం, డిసెంబర్ 9: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈసారి ముక్కోటి ఏకాదశి ఉత్తరద్వార దర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించనుంది. ప్రయోగాత్మకంగా తొలిసారి ఈ ప్రక్రియకు దేవస్థానం శ్రీకారం చుట్టింది. మొత్తం నాలుగు వేల టిక్కెట్లలో 50 శాతం అంటే 2వేల టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించనుంది. మిగిలిన 50 శాతం టిక్కెట్లలో 25 శాతం దేవస్థానం, 25 శాతం రెవెన్యూ శాఖ ద్వారా విక్రయించనున్నారు.

12/10/2016 - 03:01

హైదరాబాద్, డిసెంబర్ 9: అవినీతి నిరోధక వారోత్సవాలు వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ ఏసిబి డైరెక్టర్ జనరల్ ఎకె ఖాన్, డైరెక్టర్ చారుసిన్హాల ఆధ్వర్యంలో వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది.

12/10/2016 - 02:57

తిరుపతి, డిసెంబర్ 9: న్యూఢిల్లీకి చెందిన ఎంఎస్ పద్మనాభన్ అనే భక్తుడు శుక్రవారం శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ. ఒక కోటి 11వేలు విరాళంగా అందించారు.
తిరుమలలోని జెఇఓ క్యాంపు కార్యాలయంలో జెఇఓ శ్రీనివాసరాజుకు ఈ మేరకు విరాళం డిడిని అందజేశారు.

చిత్రం..తిరుమలలో విరాళం చెక్కును జెఇఓకు అందజేస్తున్న పద్మనాభన్

12/10/2016 - 02:55

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కెసిఆర్ కుటుంబంలోనే అభివృద్ధి జరిగిందని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ విమర్శించారు. తెరాస పాలనలో తెలంగాణలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని ఆరోపించారు.

12/10/2016 - 02:53

కరీంనగర్, డిసెంబర్ 9: క్రీడలకు, క్రీడాకారుల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, రానున్న రోజుల్లో దేశంలోనే తెలంగాణ క్రీడల్లో నంబర్ వన్‌గా నిలిచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

12/10/2016 - 02:50

హైదరాబాద్, డిసెంబర్ 9: వరుసగా బ్యాంకులకు మూడు రోజుల పాటు సెలవులు. రెండవ శనివారం, ఆదివారం, సోమవారం మిలాద్ ఉన్ నబీ బ్యాంకులకు సెలవు. దీంతో పరిస్థితి మరింత దిగజారనుంది. ఎటిఎంలలో నగదు లేక, బ్యాంకుల్లో డబ్బు లేక జనం కటకటలాడిపోతున్నారు.

12/10/2016 - 02:45

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: రాష్ట్ర విభజన చట్టం కింద ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్యాకేజీకి వీలున్నంత త్వరగా చట్టబద్ధత కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరినట్లు తెలిసింది. ఆయన శుక్రవారం జైట్లీతో సమావేశమై రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన ప్యాకేజీతోపాటు ఇతర ప్రాజెక్టుల అమలు గురించి చర్చించారు.

12/10/2016 - 02:44

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: విద్య, వ్యవసాయం, గనులు, సాంకేతికత తదితర రంగాల్లో కలిసి పని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెస్టర్న్ ఆస్ట్రేలియా ప్రభుత్వంతో పలు ఒప్పందాలు కుదుర్చుకుంది.

12/10/2016 - 02:39

ద్వారకాతిరుమల, డిసెంబర్ 9: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ధర్మకర్తల మండలి సభ్యుడు శేఖర్‌రెడ్డి వద్ద ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు నల్ల ధనమేనని రుజువైతే ఆయనను పదవి నుండి తొలగిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. అలాగే ఆయనపై చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయన్నారు.

Pages