S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/10/2016 - 01:58

ఒంగోలు,డిసెంబర్ 9: ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు, గృహనిర్మాణం లాంటి సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తూట్లు పొడుస్తున్నారని, ఆయన మెడలు వంచైనా ఆ పథకాలు అమలు చేయిస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

12/10/2016 - 01:56

న్యూఢిల్లీ, డిసెంబరు 9: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డీఒ) అధ్వర్వంలో మచిలీపట్నం వద్ద క్షిపణి పరీక్ష కేంద్రంతోపాటు లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం తెలిపింది. ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉందని కేంద్ర రక్షణ శాఖ వెల్లడించింది. క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటుకు సంబంధించి భూ సేకరణ ప్రతిపాదనను ఎపీ ప్రభుత్వానికి పంపినట్టు తెలిపింది.

12/10/2016 - 01:54

తిరుపతి/చెన్నై, డిసెంబర్ 9: టిటిడి ధర్మకర్తల మండలి సభ్యుడు, అన్నాడిఎంకె నాయకుడు, పారిశ్రామికవేత్త శేఖర్‌రెడ్డి, ఆయన బంధువుల ఇళ్ళలో శుక్రవారం రెండో రోజు కూడా ఎసిబి అధికారులు తనిఖీలు

12/10/2016 - 01:52

హైదరాబాద్, డిసెంబర్ 9:ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఊరట లభించింది. ఈ కేసులో విచారణ జరిపించాలని ఏసిబి ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలపై చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఏసిబి కోర్టు ఆదేశాలను కొట్టివేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు.

12/10/2016 - 01:51

విశాఖపట్నం, డిసెంబర్ 9: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘వార్ధా’ తుపాను స్థిరంగా కొనసాగుతోంది. ఇది రాగల 12 గంటల్లో (శనివారం మధ్యాహ్నానికి) తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి ప్రకటించారు. ప్రస్తుతం విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 950 కిలోమీటర్ల దూరంలోను, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 1,050 కిమీ దూరంగాలోను కేంద్రీకృతమై ఉంది.

12/10/2016 - 01:46

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: దేశంలో కరెన్సీ కొరత హాహాకారాలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో కేంద్ర ధోరణిపై సుప్రీం కోర్టు నిప్పులు చెరిగింది. ఏ ఉద్దేశంతో కరెన్సీని ఉన్నపళంగా రద్దు చేశారు? అసలు దీనికో ప్రాతిపదిక అంటూ ఉందా? ఎంత కాలంలో సమస్య పరిష్కారం అవుతుందని భావించారంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.

12/10/2016 - 01:22

అనుభవం అయితేగాని తత్వం బోధపడదు. నల్లకాసురవధ అనుకున్నంత తేలిక కాదని నరేంద్రమోదిగారికి పెద్దనోట్ల అనుభవం తరవాత బోధపడినట్టుంది. నల్ల డబ్బును పెల్లగించడం కోసమే ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లను ఉన్నపళాన రద్దు చేస్తున్నట్టు నవంబర్ 8న ఫెళఫెళార్భాటంతో ప్రకటించిన సర్కారువారి స్వరం అర్ధాంతరంగా మారింది. నగదు రహిత ఆర్థిక స్వర్గం కోసం కొత్త పలవరింత మొదలైంది.

12/10/2016 - 01:04

మూడు ‘తలాఖ్‌ల’ పద్ధతి అమానవీయమైనదని అలహాబాద్ ఉన్నత న్యాయమూర్తి సునీత్‌కుమార్ వ్యాఖ్యానించడం ఇస్లాం మహిళల మనోభావాలకు అనుకూలమైన పరిణామం. ఎప్పుడు పడితే అప్పుడు భర్త తన భార్యకు విడాకులనివ్వడానికి వీలు కల్పించే ఈ దారుణమైన నిబంధన ఇస్లాం మత వౌలిక తత్త్వానికి సైతం అనుగుణంగా లేదన్న ఉన్నత న్యాయస్థానం వారి వ్యాఖ్య ఉదారవాదులైన ఇస్లాం మతస్థుల అంతరంగానికి అద్దం.

12/10/2016 - 01:02

అవును.. జనం గెలిచారు. కొన్ని దశాబ్దాలుగా అవినీతిపరులు, తీవ్రవాదుల కబంధ హస్తాల్లో ఇరుక్కుని ఊపిరి ఆడకుండా గిలగిలా కొట్టుకుంటున్న దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు రెక్కలు విప్పుకుని బ్యాంకుల్లో వచ్చిపడడమే జనం గెలిచారనడానికి నిదర్శనం. అవినీతిపరులపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ధర్మయుద్ధానికి మద్దతుగా జనసామాన్యం గత నెలరోజులుగా బ్యాంకులు, ఎటిఎం క్యూల వద్ద సహనంతో నిలబడి మరీ గెలిచారు.

12/10/2016 - 01:01

అయిదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ఉరుము లేని పిడుగులా జనాన్ని తాకింది. గత నెలరోజులుగా ఎక్కడ చూసినా నగదు కోసం ప్రజలకు నరకయాతనే. పరిమితికి లోబడి ఇచ్చే కాస్తంత నగదు కోసం బ్యాంకుల వద్ద, ఎటిఎంల వద్ద పడిగాపులు. పాతనోట్లు చెల్లక, ఆశించిన నగదు లభించక- ‘డబ్బులేనివాడు ఎందుకూ కొరగాడు’ అంటే ఏమిటో అందరికీ తెలిసొచ్చింది.

Pages