S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/04/2016 - 04:42

హైదరాబాద్, డిసెంబర్ 3: విద్యుత్ శాఖకు చెంది ఉద్యోగులు తలపెట్టిన సమ్మెను శనివారం ఉపసంహరించుకున్నారు. రాష్ట్ర విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి వద్ద జరిగిన చర్చలు ఫలించాయి. విద్యుత్ శాఖకు చెందిన ఉద్యోగుల సమస్యలపై 13 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మంత్రితో చర్చించారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను దశలవారీగా క్రమబద్దీకరించేందుకు మంత్రి అంగీకరించారు. చర్చల తర్వాత మంత్రి స్వయంగా ఈ విషయం వెల్లడించారు.

12/04/2016 - 04:28

హైదరాబాద్, డిసెంబర్ 3: నగరంలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు ఇప్పటికే విస్తరించిన రోడ్లపై తొలగించకుండా ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ఓ ప్రధాన కారణమని గుర్తించింది సమన్వయ కమిటీ. వీటిని వెంటనే తొలగించటంతో పాటు రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు గాను ప్రత్యామ్నాయ రోడ్లను గుర్తించే అంశాన్ని ప్రాధాన్యతనివ్వాలని కమిటీ నిర్ణయించింది.

12/04/2016 - 04:27

చేవెళ్ల, డిసెంబర్ 3: దేశంలో ఉన్న నల్లధనం వెలికి తీసేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయంతో గత కొన్నిరోజులుగా చేవెళ్ల మండలంలోని ప్రజలు ఉదయం నుండి సాయంత్రం వరకు డబ్బుల కోసం బ్యాంక్‌ల్లో బారులు తీరుతున్నారు. శనివారం బ్యాంక్‌లో అధికారులు ఏటిఎంలో సరిపడా నగదు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు బ్యాంకుల వద్ద క్యూలో నిలబడుతున్నారు.

12/04/2016 - 04:26

హైదరాబాద్, డిసెంబర్ 3: జిహెచ్‌ఎంసి కార్యకలాపాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు చేపట్టిన వార్డు కమిటీ సభ్యుల నియామకానికి సంబంధించి తాము ప్రతిపాదించిన పేర్లు రాలేదంటూ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పరస్పరం ప్రశ్నించుకున్నారు. ఫలితంగా ఉదయం పది గంటలకు ప్రారంభం కావల్సిన కౌన్సిల్ సమావేశం మూడు గంటలు ఆలస్యమైంది. ఆ మూడు గంటల పాటు మేయర్ ఛాంబర్‌లో ఏం జరిగిందన్నది ఆసక్తికరంగా మారింది.

12/04/2016 - 04:25

శామీర్‌పేట, డిసెంబర్ 3: ప్రభుత్వ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు సకాలంలో పూర్తియేటట్లు చూడాలని మేడ్చల్ కలెక్టర్ ఎం.వి. రెడ్డి ఆదేశించారు. శనివారం తహశీల్దార్లు, ఎంపిడిఒలు, ఎగ్జిక్యూటివ్ అధికారులు, గ్రామీణ అధికారులు, పంచాయితీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, సర్పంచులతో తన చాంబర్‌లో కలెక్టర్ ఎం.వి.రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

12/04/2016 - 04:25

తాడికొండ, డిసెంబర్ 3: కేంద్రం పెద్దనోట్లను రద్దు చేసిన నేపథ్యంలో గ్రామీణ ప్రజలు అనేక కష్టనష్టాలు పడుతున్నప్పటికీ బ్యాంకు అధికారులు తమకు న్యాయం చేయడం లేదని, ప్రతిరోజూ తమ పనులు మానుకుని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ నగదు సక్రమంగా అందించటం లేదంటూ మండల పరిధిలోని పొనె్నకల్లు గ్రామస్తులు శనివారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు, సిబ్బందిని నిర్బంధించారు.

12/04/2016 - 04:24

హైదరాబాద్, డిసెంబర్ 3: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే అధికారుల సమాచారాన్ని ఏసిబి అధికారులకు అందించి అవినీతిని అంతమొందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా పిలుపునిచ్చారు. అవినీతితో సమాజానికి ఎంతో నష్టం జరుగుతుందని, ప్రధానంగా పేద వర్గాల సంక్షేమానికై ప్రభుత్వం చేపట్టే పలు కార్యక్రమాలు అర్హులకు అందకుండా పోతున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు.

12/04/2016 - 04:23

హైదరాబాద్, డిసెంబర్ 3: జిహెచ్‌ఎంసి కౌన్సిల్ శనివారం నిర్వహించిన వార్డు కమిటీల నియామకం ఏకపక్షంగా, ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా జరిగిందని ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు మెట్టుశంకర్‌యాదవ్, సాయిజెన్ శాంతి ఆరోపించారు. నాచారం డివిజన్‌కు సంబంధించి కార్పొరేటర్ శాంతి మేయర్ బొంతు రామ్మోహన్ ఆదేశంతోనే అయిదుగురి పేర్లు పంపారని, తీరా ఎన్నిక సమయంలో వారి పేర్లు గల్లంతయ్యాయని ఆరోపించారు.

12/04/2016 - 04:21

హైదరాబాద్, డిసెంబర్ 3: మహానగర పాలక సంస్థ పౌరసేవల నిర్వహణ, నగరాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఎట్టకేలకు వార్డు కమిటీలకు జిహెచ్‌ఎంసి పాలక వర్గం శనివారం ఎన్నిక నిర్వహించింది. ఉదయం పది గంటలకు ప్రత్యేకంగా సమావేశం కావల్సిన కౌన్సిల్ మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైనా, ఎట్టకేలకు వార్డు కమిటీ నియామకం కోసం వచ్చిన నామినేషన్లలో అర్హత కలిగిన వాటిని నామినేటెడ్ ప్రాతిపదికన ఆమోదించింది.

12/04/2016 - 04:20

హైదరాబాద్, డిసెంబర్ 3: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పథకంలో భాగంగా కోదండపూర్‌లోని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో చేపడుతున్న మరమ్మతుల పనుల కారణంగా ఈనెల 6వ తేదీ ఉదయం ఆరు నుంచి మరుసటి రోజు 7వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు 24 గంటల పాటు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు జలమండలి ట్రాన్స్‌మీషన్ అధికారులు తెలిపారు.

Pages