S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/02/2016 - 00:01

అమలాపురం, డిశంబర్ 1 : అమలాపురంలో గురువారం పట్టపగలు రౌడీలు రెచ్చిపోయారు. స్థానిక మాచిరాజువీధి వాసవి కాలనీలో గల ఆర్‌కె ప్రింటర్స్‌పై కాకినాడ, రామచంద్రాపురం నుండి వచ్చిన సుమారు 50 మంది రౌడీలు గునపాలు, సుత్తులు, కత్తులతో వీరంగం సృష్టించి ప్రిటింగ్ ప్రెస్ యజమానితోపాటు పక్కనే నివాసం ఉంటున్న గూడా సీతారామాంజనేయులపై దాడికి పాల్పడటమే కాకుండా, చుట్టుప్రక్కల వారిని సైతం భయబ్రాంతులకు గురిచేశారు.

12/02/2016 - 00:00

రావులపాలెం, డిసెంబర్ 1: పరిమితికి మించి వెళుతున్న ఇసుక లారీల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గురువారం మండలంలోని పొడగట్లపల్లి వద్ద బిజెపి నేతల ఆధ్వర్యంలో గ్రామస్థులు ఇసుక లారీల రాకపోకలను అడ్డుకున్నారు.

12/01/2016 - 23:59

కాకినాడ, డిసెంబర్ 1: ఎస్సీలను వర్గీకరించి మాదిగ, ఉప కులాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్‌పిఎస్) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

12/01/2016 - 23:59

కాకినాడ రూరల్, డిసెంబర్ 1: మండలంలోని సూర్యారావుపేట లైట్ హౌస్ సమీపంలో భాగ్యనగర్ గ్యాస్ పైస్‌లైన్ లీక్ అవడంతో జనం బెంబేలేత్తిపోయారు. ఆ ప్రాంతంలో దుర్వాసన రావడంతో అటు అధికారులు, ప్రజాప్రతినిధులు హడావిడి చేశారు. హూటాహుటీన అగ్నిమాపక సిబ్బందిని రంగప్రవేశం చేయించారు. ప్రతిపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు సంఘటన స్థలం వద్దకు చేరి పరిశీలించారు.

12/01/2016 - 23:56

ఏలూరు, డిసెంబర్ 1: పెద్దనోట్ల రద్దు అసలు లక్ష్యం ఇప్పుడు ఎంతమందికి గుర్తుందో తెలియదుగాని ఆ నిర్ణయం వల్ల వస్తున్న రకరకాల కష్టాలను ఎదుర్కొవటంతోనే జీవితం గడిచిపోతున్నట్లు కన్పిస్తోంది. వేతనజీవులు ఒకరకంగా అల్లాడిపోతుంటే, వినూత్నంగా ఈ రద్దు కష్టాలను అధిగమించడానికి తీసుకుంటున్న నిర్ణయాలు మరోవిధమైన సమస్యలను సృష్టిస్తున్నాయి. వీటిమధ్య డిసెంబర్ నెల ప్రారంభం అయింది.

12/01/2016 - 23:55

భీమవరం, డిసెంబర్ 1: పదవీ విరమణ చేసిన కార్మికునికి అదే రోజు ప్రావిడెంట్ ఫండ్ సెటిల్ చేయడంతో పాటు ఎంప్లాయిస్ పెన్షన్ స్కీం (ఇపిఎస్) కింద చెల్లించే పింఛను కూడా కార్మికుని బ్యాంకు ఖాతాకు జమచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు నరసాపురం ఎంపి, లైలా గ్రూపు సంస్థల అధినేత గోకరాజు గంగరాజు స్పందించారు.

12/01/2016 - 23:55

భీమవరం, డిసెంబర్ 1: భీమవరం పట్టణం బహిరంగ మలమూత్ర విసర్జన రహితమని మున్సిపల్ కౌన్సిల్ ప్రకటించింది. దీంతో భీమవరాన్ని లిట్టర్ ఫ్రీగా పేర్కొనవచ్చు. ఇకనుంచి పట్టణంలో ఎక్కడా చెత్త వేయడం, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయడం నిషేధించారు. అంతేకాకుండా చెత్త నిర్మూలనకు ప్రత్యేకమైన జోన్లను కూడా ఏర్పాటుచేశారు. ఎవరు పడితే వారు ఎలా పడితే అలా ఇష్టానుసారం దుకాణాల వద్ద చెత్త వేయడం నిషేధం.

12/01/2016 - 23:54

ఏలూరు, డిసెంబర్ 1 : సమాజ హితానికి దోహదపడే శాస్త్ర సాంకేతిక రంగాలపై విద్యార్ధుల్లో సృజనాత్మకతను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. స్థానిక కస్తూరిబా నగర పాలక బాలికోన్నత పాఠశాలలో గురువారం జిల్లా విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి పీతల సుజాత ప్రారంభించారు.

12/01/2016 - 23:54

ఏలూరు, డిసెంబర్ 1 : ఎయిడ్స్ సోకేవారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందని సమాజంలో అందరి భాగస్వామ్యంతో ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడం కష్టం కాదని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణా దినోత్సవ సందర్భంగా స్థానిక ఇండోర్ స్టేడియంలో ఎయిడ్స్ ప్రచారర్యాలీని కలెక్టర్ గురువారం ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు.

12/01/2016 - 23:53

తాడేపల్లిగూడెం, డిసెంబర్ 1: దేశాభ్యున్నతి, సమాజ హితం కోసం ఎన్‌సిసిసీ కేడెట్లు అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. స్థానిక జడ్పీ స్కూలులో 68వ ఎన్‌సిసి దినోత్సవం సందర్భంగా గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా మంత్రి మాణిక్యాలరావు అమర జవాన్లకు నివాళులర్పించారు.

Pages