S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/27/2016 - 21:04

జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులువారు నాడు దేశంలో అనేక మతాలను సంస్కరించి, సమన్వయపరిచి షణ్మాతాలను స్థాపించి షణ్మతాచార్యునిగా ప్రసిద్ధి పొందారు. ఆ ఆరుమతాలు- సౌర, శాక్త, వైష్ణవ, గాణపత్య, శైవ, సుబ్రహ్మణ్య (కుమార) మతాలు. అన్నింటికీ కలిపి పంచదేవతారాధన ఏర్పాటుచేసి విధి విధానాలు విశదం చేశారు. కాని అందులో సుబ్రహ్మణ్యుని ప్రస్తావించలేదు.

11/27/2016 - 21:01

ప్రపంచం చాలా విశాలమైనది. అంతులేని కోరికలు, వాటిని సాధించుకోవటానికి చేసే ప్రయత్నాలు జీవన గమనానే్న శాసిస్తుంటాయి. ఎన్నో ప్రలోభాలకు గురిచేస్తుంటాయి. మనిషికి కావలసింది తను ఏదైతే కోరుకున్నాడో అదే. అప్పుడు అతడు తృప్తిపడతాడు. తృప్తి కలగనపుడు ఆశాభంగం చెందుతాడు. అందువలన చాలా విలువైన కాలం గంగపాలౌతుంది. వాస్తవాలను కూడా విడిచిపెడతారు.

11/27/2016 - 20:48

నేను-నేను అంటూ ఒక నేను తలంపు స్వానుభవంలో ఉండుట అందరికి సహజ ప్రమాణమే. ఈ నేనుయే నేనును తెలుసుకొనుటకు ఆలంబనము. కనుక ఈ స్వీయ గమనికలో తర్కవాద సాధన విశ్వాసము శాస్తమ్రుల ప్రసక్తి అవసరం లేదు.

11/27/2016 - 08:22

ఏలూరు, నవంబర్ 26: దేశానికి స్వచ్ఛమైన పాలన అందిస్తూ, అన్నివర్గాల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్రమోదిని ప్రజలు దేవుని దూతగా చూస్తున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ తీసుకున్న చర్యలను వివరిస్తూ ఎక్కడా అవినీతి మచ్చ లేని పాలన అందిస్తున్నారని ప్రస్తుతించారు.

11/27/2016 - 08:13

న్యూఢిల్లీ, నవంబర్ 26: క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో భారత్‌కు అత్యంత ఆప్తమిత్రుడు. ఆలీన ఉద్యమంలో ఆయన కీలకభూమిక పోషించారు. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఫిడెల్‌తో మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. 1959లో క్యూబా విప్లవం తరువాత అధికారం చేపట్టిన క్యాస్ట్రో అలీన దేశాలకు స్నేహపాత్రుడిగానే ఉండేవారు.

11/27/2016 - 08:04

న్యాయ వ్యవస్థ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం
న్యాయమూర్తుల కొరతతో కోర్టులు పనిచేయట్లేదని సిజెఐ జస్టిస్ ఠాకూర్ ఆవేదన
సంక్షోభ ముగింపునకు సర్కారు చొరవ చూపాలని సూచన
విభేదించిన న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్
ఈ ఏడాది 120 మంది జడ్జీలను నియమించామని వెల్లడి

11/27/2016 - 07:59

న్యూఢిల్లీ, నవంబర్ 26: క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో మృతికి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. క్యాస్ట్రో భారత్‌కు ఓ మంచి స్నేహితుడని రాష్టప్రతి, ప్రధాని తమ సందేశంలో స్పష్టం చేశారు. ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. క్యూబా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ప్రధాని ట్వీట్ చేశారు.

11/27/2016 - 07:59

హవానా, నవంబర్ 26: విప్లవ సైన్యానికి సారథ్యం వహించి క్యూబాకు అద్భుతమైన విజయాన్ని సాధించిన మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో ఇకలేరు. క్యూబాలో సోవియట్ తరహా కమ్యూనిస్టు వ్యవస్థను బలంగా పాదుకొల్పడంతోపాటు అధ్యక్షుడిగా అర్ధ శతాబ్దంపాటు దేశాన్ని ముందుకు నడిపి తన హయాంలో అగ్రరాజ్యమైన అమెరికాకు, ఆ దేశానికి చెందిన పదిమంది అధ్యక్షులకు సింహస్వప్నంగా నిలిచిన ఫిడెల్ క్యాస్ట్రో 90 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

11/27/2016 - 07:52

న్యూఢిల్లీ, నవంబర్ 26: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుతో రాష్ట్రాలు కోల్పోయే ఆదాయానికిగాను కేంద్రం మూడు నెలలకోసారి నష్టపరిహారం ఇవ్వనుంది. జిఎస్‌టి అమలైన తొలి ఐదేళ్లలో లగ్జరీ ఉత్పత్తులు, పొగాకు తదితర ఉత్పత్తులపై ‘జిఎస్‌టి నష్టపరిహార సెస్సు’ పేరిట లెవీని రాష్ట్రాలకు ప్రతి త్రైమాసికానికి కేంద్రం ఇస్తుంది.

11/27/2016 - 07:51

న్యూఢిల్లీ, నవంబర్ 26: దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్.. నైజీరియాలోని తమ అనుబంధ సంస్థలో ఎకోనెట్ వైర్‌లెస్‌కున్న వాటాను కొనుగోలు చేసింది. ఎయిర్‌టెల్ నైజీరియాలో ఎకోనెట్ వైర్‌లెస్ లిమిటెడ్‌కు 4.2 శాతం వాటా ఉంది. ఈ మొత్తం వాటాను భారతీ ఎయిర్‌టెల్ ఇంటర్నేషనల్ (నెదర్లాండ్స్) బివి ద్వారా కొనుగోలు చేసినట్లు శనివారం భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది.

Pages