S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/23/2016 - 03:41

ప్రత్తిపాడు, నవంబర్ 22: గాంధీ మార్గంలో చేసే సత్యాగ్రహ పాదయాత్రకు అనుమతి తీసుకోవాలని ఏ చట్టంలో ఉందో తెలియచేయాలని ఆంధ్రప్రదేశ్ డిజిపి సాంబశివరావును కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. ఈమేరకు డిజిపికి మంగళవారం ఆయన ఒక లేఖ రాశారు. మంగళవారం కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో లేఖకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

11/23/2016 - 03:24

హైదరాబాద్, నవంబర్ 22: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు 7900 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, నిధులు మంజూరు చేయాలని నీటిపారుదల శాఖ కేంద్రాన్ని కోరనుంది. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన (పిఎంకెఎస్‌వై) కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 99 ప్రాజెక్టుల పురోగతి, నిధుల సమస్య తదితర అంశాలపై కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది.

11/23/2016 - 03:23

హైదరాబాద్/చార్మినార్, నవంబర్ 22: కేంద్ర మంత్రి రాందాస్ అత్వాలే, విపక్ష నేత మల్లిఖార్జున్ ఖార్గేలు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు అడ్డుపడుతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో డప్పోల్ల రమేష్ రచించిన ‘చిటిక కోలా దండోర’ వర్గీకరణ ఉద్యమ దీర్ఘ కవిత అనే పుస్తకావిష్కరణ సభ జరిగింది.

11/23/2016 - 03:21

హైదరాబాద్, నవంబర్ 22: జిఎస్‌టి బిల్లుకు పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం లభిస్తేనే, అసెంబ్లీని సమావేశపరిచి ఆమోదం తెలపాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భావిస్తున్నాయి. పార్లమెంటులో జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందకపోతే, అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించకుండా నేరుగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం మంచిదన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

11/23/2016 - 03:20

హైదరాబాద్, నవంబర్ 22: సైబర్ దాడులను అడ్డుకోవడానికి సైబర్ వారియర్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. నగరంలోని హెచ్‌ఐసిసిలో సైబర్ సెక్యూరిటీపై మంగళవారం జాతీయ సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా కెటిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీపై నూతన పాలసీని రూపొందించిన తొలి రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.

11/23/2016 - 03:18

హైదరాబాద్, నవంబర్ 22: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం 2013 భూసేకరణ చట్టంలోని అత్యవసర క్లాజును ఉపయోగించి ఇప్పటికిప్పుడు భూమిని సేకరించే పరిస్థితి లేదని, నాలుగు వారాలపాటు ఈ క్లాజును ఉపయోగించి భూములను అధీనంలోకి తీసుకోరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఆదేశాలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఏ శంకర్ నారాయణ్‌తో కూడిన ధర్మాసనం జారీ చేసింది.

11/23/2016 - 03:17

హైదరాబాద్, నవంబర్ 22: మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల్లో తొమ్మిదిమంది ఆదివాసీలు ఉన్నారని, వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను హైకోర్టు విచారించింది. ఈ కేసులో ఏపి ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిల్‌ను ట్రేడ్ కో ఆర్డినేషన్ సెంటర్ ప్రతినిధి నారాయణస్వామి దాఖలు చేశారు.

11/23/2016 - 03:17

హైదరాబాద్, నవంబర్ 22: వామపక్ష పార్టీల ప్రభావిత జిల్లాల్లో పెద్ద నోట్ల మార్పిడికి ముమ్మర యత్నాలు సాగుతున్నాయి. రద్దయిన పాత నోట్లు చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు తరలుతున్నట్టు తెలుస్తోంది. కరెన్సీ మార్పిడిపై తెలంగాణ, ఆంధ్రా పోలీసులు దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.

11/23/2016 - 03:16

హైదరాబాద్, నవంబర్ 22: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఎస్‌బిఐ, ఎస్‌బిహెచ్‌లకు కొత్త కరెన్సీ కట్టలు వచ్చిపడుతుండగా, ఇతర బ్యాంకులు నగదు లేక వెలవెలపోతున్నాయి. వారంలో 24 వేల రూపాయల వరకు విత్‌డ్రా చేసుకునే సౌకర్యం కల్పించినప్పటికీ, ఈ విధానం ఎస్‌బిఐ, ఎస్‌బిహెచ్‌లలోనే అమలవుతోంది.

11/23/2016 - 03:15

హైదరాబాద్, నవంబర్ 22: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న బాహుబలి-2 చిత్రానికి సంబంధించిన ఓ వీడియో ఇటీవల లీకైంది. కొన్ని రోజులుగా ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. దాదాపు తొమ్మిది నిమిషాల నిడివి గల బాహుబలి-2 సన్నివేశాలు తస్కరించింది గ్రాఫిక్ డిజైనర్ కృష్ణ అని పోలీసుల దర్యాప్తులో తేలింది.

Pages