S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/27/2016 - 20:59

ప్రేమకోసం ఛాలెంజ్ చేసి తన మేధస్సును పెంచుకుని ప్రేమలో గెలిచి ప్రేయసిని ఎలా దక్కించుకున్నాడు అనే కథనంతో రూపొందించిన ‘నిర్మలా కానె్వంట్’లో నటుడు రోషన్ చక్కగా నటించాడని దాసరి నారాయణరావు తెలిపారు.

09/27/2016 - 20:56

బాహుబలి చిత్రం రెండవ భాగం కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రాజవౌళి ఈ సినిమాను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని ప్రపంచ వ్యాప్తంగా అభిమానులతోపాటు సినిమాలకు సంబంధించిన సెలబ్రిటీలు కూడా తాము ఎదురుచూస్తున్నామని చెబుతుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. బొమ్మ పడిందంటే కలెక్షన్లు అదుర్స్‌గా వుంటాయని కూడా కథనాలు వస్తున్నాయి.

09/27/2016 - 20:55

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై మిథున్ మాన్యుల్ థామస్ దర్శకత్వంలో సారా అర్జున్ ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రం ‘పిల్ల రాక్షసి’. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులో చదలవాడ పద్మావతి అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.

09/27/2016 - 20:53

రామ్ కథానాయకుడిగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర రూపొందిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హైపర్’ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఎ సర్టిపికెట్ వున్న ఈ చిత్రం ఈనెల 30న విడుదలకు సిద్ధమైంది.

09/27/2016 - 20:52

మనీష్, తేజస్విని జంటగా భాగ్యలక్ష్మి మూవీ మేకర్స్ పతాకంపై నాగేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో మల్లికార్జున్‌రెడ్డి అందిస్తున్న చిత్రం ‘ప్రతిక్షణం’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సీడీని ఆర్.పి.పట్నాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా విజయవంతం కావాలని, పాటలు, ట్రైలర్లు అందరికీ నచ్చేలా ఉన్నాయని అన్నారు.

09/27/2016 - 16:29

హైదరాబాద్: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ల మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో అటు కోస్తాంధ్ర, ఇటు తెలంగాణలలో వర్షాలు కురియనున్నాయి. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్తితి ఉంటుందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం పేర్కొంది.

09/27/2016 - 16:28

హైదరాబాద్:నగరంలో వరదలకు కారణమైన ఆక్రమణల తొలగింపులో ఎవరినీ ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశించారు. నాలాల ఆక్రమణలు తొలగింపు కార్యక్రమం మొదలైంది. జిహెచ్‌ఎంసీకి చెందిన 30మంది డిఇ స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం సాగుతోంది. కాగా ఎంతటివారినైనా ఉపేక్షించకుండా చర్యలు కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

09/27/2016 - 16:27

న్యూయార్క్:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ల తొలి డిబేట్ ఆసక్తికరంగా, హోరాహోరీ సాగింది. న్యూయార్క్‌లోని ఓప్‌స్ట్రా యూనివర్శిటీలో ఈ చర్చాగోష్టి సాగింది. ఇరువురు అభ్యర్థులూ తమ ఆలోచనలను ఆవిష్కరించారు. టెర్రరిజం, పన్నులు, విదేశీవ్యవహారాలు, ఉద్యోగాలు, భద్రత వంటి అంశాలపై దీటైన చర్చ సాగించారు.

09/27/2016 - 16:27

హైదరాబాద్:శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు ఏపీ నీటిని విడుదల చేయడం లేదని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఈ మేరకు కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేశారు.

09/27/2016 - 16:26

న్యూఢిల్లి:కార్పొరేట్ వ్యవహారాల శాఖ మాజీ డైరక్టర్ జనరల్ బికె బన్సాల్ తన కుమారుడితో కలసి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజధానిలోని మధురానగర్‌లో ఆయన నివాసంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఓ ఫార్మ కంపెనీనుంచి గత జూలైలో 9 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటంతో కేసు నమోదైంది. ఆయన జైలుపాలయ్యారు. ఆ తరువాత కేసు సీబిఐకు చేరింది.

Pages