S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/22/2016 - 08:17

విజయవాడ, సెప్టెంబర్ 21: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం సాయంత్రం సిఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగనుంది. ఇందులో ప్రధానంగా బుధవారం ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్‌లో జరిగిన చర్చలు, నిర్ణయాలు పై చర్చ జరగనుంది. భవిష్యత్‌లో కృష్ణాజలాల పరిరక్షణపై పంటల పరిరక్షణపై తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమీక్ష జరుగుతుంది.

09/22/2016 - 08:17

న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో దేశంలోనే కీలకపాత్ర పోషిస్తోందని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. బుధవారం నాడు ఢిల్లీ పర్యాటనలో టూరిజం ఇనె్వస్టర్స్ సమ్మిట్-2016లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏపీ పర్యాటకపరంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సదుపాయాలను ఏర్పాటు చేసిందని వివరించారు.

09/22/2016 - 08:09

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ఇకపై రైల్వేలకు విడిగా ప్రత్యేక బడ్జెట్ ఉండదు. 2017-18 ఆర్థిక సంవత్సరంనుంచి సాధారణ బడ్జెట్‌లోనే రైల్వే బడ్జెట్‌ను కలిపేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో సాధారణ బడ్జెట్‌కు ముందు రైల్వే బడ్జెట్‌ను సమర్పించే తొమ్మిది దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయానికి స్వస్తి చెప్పినట్లయింది.

09/22/2016 - 08:05

కోర్బా, సెప్టెంబర్ 21: కడుపులో ఉన్న మృతపిండంతోనే ఆ మహిళ చికిత్స కోసం ప్రాధేయపడింది. కడుపులో తీవ్రంగా నొప్పి వస్తోందని ఆపరేషన్ చేయాలంటూ వైద్యులను అభ్యర్థించింది. కానీ ప్రత్యక్ష దైవంగా భావించే వైద్యులే డబ్బు కట్టనిదే చికిత్సే లేదు పొమ్మన్నారు... ఒకటి కాదు, రెండు కాదు అనేక ఆసుపత్రుల చుట్టూ రెండురోజుల పాటు తిరిగింది. అన్నిచోట్ల అదే పరిస్థితి.

09/22/2016 - 08:00

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు మధ్య అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వాగ్వివాదం చోటు చేసుకున్నది. హరీశ్‌రావు ఒక దశలోఏపి నీటిపారుదల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావుపై కూడా మండిపడ్డారు. ఇరుపక్షాల మధ్య వాగ్వివాదం తీవ్ర రూపం ధరించే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జోక్యం చేసుకుని సర్దిచెప్పాల్సి వచ్చింది.

09/22/2016 - 07:59

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన అపెక్స్ కమిటీ సమావేశంలో వాదించింది.

09/22/2016 - 07:58

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 21: పాకిస్తాన్‌లోని రాజకీయ, మత పార్టీలన్నీ కూడా తమ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయని పాక్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్వర్ జహీర్ జమాలీ విమర్శించారు. దేశంలో కొత్త జ్యుడీషియల్ సంవత్సరం అపారంభమైన సందర్భంగా సోమవారం జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.

09/22/2016 - 07:57

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21:కాశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో సైనికులపై జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై దౌత్యపరమైన ఒత్తిడిని భారత్ మరింతగా పెంచింది. 18మంది భారత సైనికులపై దాడి జరిపింది పాక్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదులేనన్న విషయాన్ని తెగేసి చెప్పింది. పాకిస్తాన్ ఉగ్ర ధోరణిని ఏ విధంగా ఎండగట్టాలన్న దానిపై కేబినెట్ భద్రతా కమిటీలో ప్రధాని మోదీ క్షుణ్ణంగా చర్చించారు.

09/22/2016 - 07:56

చెన్నై, సెప్టెంబర్ 20: కావేరీ వివాద పరిష్కారం కోసం నదీ జలాల యాజమాన్య బోర్డు(సిఎంబి)ను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై తమిళనాడులో రైతులు, రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. సుప్రీం తీర్పును గౌరవిస్తూ ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా కావేరీ నదీ జలాల యాజమాన్య బోర్డును తక్షణం ఏర్పాటు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో పాటు, అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

09/22/2016 - 07:56

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, వౌలిక వసతుల కల్పనలో భాగస్వాములు కావాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ యువ డాక్టర్లకు పిలుపునిచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో డెంగ్యూ, చికున్ గునియా విజృంభించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Pages