S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 00:51

సిద్దిపేట, జూలై 22 : ఎఎన్‌ఎంల సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తు కళ్లకు గంతలతో శుక్రవారం నిరనస వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా సిఐటియు డివిజన్ ఉపాధ్యక్షురాలు హేమలత మాట్లాడుతూ ఎఎన్‌ఎంల సమస్యల పరిష్కరించాలని గత ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమన్నారు. ఎఎన్‌ఎంలకు 10వ పిఆర్‌సి ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

07/23/2016 - 00:51

తూప్రాన్, జూలై 22 : హరితహారం సాదించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర ఐటి శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని మనోహరాబాద్ శివారులో గల ఐటిసి కన్సూమర్ గూడ్స్ తయారీ యూనిట్‌లో, ముప్పిరెడ్డిపల్లి శివారులో గల ఇండస్ట్రియల్ పార్క్‌లో మొక్కలు నాటిన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించడంలో భాగస్వామ్యులు కావాలన్నారు.

07/23/2016 - 00:50

తొగుట, జూలై 22: ప్రజల ఇష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం మల్లన్నసాగర్‌పై నిరంకుశంగా వ్యవహరించడం వల్లే రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రైతులవి ఆత్మహత్యలు కాదని, ప్రభుత్వ హత్యలేనని మాజీ మంత్రులు దామోదర్ రాజనర్సింహ, సునితా లక్ష్మారెడ్డిలు ఆరోపించారు. శుక్రవారం మండలంలోని పల్లెపహడ్‌లో మల్లన్నసాగర్ ముంపు బెంగతో ఆత్మహత్య చేసుకున్న రైతు నర్సింలు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.

07/23/2016 - 00:50

కోల్‌కతా, జూలై 22: దేశీయ ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం ఐటిసి.. 2030 నాటికి ప్రతిష్ఠాత్మకంగా లక్ష కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. శుక్రవారం ఇక్కడ ఐటిసి 105వ వార్షిక సాధారణ సమావేశం (ఎజిఎమ్) జరిగింది. ఈ సందర్భంగా వాటాదారులనుద్దేశించి సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వైసి దేవేశ్వర్ మాట్లాడుతూ పొగాకు వ్యాపారం వృద్ధిపథంలోనే కొనసాగుతోందని చెప్పారు.

07/23/2016 - 00:49

జోగిపేట, జూలై 22: జోగిపేట పట్టణంలోని ఎన్‌టిఆర్ స్టేడియంలో నిర్మించిన క్రీడా మైదాన భవనాన్ని శుక్రవారం నాడు అందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్ ప్రారంభించారు. మూడు కోట్ల రుపాయలతో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా అభివృద్ది కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో రకాల నిధులను కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ మైదానాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరారు.

07/23/2016 - 00:48

నర్సాపూర్,జులై 22: నర్సాపూర్ మండల ప్రజల అభిప్రాయం మేరకు నూతనంగా ఏర్పాటు చేయనున్న సంగారెడ్డి జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నాయకులు 48గంటల బంద్‌కు పిలుపునిచ్చారు.

07/23/2016 - 00:48

గజ్వేల్, జూలై 22: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా ఇక్కడి సర్కారు పక్క దారి పట్టిస్తోందని, రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రూ. 721 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేసినా రైతులకు చెల్లించకపోవడంలో అంతర్యమేమిటని టిడిపి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

07/23/2016 - 00:47

సంగారెడ్డి టౌన్, జూలై 22: పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా శుక్రవారం నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలకు 1254మంది అభ్యర్థులు హాజరైనారు. ఇందులో 733 మంది అర్హత సాధించారు.
వీరందరికీ శనివారం ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఎఎస్పీ వెంకన్న, ఎఆర్ ఎఎస్పీ బాబురావు, డిఎస్పీలు తిరుపతన్న, వెంకట్‌రెడ్డి, సిఐలు పోటీలను పర్యవేక్షించారు.

07/23/2016 - 00:46

హైదరాబాద్, జూలై 22: తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన కూరగాయాలు’ పథకం విజయవంతం కావడంతో త్వరలోనే హైదరాబాద్‌లో 100 ఔట్‌లెట్‌లను ప్రారంభించబోతున్నట్టు మార్కెటింగ్ శాఖ మంత్రి టి హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి, మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అనేక చర్యలు చేపట్టినట్టు మంత్రి వివరించారు.

07/23/2016 - 00:45

హైదరాబాద్, జూలై 22: పాలిమర్ పైపుల ఉత్పత్తి రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన స్కిప్పర్ సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో తొలిసారిగా హైదరాబాద్‌లో పాలిమర్ పైపుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ డైరెక్టర్ దేవేష్ బన్సల్ తెలిపారు.

Pages