S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 00:25

అది ఇష్టంతో కావచ్చు, అయిష్టంతో కావచ్చు ప్రపంచ ప్రజల నాలుకపై అమెరికా నామస్మరణ నిత్యకృత్యం. ఆ దేశ విదేశాంగ విధానాల ఆధారంగా అమెరికా మీద ఎక్కువమంది దురభిప్రాయాన్ని కలిగి ఉంటున్నారు. కాని ఎవరైనా అమెరికా పర్యటించి వచ్చిన తరువాత ఆ అభిప్రాయాన్ని చాలావరకు మార్చుకుంటారు. మన కమ్యూనిస్టు అగ్ర నాయకులు నారాయణ, రాఘవులు విషయంలో కూడా ఇది రుజువైంది.

07/23/2016 - 00:24

మామడ, జూలై 22: మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ముడిపడిఉందని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. శుక్రవారం మండ ల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతీ ఒక్కరు మొక్కలునాటి వాటిని సంరక్షించాలన్నారు. మొక్కలు నాటినప్పుడే వాతావరణంలోని కాలుష్యాన్ని తగ్గించబడుతుందన్నారు. దీంతో వర్షాలు సకాలంలో కురిసే అవకాశం ఉందన్నారు.

07/23/2016 - 00:23

మంచిర్యాల, జూలై 22: ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారంలో భాగంగా అన్ని మున్సిపాలిటీల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడమేకాక వాటి సంరక్షణర బాధ్యత చర్యలుకూడా తీసుకోవాలని మెప్మా అడిషనల్ డైరెక్టర్ వందన్‌కుమార్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని తూర్పు జిల్లా మున్సిపల్ కమిషనర్‌లు, ఇంజినీర్లు, అర్బన్ ఐకెపి సిబ్బందితో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

07/23/2016 - 00:23

వాణి, వీణ అవిభక్త కవలలు. నీలోఫర్ ఆసుపత్రిలో నరకాన్ని అనుభవిస్తున్నారు. కవలల్ని విడదీసి వార్తల్లోకి ఎక్కిన గుంటూర్ డా.నాయుడమ్మ నుంచి ఆస్ట్రేలియా వైద్యుల దాకా స్పందించినా వారికింకా విముక్తి దొరకలేదు. వీరి దీన గాధను తెరకెక్కించాలని ఏ నిర్మాతకూ తట్టలేదు.

07/23/2016 - 00:22

ఆదిలాబాద్, జూలై 22: రాష్ట్ర షెడ్యూల్ కులాల సేవా సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో ఎస్సీల సంక్షేమానికి తీసు కుంటున్న చర్యలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా అధికారులతో కలిసి సమీక్షించనున్నట్లు కార్పొరేషన్ ఎడి జెమ్స్ కల్వాల తెలిపారు.

07/23/2016 - 00:21

కుంటాల, జూలై 22: మండల కేంద్రమైన కుంటాలలో గురువారం రాత్రి భారీ వర్షం కురియడంతో శుక్రవారం ఉదయం నుండి కుంటాల మండలానికి రాకపోకలు నిలిచిపోయి పంటలు నీట మునిగిపోయాయి. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి 91.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఎఎస్‌వో సాయన్న తెలిపారు. దీంతో ఉదయం నుండే మండలానికి రాకపోకలు నిలిచిపోవడంతోప్రయాణీకులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

07/23/2016 - 00:20

కడెం, జూలై 22: మానవ మనుగడ కోసం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. శుక్రవారం పోలీస్‌స్టేషన్ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో ఎస్పీ మొక్కలను నాటారు.

07/23/2016 - 00:19

ఆదిలాబాద్, జూలై 22: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు గ్రామాల్లో వ్యాధులు విజృంభిస్తున్నా యి. నాలుగైదు రోజులుగా జిల్లాలోని ఇచ్చోడ, బోథ్, నేరడిగొండ, బీమిని, జన్నారం, నార్నూర్, ఉట్నూరు, ఇంద్రవెల్లి మండలాల్లో విషజ్వరాల బారిన పడి వందలాది మంది గిరిజనులు ప్రతిరోజు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా గ్రామాల్లో జ్వరపీడితుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

07/23/2016 - 00:19

పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్-పీఓకే-లో చైనా దళాలు తిష్ఠవేసి ఉండడం పాతబడిన సమాచారం. చైనా, పాకిస్తాన్ దళాలు ఉమ్మడిగా ‘సరిహద్దు’ వెంబడి గస్తీ తిరుగుతుండడం సరికొత్త వ్యూహంలో భాగం. లడక్‌లో మన భద్రతా వ్యవస్థ పటిష్ఠమవుతున్న నేపథ్యంలో చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం తలపెట్టిన సరికొత్త కవ్వింపు చర్య ఇది. చైనాకు, పాకిస్తాన్‌కు మధ్య సహజమైన సరిహద్దు లేదు.

07/23/2016 - 00:17

కెరమెరి, జూలై 22: కెరమెరి మండలంలో శుక్రవారం కుండపోత వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏకదాటిగా కురిసిన భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షం కారణంగా మండల కేంద్రంలోని రోడ్లు, గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు జలమయమయ్యాయి.

Pages