S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/22/2016 - 21:03

క. కావున సత్యము మిక్కిలి
గా విమల ప్రతిభం దలఁచి కణ్వాశ్రమ సం
భావిత సమయస్థితి దయఁ
గావింపుము; గొడుకుఁ జూడు కరుణాదృష్టిన్
భావం: కాబట్టి నిర్మలమైన బుద్ధితో సత్యం గొప్పదిగా భావించి కణ్వమహర్షి ఆశ్రమంలో చేసిన ప్రతిజ్ఞను దయతో నెరవేర్చు. నీ కొడుకును దయతో చూడుము. గృహస్థాశ్రమ ధర్మంలో సత్యంచేతనే సర్వార్థ సాధనం చేయవచ్చని భావం.
క. క్షత్రవరుఁడైన విశ్వా

07/22/2016 - 21:02

చెన్నమనేని శ్రీ్ధర్, జ్యోతిసేథీ, సంజన, శరవణ్ కీలక పాత్రధారులుగా శ్రీ నందన్ మూవీస్ పతాకంపై పల్లెల వీరారెడ్డి దర్శకత్వంలో మహేష్ కల్లే నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’. జి.సంతోష్‌రెడ్డి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నగర మేయర్ బొంతు రామ్మోహన్ థియేట్రికల్ ట్రైలర్, బిగ్ సీడీని విడుదల చేశారు.

07/22/2016 - 20:59

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ‘కొరటాల శివ’ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘జనతా గ్యారేజ్’. అనౌన్స్ చేసినప్పటినుండి ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అలాగే ఇటీవలే రిలీజైన చిత్రం టీజర్ సుమారు 50 లక్షల వ్యూస్ అందుకుని రికార్డ్ సృష్టించింది. ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తున్న ఈ చిత్రం గురించి తాజాగా మరో ఆసక్తికర విషయం తెలుస్తోంది.

07/22/2016 - 20:57

రోషన్, శ్రేయాశర్మ జంటగా నాగార్జున సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న చిత్రం ‘నిర్మల కానె్వంట్’. జి.నాగకోటేశ్వరరావు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. జైపూర్, అరకు, నైనిటాల్, చిక్‌మంగళూరు వంటి వైవిధ్యమైన ప్రదేశాలలో షూటింగ్ జరిపామని, నాగార్జున చేస్తున్న ఓ వైవిధ్యమైన పాత్ర సినిమాకు హైలెట్‌గా వుంటుం

07/22/2016 - 20:53

కొత్తబంగారులోకం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన శే్వతబసుప్రసాద్ పెళ్లిపీటలెక్కబోతోంది. తొలి చిత్రంతోనే హిట్ హీరోయిన్‌గా పేరు పొందిన శే్వత, ఆ తర్వాత సరైన చిత్రాలను చేయలేకపోయింది. ఒకనొక సమయంలో వ్యభిచారం కేసులో ఇరుక్కుని కొన్నాళ్లు రెస్క్యూ హోంలో శిక్ష కూడా అనుభవించింది. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చాక, టాలీవుడ్‌కు బై చెప్పింది. ముంబై వెళ్ళేప్పుడే షార్ట్ ఫిలిమ్స్ తీస్తానంటూ వెళ్లింది.

07/22/2016 - 20:51

సాయి రవికుమార్, అతిథిదాస్ జంటగా అంజన్ కళ్యాణ్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘అత్తారిల్లు’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేశారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదలచేశారు.

07/22/2016 - 20:47

‘‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవము’’ అన్న మహాకవి గురజాడ అప్పారావు మాటలను ఆచరణలో చూపిస్తున్న చిన్నారి మీరా వశిష్ఠ్. తన తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడినప్పటికీ, ఆమెకు మాతృదేశంపై వున్న మమకారం తగ్గలేదు. దేశంలో

07/22/2016 - 20:45

పదో తరగతి పాసైతే చాలు యూత్‌గా భావించుకునే నేటీ యువతరం సామాజిక మాధ్యమాలకు అతుక్కుపోతుంటే సొంత గడ్డపై మమకారం వీరిద్దరిని సేవా పధం వైపు నడిపించింది. సగటు అమ్మాయిలుగా ఆలోచించకుండా భిన్నమైన ఆలోచనలతో మన్ననలు అందుకుంటున్నారు.

07/22/2016 - 20:39

తలుపు చప్పుడయ్యింది. రామభద్రం నిద్రనుండి మెలకువలోకి వచ్చాడు. ఆయన మంచం దిగి తలుపును సమీపించే లోపుగా మరోసారి తలుపుమీద బాదిన చప్పుడయ్యింది. ఈసారి ఆయనను ‘బాబాయ్!’ అని పిలిచారు.
తలుపు తెరచాడు రామభద్రం.
మేడమీద అద్దెకు ఉంటూన్న కుమార్.

07/22/2016 - 18:22

విజయవాడ: ఎపికి ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపి కెవిపి ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లును ఓటింగ్‌కు రాకుండా అడ్డుకున్నందుకు నిరసనగా కేంద్రం దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు శుక్రవారం ఇక్కడి ఆంధ్రరత్న భవన్ వద్ద దగ్ధం చేశారు. ప్రత్యేక హోదాపై ఎపి సిఎం చంద్రబాబు ఇకనైనా తన వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ డిమాండ్ చేశారు.

Pages