S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/20/2016 - 07:46

విశాఖపట్నం, జూలై 19: యువ శాస్తవ్రేత్తలను ప్రోత్సహించేందుకు జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో 1,023 కోట్ల రూపాయల ఖర్చుతో ఇన్నోవేషన్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని రాంకీ ఇండియా లిమిటెడ్ సిఇఒ డాక్టర్ పి లాల్‌కృష్ణ తెలిపారు. రాంకీ కమర్షియల్ హబ్‌లో మంగళవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడారు. సైంటిస్టులు ఔషధ ఫార్ములాలను తయారు చేసేందుకు కోట్లాది రూపాయలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుందన్నారు.

07/20/2016 - 07:45

విజయవాడ, జూలై 19: వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో వృద్ధి తగ్గుదల కారణంగా, భారత ప్రభుత్వం 11వ పంచవర్ష ప్రణాళికా కాలంలో రాష్ట్రాలకు సహాయం చేసేందుకు, వ్యవసాయ, తత్సంబంధ రంగాల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్‌కేవీవై) ప్రవేశపెట్టింది. వ్యవసాయ రంగంలో 4 శాతం వృద్ధి సాధించటానికి దీన్ని ఏర్పాటు చేశారు.

07/20/2016 - 07:39

న్యూఢిల్లీ, జూలై 19: వెస్టిండీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం ఆంటిగ్వాలో ప్రారంభం కానున్న తొలి టెస్టుకు తుది జట్టును ఎంపిక చేయడమే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి పెద్ద సవాలు కానుంది.

07/20/2016 - 07:38

మనె్హయిమ్ (అమెరికా), జూలై 19: అమెరికాలో పర్యటిస్తున్న భారత మహిళా హాకీ జట్టుకు ఆదిలోనే నిరాశ ఎదురైంది. మంగళవారం ఇక్కడ జరిగిన ఆరంభ మ్యాచ్‌లో భారత జట్టు 2-3 గోల్స్ తేడాతో ఆతిథ్య అమెరికా చేతిలో ఓటమిపాలవడమే ఈ నిరాశకు కారణం. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అమెరికా జట్టు ఈ మ్యాచ్‌లో చాలా చక్కగా రాణించింది.

07/20/2016 - 07:36

కోల్‌కతా, జూలై 19: ప్రో కబడ్డీ లీగ్‌లో భాగంగా మంగళవారం ఇక్కడి నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు దబాంగ్ ఢిల్లీ జట్టుపై 36-28 పాయింట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. మరోసారి తెలుగు టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌధరి అద్భుత ప్రతిభ కనబరచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

07/20/2016 - 07:36

శ్రీనగర్, జూలై 19: జమ్మూ-కాశ్మీరు క్రికెట్ సంఘం (జెకెసిఎ) మంగళవారం తమ అధ్యక్షునిగా ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఇమ్రాన్ అన్సారీని ఎన్నుకుంది.

07/20/2016 - 07:35

కాన్పూర్, జూలై 19: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)ను ప్రక్షాళన చేసేందుకు జస్టిస్ ఆర్‌ఎం.లోధా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ చేసిన ప్రధాన సిఫారసులన్నింటినీ సుప్రీం కోర్టు ఆమోదించడంతో ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘం (యుపిసిఎ) తీవ్రమైన గడ్డు పరిస్థితిని ఎదుర్కోనుంది. యుపిసిఎ కోశాధికారితో పాటు మొత్తం ఐదుగురు డైరెక్టర్లు 70 ఏళ్ల వయసు పైబడినవారే కావడంతో వీరంతా పదవీ గండంలో చిక్కుకున్నారు.

07/20/2016 - 07:24

లాస్ ఏంజిలస్, జూలై 19: భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సాగర్‌మాల కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో సహకరించటానికి అమెరికా అంగీకరించింది. భారత్‌లోని ఓడరేవుల అభివృద్ధికి సమగ్రమైన సహకారాన్ని అందించేందుకు ఇరుదేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. భారత రహదారులు, ఓడరేవులు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అమెరికా అధికారులతో సమావేశమై ఈ దిశగా ఫలవంతమైన చర్చలు జరిపారు.

07/20/2016 - 07:22

ముంబయి, జూలై 19: మహారాష్ట్రంలోని అహ్మద్‌నగర్ జిల్లాలో మైనర్‌పై సామూహిక అత్యాచారం, దారుణ హత్య ఘటనలో దోషులకు మరణశిక్ష విధించాలన్న డిమాండ్ సర్వత్రా ఊపందుకుంది. దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని, దారుణానికి పాల్పడినవారికి ఉరిశిక్ష పడేలా చూస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. ‘కామంధులకు ఉరిశిక్షే సరైన శిక్ష.

07/20/2016 - 07:20

ఇస్లామాబాద్, జూలై 19: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్‌కు చెందిన ఆస్తులను జప్తు చేయాలని ఆ దేశ కోర్టు ఆదేశించింది. రాజద్రోహం కేసులో ముషారఫ్ విచారణకు హాజరు కాకపోవటంతో ఆయన ఆస్తుల జప్తుతో పాటు ఆయన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని కూడా ఆదేశించింది.

Pages