S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 08:22

ఏలూరు, జూలై 2 : జిల్లాలో చింతలపూడి ఎత్తిపోతల పధకానికి సంబంధించి మిగిలి ఉన్న సర్వే పనులను వచ్చే వారంలోగా పూర్తి చేయాలని అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ప్రగతిపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన సమీక్షించారు.

07/03/2016 - 08:20

ఏలూరు, జూలై 2: ఆధ్యాత్మికంలో మాయ అనే పదానికి సవాలక్ష అర్ధాలున్నాయి. కానీ సామాన్య జనానికి అర్ధమయ్యే మాయ ఒకరకం. కానీ అదే రకం మాయ ఈవిభాగాన్ని పర్యవేక్షించే దేవాదాయధర్మాదాయ శాఖలో సర్వత్రా అవరించి ఉందనే చెప్పాలి. సర్వాంతర్యామిగా ఈ మాయ మారిపోవటంతో అలా ఆర్డర్లు వచ్చి, ఇలా రద్దు అయిపోయి, ఉన్నతాధికారులు హుకుంలు జారీ చేసినా దానికి భిన్నంగా అస్మదీయులకు ఆర్డర్లు రాత్రికి రాత్రి వచ్చి పడిపోతాయి.

07/03/2016 - 08:18

విజయనగరం(టౌన్), జూలై 2: శ్రీ జగన్నాథస్వామివారి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పట్టణంలోని సంతపేట జగన్నాథస్వామివారి ఆలయ కమిటీ కోశాధికారి కాపుగంటి ప్రకాష్ వెల్లడించారు.

07/03/2016 - 08:17

విజయనగరం, జూలై 2: హాస్టల్ విద్యార్థులు జబ్బుపడితే వారిని వెంటనే తల్లిదండ్రులతో ఇంటికి పంపించడం నిలిపివేయాలని వసతిగృహాల సంక్షేమ అధికారులను ఆదేశిస్తున్నామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ మృణాళిని తెలిపారు. హాస్టల్ విద్యార్థులు జబ్బుపడిన వెంటనే తల్లిదండ్రులు వారిని తమ ఇళ్లకు తీసుకెళుతున్నారని, కానీ అక్కడ అవసరమైన వైద్య సౌకర్యాలు అందక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు.

07/03/2016 - 08:17

విజయనగరం (్ఫర్టు), జూలై 2: విజయనగరం మున్సిపల్ పాలకవర్గం బాధ్యతలు చేపట్టి ఆదివారంతో రెండేళ్లు పూర్తవుతుంది. రెండేళ్లపాలనలో ఎన్నో వైఫల్యాలను చవిచూసిన పాలకవర్గం తీరు వల్ల పట్టణ అభివృద్ధి మందగించగా, మున్సిపాలిటీలో అవినీతి బాగా పెరిగింది.

07/03/2016 - 08:16

విజయనగరం, జూలై 2: జిల్లాలో ఆరవ తేదీనుండి ప్రారంభిస్తున్న స్మార్ట్ పల్స్ సర్వేను పారదర్శకంగా జరపాలని జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ తహశీల్దార్లను, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. సర్వే నిర్వహించే సందర్భంగా ప్రజలు అపోహలకు గురికాకుండా ఎన్యుమరేటర్లు జాగ్రత్తగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

07/03/2016 - 08:16

విజయనగరం, జూలై 2: సర్వే, భూమి రికార్డులను డిజిటలైజేషన్ విధానంలో భద్రపరచడంవల్ల రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి జితేంద్ర తెలిపారు. రికార్డుల ఎఫ్‌ఎంబి డిజిటలైజేషన్ పనులపై ప్రత్యేక దృష్టిపెట్టి పూర్తిచేయాలని సూచించారు. జిల్లా సర్వే, భూమి రికార్డుల కార్యాలయంలో నిర్వహిస్తున్న డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అధికారి జితేంద్ర శనివారం పరిశీలించారు.

07/03/2016 - 08:15

విజయనగరం, జూలై 2: జిల్లాలో వర్షాలు ప్రారంభంతోనే సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతోపాటు ఇతర సంబంధిత శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ మృణాళిని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల నివారణను దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యులు స్థానికంగా నివాసం ఉంటూ రోగులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

07/03/2016 - 08:14

విశాఖపట్నం, జూలై 2: దేశంలోనూ, రాష్ట్రంలోనూ మహిళలకు రక్షణ లేకుండా పోతున్నదని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి ఆరోపించారు.

07/03/2016 - 08:10

విశాఖపట్నం, జూలై 2: ముడసర్లోవ రహదారిలో చేపట్టిన హెల్త్‌సిటీలో ఆసుపత్రుల నిర్మాణం పూర్తి చేసి త్వరలో ప్రారంభించాలని హెల్త్‌సిటీ యజమానులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. వచ్చే నెల మార్చి నాటికి పూర్తికాని ప్రాజెక్టులకు కేటాయించిన స్థలాలను వెనక్కు తీసుకుంటామని స్పష్టం చేశారు. హెల్త్‌సిటీలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు రూ.8 కోట్లు ఎపిఐఐసి ద్వారా ఖర్చు చేయనున్నట్టు సిఎం హామీ ఇచ్చారు.

Pages