S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 08:09

విశాఖపట్నం, జూలై 2: మీరు స్మార్ట్‌గా ఉంటేనే మీ సిటీ స్మార్ట్‌గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్‌కె బీచ్ వద్ద వైజాగ్ స్టీల్ నైట్ బే మారథాన్ పోటీలను శనివారం ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ అమెరికా సహకారంతో విశాఖ నగరం స్మార్ట్‌సిటీగా రూపుదిద్దుకోనుందని, స్మార్ట్‌సిటీ ప్రజానీకం అంతే స్మార్ట్‌గా ఉండాలన్నారు.

07/03/2016 - 08:09

విశాఖపట్నం(క్రైం), జూలై 2: సిద్ధాంతాల ముసుగులో మావోయిస్టు నేతలు డబ్బులు వసూలు చేసే గూండాలుగా వ్యవహరిస్తున్నారని నర్సీపట్నం అదనపు ఎస్‌పి ఐశ్వర్య రస్తోగి మండి పడ్డారు. ఇటీవల కాలంలో గిరిజన యువతి, యువకుల పట్ల దళంలో ఉన్న మావోయిస్టు అగ్ర నాయకులు చూపుతున్న వివక్షకు బాధపడి సుమారు పది మంది మహిళా మావోయిస్టులు స్వచ్ఛంధంగా లొంగపోవడం జరిగిందని శనివారం ఆయన పంపిన ప్రకటనలో తెలిపారు.

07/03/2016 - 08:07

శ్రీకాకుళం(కల్చరల్), జూలై 2: నగరంలో గుజరాతీపేటలో ఉన్న నారాయణ తిరుమల ఆలయంలో శనివారం అష్టోత్తర నామావలి పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వెంకటేశ్వర స్వామిని పూజించుకున్నారు. అర్చకులు జి.శ్రీనివాసరావు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా దూదివారి వీధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు రేజేటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలు పూజలు నిర్వహించారు.

07/03/2016 - 08:07

శ్రీకాకుళం(కల్చరల్), జూలై 2: శ్రీకాకుళం రంగస్థలం కళాకారులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద కళాకారులకు పింఛన్లు అందించడం మంచి సేవా కార్యక్రమంగా చేస్తున్నారని విశ్రాంతి సి ఇవో సురంగి మోహనరావు అన్నారు. శనివారం స్థానిక బాపూజీకళామందిర్‌లో శ్రీకాకుళం రంగ స్థల కళాకారుల సమాఖ్య ఆధ్వర్యంలో 201వ నెల సంస్కృతిక కార్యక్రమం జరిగింది.

07/03/2016 - 08:07

శ్రీకాకుళం(రూరల్), జూలై 2: రక్తదానం మరొకరికి ప్రాణదానం వంటిదని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం అన్నారు. శనివారం పెద్దపాడు రోడ్డులోని స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసులో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రక్తంలేక మరణాలే సంభవించకుడదని రక్తదానాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలన్నారు.

07/03/2016 - 08:06

శ్రీకాకుళం(రూరల్), జూలై 2: పుష్కరాల నెపంతో విజయవాడ నగరంలో వందల సంవత్సరాల నాటి అత్యంత ప్రాచీనమైన 45 హిందూ దేవాలయాలను రాష్ట్ర ప్రభుత్వం కూల్చి వేయడంపై విశ్వ హిందూ పరిషత్ జిల్లా శాఖ ఆందోళన వ్యక్తంచేశారు.

07/03/2016 - 08:04

శ్రీకాకుళం(టౌన్), జూలై 2: జిల్లాలో అర్హులైన వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు అందజేస్తున్న పింఛను బట్వాడాలో ఎంపిడివోలు జిల్లా కలెక్టర్‌ను సైతం మభ్యపెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీ రాష్ట్ర సభ్యులు తమ్మినేని సీతారాం విమర్శించారు.

07/03/2016 - 08:04

(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)

07/03/2016 - 08:00

నెల్లూరు రూరల్, జూలై 2: తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు విడతలవారీగా రుణమాఫీ చేస్తుంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు రుణమాఫీ జరగడం లేదంటూ దుష్ప్రచారం చేయడం తగదని ఆదాల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం నెల్లూరు మండల పరిధిలోని ములుముడి గ్రామంలో ఆయన పర్యటించారు.

07/03/2016 - 07:59

నెల్లూరు, జూలై 2: విద్యార్థులు తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటేనే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని నగర డిఎస్‌పి జివి రాముడు పిలుపునిచ్చారు. మన ఊరు - మన పోలీసు కార్యక్రమంలో భాగంగా రెండవ నగర పోలీసులు తమ పరిధిలోని బోడిగాడితోట, వైకుంఠపురం చుట్టుపక్కల ప్రాంతాలను దత్తత తీసుకున్నారు.

Pages