S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/18/2016 - 00:35

పాట్నా, మే 17: ప్రస్తుతం అమల్లో ఉన్న వినియోగదారుల రక్షణ చట్టం-1986 స్థానం లో కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

05/18/2016 - 00:35

న్యూఢిల్లీ, మే 17: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 22-23 తేదీల్లో ఇరాన్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు ఆర్థిక అంశాలపై ఆయన ఆ దేశంతో చర్చించనున్నారు. మళ్లీ ఇరాన్ నుంచి చమురు దిగుమతులను రెట్టింపు చేసుకోవాలని భారత్ చూస్తున్న నేపథ్యంలో మోదీ పర్యటనలో ఆ దిశగా సంప్రదింపులు జరిగే వీలుంది.

05/18/2016 - 00:33

న్యూఢిల్లీ, మే 17: కరవును శాశ్వతంగా పరిష్కరించాలంటే నదుల అనుసంధానం ఒక్కటే దారి అని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఈ విషయం చెప్పినట్లు ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. కరవును శాశ్వతంగా నివారించేందుకు అనుసరించవలసిన స్వల్ప, దీర్ఘ కాలిక చర్యల గురించి చర్చించేందుకే మోదీ ఇంత వరకు పదిమంది ముఖ్యమంత్రులతో సమావేశం జరిపారని చెప్పారు.

05/18/2016 - 00:32

న్యూఢిల్లీ, మే 17: ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ సేద్యంపై తీసుకొన్న చర్యలను ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. కరపు నివారణ కోసం చేపట్టిన ప్రయత్నాలు ముఖ్యంగా చెక్ డ్యామ్‌లు నిర్మించడం, నదులపై ఎత్తిపోతల పథకాలు, నీటి వనరులు సమర్థవంతంగా, పొదుపుగా వాడుతున్నట్లు ప్రధాని మోదీకి మంగళవారం భేటీలో చంద్రబాబు వివరించారు.

05/18/2016 - 00:31

ముంబయి, మే 17: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. దాని ఐదు అనుబంధ సంస్థలతోపాటు భారతీయ మహిళా బ్యాంక్ విలీనాన్ని మంగళవారం ప్రతిపాదించింది. దీనికి సంబంధించి అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులకు ప్రయత్నిస్తున్నట్లు బ్యాంక్ బోర్డు సమావేశం అనంతరం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఎస్‌బిఐ పేర్కొంది. మరోవైపు ఈ ప్రకటనతో అనుబంధ బ్యాంకింగ్ సంస్థల ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు.

05/18/2016 - 00:31

న్యూఢిల్లీ, మే 17: బంగారం ధరలు 30,000 రూపాయల దిగువకు చేరుకున్నాయి. మంగళవారం బులియన్ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర 230 రూపాయలు పడిపోయి 29,820 రూపాయల వద్ద స్థిరపడింది. 99.5 స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర 29,670 రూపాయల వద్ద నిలిచింది. వెండి ధర కిలో 160 రూపాయలు దిగజారి 41,100 రూపాయలను తాకింది.

05/18/2016 - 00:26

ఆదిలాబాద్,మే 17: ఈనెల 22న నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్ (టెట్)ను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో టెట్2016 పరీక్ష నిర్వహణపై ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. టెట్ పరీక్షను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రణాళికబద్దంగా నిర్వహించాలన్నారు.

05/18/2016 - 00:25

ఆదిలాబాద్, మే 17: గూడులేని నిరుపేద కుటుంబాలకు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంతో సొంతింటి కల నెరవేరుస్తామన్న ప్రభుత్వ హామీ ఆచరణలో అమలు కావడం లేదు. ఈ పథకం కోసం కొండత ఆశతో దరఖాస్తు చేసుకొని ఏడాది కాలంగా ఎదురుచూస్తున్న నిరుపేద లబ్ధిదారుల కల నేరవేరకుండా పోతోంది.

05/18/2016 - 00:25

బెల్లంపల్లి, మే 17: బెల్లంపల్లి పట్టణంలోని టేకుల బస్తీకి చెందిన సింగరేణి కార్మికుని కుమారుడు వరంగల్ రేంజ్‌లో సిఐడి డిఎస్పీగా పనిచేస్తున్న పులియాల రవికుమార్‌కు సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని డిజిపి కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర డిజిపి అనురాగ్ శర్మ రవికుమార్‌కు ఉత్తమ పోలీసు అవార్డు అందజేశారు.

05/18/2016 - 00:24

జన్నారం, మే 17: గత దశాబ్దాలుగా గిరిజనులు అటవీ ఉత్పత్తులపై ఆధారపడుతూ జీవనం సాగిస్తున్నారని, వారి ఉపాధిని దెబ్బతీసే విధంగా వ్యవహారిస్తున్న అటవీ శాఖ అధికారులు ఇకనైనా వేధింపులు మానుకోవాలని కోరుతూ మంగళవారం దొంగపెల్లి, మల్యాల, అల్లినగర్ గ్రామాలకు చెందిన గిరిజనులు జన్నారం అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ షౌకత్‌అలికి వినతి పత్రం అందజేశారు.

Pages