S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/24/2018 - 12:36

మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ విగ్రహ ఏర్పాటుపై నిరసనలు వెల్లువెత్తాయి. మిర్యాలగూడలోని తల్లిదండ్రుల సంఘం ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు కర్నాట ప్రభాకర్, న్యాయవాది చిలుకూరి శ్యామ్ మాట్లాడుతూ ఇది కుటుంబ సమస్య అని దీనిని కుల, మతాల సమస్యగా మార్చి సమాజంలోని అందరికీ ఆపాదించటం సమంజసం కాదని అన్నారు.

09/24/2018 - 07:04

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: విశాఖ మన్యంలో ఆదివారం జరిగిన ఘటన సామాన్యమైనది కాదు. ఒక ఎమ్మెల్యేని, ఒక మాజీ ఎమ్మెల్యేని అత్యంత దారుణంగా హతమార్చి మావోయిస్ట్‌లు పోలీసులకు సవాలు విసిరారు. ముఖ్యమంత్రి, డీజీపీ రాష్ట్రంలో లేని సమయంలో మావోయిస్ట్‌లు ఈ ఘాతుకానికి దిగారు. కొన్నాళ్లుగా మావోయిస్ట్‌లు వౌనంగా ఉంటే, ఉనికి కోల్పోయారని అంతా భావించారు. ఏఓబీలో తుపాకి కాల్పుల మోతలు లేవు. బూట్ల చప్పుళ్లు వినిపించలేదు.

09/24/2018 - 07:04

కొత్తవలస,సెప్టెంబర్ 23: రాష్ట్ర ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహనరెడ్డి ప్రజా సంకల్పయాత్ర సోమవారం జిల్లాలో ప్రారంభం కానుంది. యాత్రకు జిల్లాలో వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. జగన్‌యాత్ర మూడువేల కిలోమీటర్లు పూర్తవుతున్న సందర్భంగా జ్ఞాపికగా భారీ పైలాన్‌ను నిర్మించారు. కొత్తవలస మండలం చింతపాలెం వద్ద జగన్‌యాత్ర జిల్లాలోకి అడుగిడుతోంది.

09/24/2018 - 07:02

విజయనగరం, సెప్టెంబర్ 23: విశాఖ ఏజెన్సీలోని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమలపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఏవోబీలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. దీంతో ఏజెన్సీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు.

09/24/2018 - 07:00

విజయనగరం, సెప్టెంబర్ 23 : జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని జిల్లాలో రూ.28 లక్షల వ్యయంతో 500 గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఎపి గాంధీ స్మారక నిధి జిల్లా కన్వీనర్ పారినాయుడు తెలిపారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇదొక బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సుగా మిగిలిపోతుందన్నారు.

09/24/2018 - 06:50

* ఉప రాష్టప్రతి చేతులమీదుగా నేడు పర్యాటక కేంద్రాలు ప్రారంభం...

09/24/2018 - 06:49

అమరావతి, సెప్టెంబర్ 23: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అనుసరిస్తున్న ‘ఆపరేషన్ గరుడ’ వ్యూహం బెడిసికొడుతోంది. ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలగినప్పటి నుంచి బీజేపీ, టీడీపీ వ్యూహ ప్రతివ్యూహాలతో కత్తులు నూరుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో రెండు పార్లమెంట్, నాలుగు శాసనసభ స్థానాలను టీడీపీ మద్దతుతో బీజేపీ దక్కించుకుంది. రాజ్యసభ, శాసనమండలి స్థానాలను సైతం దామాషా పద్ధతిన పంచుకున్నాయి.

09/24/2018 - 06:48

విజయవాడ, సెప్టెంబర్ 23: ఇటీవల జరిగిన శాసనసభ వర్షాకాల ఏడు రోజుల సమావేశాల్లో ఎంతో హుషారుగా శాసనసభ్యల చుట్టూ తిరుగుతూ కనిపించిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు దారుణ హత్యకు గురికావటాన్ని తోటి సభ్యులు, శాసనసభ కార్యాలయ సిబ్బంది నమ్మలేకపోతున్నారు.

09/24/2018 - 06:47

అమరావతి, సెప్టెంబర్ 23: ఇంధన పొదుపు లక్ష్యసాధనలో భాగంగా నిర్వహణ, సాధన, వ్యాపారం (పీఏటీ) పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) రాష్ట్రాలకు సూచించింది. ఇంధన పొదుపుతో పాటు గణనీయమైన ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన, పర్యావరణ పరిరక్షణకు పీఏటీ అమలు తప్పనిసరని స్పష్టం చేసింది. ఇందులో అన్ని రాష్ట్రాలు క్రియాశీల పాత్ర పోషించాలని కోరింది.

09/24/2018 - 06:46

మచిలీపట్నం/ విజయవాడ, సెప్టెంబర్ 23: ప్రపంచంలోనే భారీదిగా నిలిచిన ‘రాఫెల్’ కుంభకోణానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిస్థాయి బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని రాష్ట్ర న్యాయ, క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.

Pages