S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/22/2018 - 04:45

ఐరాల, సెప్టెంబర్ 21: చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణం నేత్రపర్వంగా సాగింది. కాణిపాకం వినాయకస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉభయదేవేరులతో కలసి స్వామివారు అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేసారు.

09/22/2018 - 04:26

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓడించేందుకు ప్రతిపక్షం జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలనుకుంటున్న మహాకూటమికి గండి పడింది.

09/22/2018 - 04:25

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: దుష్ట పాకిస్తాన్‌తో సమావేశాలు, చర్చలు జరపలేమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా న్యూయార్క్‌లో భారత, పాకిస్తాన్ దేశాల విదేశీ మంత్రుల మధ్య జరగవలసిన సమావేశం రద్దయింది.

09/22/2018 - 02:37

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వచ్చే నెల 7న నగరంలోని నెక్లెస్ రోడ్డు, జలవిహార్ వద్ద క్యాన్సర్ రన్ నిర్వహించనున్నట్లు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ప్రకటించింది.

09/22/2018 - 02:25

* ‘ఉత్తర’ ఏజెన్సీలో భారీ వర్షాలు * నేడు కోస్తా, తెలంగాణలో చెదురుమదురు వానలు

09/22/2018 - 02:24

అనంతపురం, సెప్టెంబర్ 21: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామ సమీపంలో ఉన్న ప్రబోధానంద ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, భారీ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆరోపించారు.

09/22/2018 - 02:21

* వచ్చేనెల 9 నుంచి 11 వరకు ఏపీలో ఆర్థిక సంఘం ప్రతినిధుల పర్యటన

09/22/2018 - 02:19

నెల్లూరు, సెప్టెంబర్ 21: ఎంతో ప్రాముఖ్యత కలిగిన నెల్లూరు రొట్టెల పండుగ శుక్రవారం నుండి ఘనంగా ప్రారంభంకాగా, చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావాలని రొట్టె పట్టుకొని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మొక్కుకున్నారు. నగరంలోని బారాషహీద్ దర్గాలో ప్రారంభమైన ఈ మహోత్సవానికి తొలిరోజే భక్తులు పోటెత్తారు. సోమిరెడ్డితోపాటు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ కూడా పాల్గొన్నారు.

09/22/2018 - 02:05

హైదరాబాద్, సెప్టెంబర్ 21: కాంగ్రెస్ అధిష్ఠానం నియమించిన ఎన్నికల కమిటీల్లో బ్రోకర్లు ఉన్నారని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సీ కుంతియా శనిలా పట్టారని తీవ్ర ఆరోపణలు చేసిన ఆ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రాష్ట్ర నాయకత్వం షోకాజ్ నోటీసు జారీ చేసింది. రెండు రోజుల్లో దీనికి సమాధానం చెప్పాలని ఆ నోటీసులో ఆదేశించింది.

09/22/2018 - 01:44

న్యూఢిల్లీ: న్యాయం కోసం కోర్టును ఆశ్రయించడం తప్ప తనకు మరో మార్గం లేదని స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా స్పష్టం చేశాడు. అత్యుత్తమ క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నకు తనను ఎంపిక చేయకపోవడంపై అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోయిందని వాపోయాడు.

Pages