S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/19/2018 - 05:24

కౌటాల, నవంబర్ 18: భారతరత్న , డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాక్షిగా ఆయన పేరిట కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సృజల స్రవంతిని నిర్మించి తీరుతామని పీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టు విక్రమార్క అన్నారు.

11/19/2018 - 05:16

మెదక్, నవంబర్ 18: తెలంగాణ రాష్ట్రంలో తెరాస ఈ ఎన్నికల్లో వంద సీట్లు గెలుపొంది ప్రభుత్వాన్ని చేపడుతుందని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఈ నెల 21న మెదక్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న సందర్భంగా సభా స్థలిని, హెలిప్యాడ్ స్థలాన్ని మంత్రి హరీష్‌రావు పరిశీలించారు.

11/19/2018 - 05:12

వరంగల్, నవంబర్ 18: తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల సందర్భంగా ఏర్పడ్డ మహాకూటమి ఒక విఫల ప్రయోగమని, తెలంగాణ రాష్ట్రంపై జరుగుతున్న విష ప్రయోగమని, కాంగ్రెస్ రాజకీయ వ్యూహాత్మక తప్పిదం చేసిందని, దీంతో నష్టపోయేది కూడా ఆ పార్టీయే అని ఆపద్ధర్మ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

11/19/2018 - 05:11

ధర్మపురి, నవంబర్ 18: భారతీయ ప్రాచీన నాగరికతకు మూలాధారాలైన జీవనదుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వాలతో పాటు ప్రజలకు ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని మురళీధర్‌రావు అన్నారు. ఆదివారం రాత్రి ధర్మపురి క్షేత్ర గోదావరి తీరాన నిర్వహించిన గోదావరి హారతి కార్యక్రమంలో వేదికనుండి ఆయన మాట్లాడుతూ, గోదావరి రానున్న రోజులలో జీవనరేఖగా నిలువాలన్నదే తమ లక్ష్యమన్నారు.

11/19/2018 - 04:55

* వచ్చే నెల 4నుంచి నేరుగా సింగపూర్‌కు * ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీకి కార్యాచరణ

11/19/2018 - 04:53

విశాఖపట్నం, నవంబర్ 18: నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిఏటా నిర్వహించే వైజాగ్ నేవీ మారథాన్ ఆదివారం విశాఖ సాగర తీరంలో అట్టహాసంగా జరిగింది. దాదాపు 15వేలకు మంది పైగా మారథాన్‌లో పాల్గొన్నారు. సింబెక్స్ 18 ద్వైపాక్షిక విన్యాసాల్లో పాల్గొంటున్న రాయల్ సింగపూర్ నేవీ సిబ్బంది ఈ వేడుకలో పాల్గొన్నారు.

11/19/2018 - 04:51

విజయవాడ (సిటీ), నవంబర్ 18: నవ్యాంధ్ర రాజధాని అమరావతి బ్రాండ్ ఇమేజ్‌ను మరింతగా పెంచే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎఫ్1హెచ్2వో పవర్ బోట్ రేసింగ్ పోటీలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. ప్రపంచ వ్యాప్తంగా 56దేశాల్లో పరోక్షంగా కోట్ల మంది, ఇక్కడ ప్రత్యక్షంగా లక్ష మంది అభిమానులు వీక్షించిన పవర్ బోట్ రేసింగ్ పోటీల్లో అబుదాబీ జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది.

11/19/2018 - 04:03

తమన్నా, సందీప్‌కిషన్ హీరో హీరోయిన్లుగా బాలీవుడ్ దర్శకుడు కునాల్‌కోహ్లీ దర్శకత్వంలో వస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ -నెక్ట్స్ ఏంటి? నవదీప్, పూనమ్‌కౌర్‌లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్న చిత్రానికి సంబంధించి ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్‌లుక్, టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా చిత్రం ట్రైలర్ విడుదలైంది. అమ్మాయి-అబ్బాయి మధ్య ప్రేమ, ఆకర్షణ అంశాలను ఇందులో ప్రస్తావించారు.

11/19/2018 - 04:01

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చాలామంది తెలుగు డైరెక్టర్లకు ఒక కల. ఆయన ఓ పదేళ్ళపాటు సినిమాలకు దూరంగా ఉండడంతో చాలామంది ఈ జెనరేషన్ స్టార్ దర్శకులకు ఆయనను డైరెక్ట్ చేసే అవకాశం దొరకలేదు. ఆ లిస్టులో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు కూడా వుంది. తాజా సమాచారం ప్రకారం ఈమధ్యనే మెగాస్టార్ త్రివిక్రమ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మెగాస్టార్ ఇమేజ్‌కి కరెక్టుగా సూటయ్యేలా..

11/19/2018 - 03:59

హీరో సుధీర్‌బాబు, నాభ నటేష్ హీరో హీరోయిన్లుగా ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వంలో వచ్చిన ‘నన్నుదోచుకుందువటే’ చిత్రంతో మంచి హిట్ కొట్టాడు నూతన దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు. తొలి చిత్రం అయినప్పటికీ చాలా చక్కగా తెరకెక్కించాడని.. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా మలిచాడని మంచి పేరు తెచ్చుకున్నాడు. దాంతో ఈ దర్శకుడికి అవకాశాలు బాగానే వస్తున్నాయి.

Pages