S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/22/2019 - 01:59

చల్లపల్లి: చల్లపల్లి శివారు నారాయణరావునగర్‌లో శనివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన ప్రమాదంలో పేదల బ్రతుకులు బుగ్గిపాలయ్యాయి. పగలంతా పని చేసి వచ్చి ఆదమరిచి తమ గూటిలో నిద్రిస్తున్న వేళ సంభవించిన అగ్ని ప్రమాదం కారణంగా ఏడు కుటుంబాలనునడి రోడ్డున పడేసింది. శనివారం అర్ధరాత్రి 12గంటల సమయంలో సంభవించిన ఈ ప్రమాదానికి గల వివరాలు ఇలా ఉన్నాయి.

04/22/2019 - 01:58

ముసునూరు, ఏప్రిల్ 21: నిత్యం మొక్కజొన్న మెషీన్‌లో మొక్కజొన్న కండెలు వేస్తూ జీవనం సాగించే మహిళకు ఆ మెషీన్ రూపంలోనే మృత్యువు కబళించింది. మొక్కజొన్నలు ఆడే షెల్డర్ (మెషీన్)లో ప్రమాదవశాత్తు మహిళ పడి దుర్మరణం పాలైన సంఘటన గుడిపాడు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

04/22/2019 - 01:58

పామర్రు, ఏప్రిల్ 21: మండల పరిధిలోని పసుమర్రు గ్రామ వీరాబత్తినపురం కాలనీలో దోనే దుర్గ (28) అనే మహిళ ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పామర్రు ఎస్‌ఐ హబీబ్ బాషా తెలిపిన వివరాల ప్రకారం పుల్లేరు కాలువలోకి శనివారం సాయంత్రం బట్టలు ఉతకడానికి వెళ్లిన దుర్గ ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడిందన్నారు.

04/22/2019 - 01:57

పటమట, ఏప్రిల్ 21: మృత్యుంజయుడైన క్రీస్తును స్వాగతిస్తూ గుణదలమాత పుణ్యక్షేత్రంలో ఆదివారం పా స్కా(ఈస్టర్) సంబరాలు అంబర్నాంటాయి.

04/22/2019 - 01:57

మచిలీపట్నం: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాలో నిర్వహించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి స్క్రీనింగ్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. స్క్రీనింగ్ పరీక్ష రాసేందుకు జిల్లాలో 30వేల 523 మంది దరఖాస్తు చేసుకోగా 15వేల 617 మంది మాత్రమే హాజరవ్వగా 14వేల 906 మంది గైర్హాజరయ్యారు. హాజరు శాతం 51.16 శాతం మాత్రమే నమోదైంది.

04/22/2019 - 01:56

జి.కొండూరు: ఎండలు విపరీతంగా పెరగటంతోపాటు నీటి ఎద్దడి కారణంగా కూరగాయల ధరలు చెట్టెక్కి కూర్చున్నాయ. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందడం లేదు... విపణిలో మాత్రం ధరాఘాతంతో వినియోగదారుల జేబులు మాత్రం ఖాళీ అవుతున్నాయి. కూరగాయలు విక్రయించే చిరు వ్యాపారులు వేసవి సాకుతో కూరగాయల ధరలను అమాంతం పెంచేశారు. సాధారణంగా కొన్ని కూరగాయలు, ఆకుకూరలు ధరలు మాత్రమే పెరిగాయి.

04/22/2019 - 01:55

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 21: క్రీస్తు పునరుత్థానం సందర్భంగా క్రైస్తవులు జరుపుకునే ఈస్టర్ పండగ ను నగర శివారు ప్రాంతాలో ఘనంగా జరుపుకున్నారు.

04/22/2019 - 01:54

పాయకాపురం, ఏప్రిల్ 21: సహజంగా మండుటెండలో మిట్ట మధ్యాహ్నం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు ఇంటికెళ్దామా అన్న సమయంలో రైల్ గేటు పడితే సగటు సామాన్యుడికి ఎంతగా చిరాకు పుడుతుందో దాదాపుగా ప్రతి ఒక్కరికీ అనుభవపూర్వకమే..! కేవలం 5,10 నిముషాలు ఎండలో ఆగలేక అసహనం వ్యక్తం చేసే మనకు అదే రైల్వే ట్రాక్‌పై మండుటెండలో 8గంటల పాటు చమటలు కక్కుతూ వీరు పడే అవస్థలు వర్ణనాతీతంగా ఉంటుంది.

04/22/2019 - 01:53

ఇంద్రకీలాద్రి, ఏప్రిల్ 21: ఇంద్రకీలాద్రి అదిష్ఠాన దేవత శ్రీకనకదుర్గమ్మ సన్నిధిలో చైత్రమాస కల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా 7వ రోజైన ఆదివారం రాత్రి ఘనంగా శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి పవళింపుసేవ ఘనంగా నిర్వహించారు. స్థానాచార్యుడు విష్ణుబొట్ల శివప్రసాద్ ఆధ్వర్యంలో ఋత్వికులు దేవస్ధానం ఈవో వీ కోటేశ్వరమ్మ దంపతుల చేత శ్రద్ధతో ఈకార్యక్రమా న్ని చేయించారు.

04/22/2019 - 01:53

విజయవాడ (ఎడ్యుకేషన్), ఏప్రిల్ 21: ఇంజనీరింగ్‌కు సంబంధించి ఎం సెట్ ప్రవేశ పరీక్షలు జిల్లాలో ఆదివా రం ప్రశాంతంగా జరిగింది. ఆదివారం జరిగిన పరీక్షకు 3,066 మంది విద్యార్థులకు గాను 2955 మంది హాజరయ్యారు. హాజరు శాతం 96.38గా న మోదైంది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద క ట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టా రు. విద్యార్థుల కోసం మంచినీటి వస తి కల్పించారు. అలాగే ప్రాథమిక చికి త్సా శిబిరాలు ఏర్పాటు చేశారు.

Pages