S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/13/2018 - 23:55

టంగుటూరు, నవంబర్ 13 : పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కాకుటూరివారిపాలెం లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం టంగుటూరు మండలంలోని కాకుటూరివారిపాలెం గ్రామానికి చెందిన గూడూరి సుబ్బారావు అనే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, అప్పులబాధ తట్టుకోలేక మద్యానికి బానిసై సోమవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

11/13/2018 - 23:55

సంతనూతలపాడు, నవంబర్ 13 : మండలంలోని మద్దులూరు గ్రామానికి చెందిన నెప్పల శేషమ్మ అనే మహిళ మెడలోని బంగారు గొలుసును మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా లాక్కొని వెళ్లారు.

11/13/2018 - 23:54

జె. పంగులూరు, నవంబర్ 13 : పెద్ద నోట్లను రద్దు చేసి దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిన పాపం ప్రధాని మోదీదేనని కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మీ ఆరోపించారు. మంగళవారం అలవలపాడు గ్రామంలో అద్దంకి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటి కాంగ్రెస్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

11/13/2018 - 23:52

ఆధారాలు:
=======
అడ్డం

11/13/2018 - 23:51

ఆధారాలు
*
అడ్డం
*
1.చంద్రుడు (4)
4.తల్లిబాస (4)
6.శ్రేష్ఠం (5)
7.దురద (2)
8.‘తళాంగు...తోం’ వెనక నించి (4)
10.జనము మెచ్చిన అందాల నటి
వెనుదిరిగింది (3)
12.ఈ కాలపు చిన్నారులు రుచిగా వుందని చెప్పేందుకే వాడే ఆంగ్ల పదం (2)
13.యజమాని. ప్రభువు (2)
16.స్ర్తి (3)
18.చిత్తరువు (4)
20.దూషణ (2)

11/13/2018 - 23:47

ముంబయి, నవంబర్ 13: రూపాయి మంగళవారం బలపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 22 పైసలు పుంజుకొని, 72.67 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం, స్థూలార్థిక గణాంకాలు ఆశించిన దానికన్నా మెరుగ్గా ఉండటం వంటి అంశాలు రూపాయి పుంజుకోవడానికి దోహదపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ ముడి చమురు ధర ఒక పీపాకు 70 డాలర్ల కన్నా దిగువకు పడిపోయింది.

11/13/2018 - 23:47

సూళ్లూరుపేట, నవంబర్ 13: శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి ఇస్రో తొలి భారీ సమాచార ఉపగ్రహాన్ని పంపించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ ప్రయోగం ఇస్రోకు ఒక సవాలే కాకుండా భారత శాస్తవ్రేత్తల సాంకేతిక సామర్ధ్యానికి పరీక్షలాంటిది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్‌లో జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 డి 2 ప్రయోగంతో సందడి వాతావరణం నెలకొంది.

11/13/2018 - 23:47

గూడూరు, నవంబర్ 13: నెల్లూరు జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా తయారు చేయడానికి నవోదయం పథకం ద్వారా ప్రణాళికలు సిద్దం చేసామని ఎక్సైజ్ శాఖ నెల్లూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ డాక్టర్ వి.రాధయ్య తెలిపారు. మంగళవారం ఆయన గూడూరు ఎక్సైజ్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంగా విలేఖరుల మాట్లాడారు.

11/13/2018 - 23:46

నెల్లూరు, నవంబర్ 13: మహిళలకు భద్రతతో కూడిన సురక్షిత వాతావరణాన్ని కల్పించేందుకు అందరూ కృషి చేయాలని అందుకోసం జిల్లా పోలీస్ శాఖ పటిష్ఠ చర్యలు ప్రారంభించిందని ఎస్‌సి ఐశ్వర్య రస్తోగి తెలిపారు. జిల్లా కేంద్రంలోని దర్గామిట్టలో ఉన్న పోలీస్ కవాతు మైదానంలో మంగళవారం మహిళల భద్రత కోసం ఉద్దేశించిన మహిళా పోలీస్‌లతో కూడిన రక్షక్ బృందాలకు ఆయన జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.

11/13/2018 - 23:46

కోవూరు, నవంబర్ 13: ఉపాధిహామీ పథకం కింద జిల్లాలో మొదటిసారిగా గ్రామీణ ఉద్యానవనంలో జరుగుతున్న పనులను కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు మంగళవారం మండలంలోని పాటూరు గ్రామంలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఉద్యానవనం ఉండాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన మేరకు ఈ కార్యక్రమం చేపట్టారన్నారు.

Pages