S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/25/2019 - 01:39

కాచిగూడ: స్వర్ణ పుష్పం సామాజిక మాస పత్రిక 6వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగల్లో సేవలందించిన వారికి ‘హృదయ భారతి రత్న అవార్డ్స్’ ప్రదానోత్సవ కార్యక్రమం స్వర్ణ పుష్పం, హృదయ భారతి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్ర భారతిలో నిర్వహించారు.

03/25/2019 - 01:38

కాచిగూడ: ప్రముఖ రచయిత డా.సంగనభట్ల నరసయ్య రచించిన ‘భోగిని దండకము’ పుస్తకావిష్కరణ సభ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తేజ ఆర్ట్ క్రియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణాచారి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు.

03/25/2019 - 01:37

ఖైరతాబాద్: ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ ( ఏఐబీఎస్‌ఎస్) రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా అజ్మిరా శ్యామ్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఆదివారం మింట్‌కాంపౌండ్‌లోని గిరిజన భవన్‌లో సంఘ్ తాత్కాలిక అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్ నాయక్ ఆధ్వర్యంలో రాష్టస్థ్రాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జాతీయ అధ్యక్షుడు శంకర్ పవార్‌తో పాటు వివిధ జిల్లాలకు చెందిన నాయకులు హాజరయ్యారు.

03/25/2019 - 01:37

కాచిగూడ: తెలుగు కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మల్కాజ్‌గిరి జడ్జి బూర్గుల మధుసూదన్ అన్నారు. పద్మశ్రీ డా.నటరాజ రామకృష్ణ జయంతి సందర్భంగా ‘నటరాజ నృత్య వైభవం’ కళానిలయం సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బూర్గుల మధుసూదన్ నట్య గురువులకు ‘నటరాజ కళారత్న’ పురస్కారాలను ప్రదానం చేశారు.

03/25/2019 - 01:36

ఖైరతాబాద్: కాంగ్రెస్‌లో జరుగుతున్న లోటు, పాట్ల గురించి చెప్పినా పార్టీ అధిష్టానం పట్టించుకోలేదని రాపోలు ఆనంద భాస్కర్ తెలిపారు. దీంతోనే కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. 25 సంవత్సరాలుగా కాంగ్రెస్‌లో ఉండి తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకభూమిక వహించినట్టు చెప్పారు.

03/25/2019 - 01:35

రాజేంద్రనగర్, మార్చి 24: మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్ కౌర్ వ్యాఖ్యానించారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి పాలనను కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. మోదీ, కేసీ ఆర్‌లు కుమ్మక్కై దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

03/25/2019 - 01:34

జీడిమెట్ల, మార్చి 24: అనుమతుల్లేని బహుళ అంతస్థుల నిర్మాణాలకు కేరాఫ్‌గా మల్లంపేట్ మారింది. యథేచ్ఛగా ఐదారంతస్థుల నిర్మాణాలను ఎలాంటి డీవియేషన్‌లను పాటించకుండా నిర్మిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

03/25/2019 - 01:32

ఇబ్రహీంపట్నం, మార్చి 24: రాష్ట్ర సమగ్రాభివృద్ధి తెలంగాణ రాష్ట్ర సమితికే సాధ్యమని భువనగిరి పార్లమెంట్ సభ్యులు, ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పునరుద్ఘాటించారు. శనివారం రాత్రి మండల పరిధిలోని బొంగ్లూరు కళ్లెం జంగారెడ్డి గార్డెన్స్‌లో ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అధ్యక్షతన టీఆర్‌ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.

03/25/2019 - 01:32

మెహిదీపట్నం, మార్చి 24: కాచిగూడలో శనివారం రాత్రి భోజనం చేసిన విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన కలకలం కలిగించింది. 15మంది విద్యార్థులకు నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నగరంలోని కాచిగూడ ప్రాంతంలో ఉన్న అంజుమాన్ హాస్టల్‌కు చెందిన విద్యార్థులు శనివారం రాత్రి తీసుకున్న ఆహారంలో ఫుడ్ పాయిజన్ జరిగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

03/25/2019 - 01:30

మేడ్చల్, మార్చి 24: మండలంలోని మైసమ్మగూడ గ్రామ పరిధిలో గల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల 17వ వార్షికోత్సవాన్ని శనివారం రాత్రి ‘రెసోనెన్స్ 2కే19’ పేరుతో ఆట్టహాసంగా నిర్వహించారు.

Pages