S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

01/11/2020 - 23:34

మారుతి కెరీర్‌లో ఓ మైల్‌స్టోనీ మూవీ -ప్రతిరోజూ పండగే. రఘురామయ్యగా సత్యరాజ్ తన అనుభవంతో కూడిన నటన ప్రదర్శించి సినిమాకు వెన్నుముకగా నిలిచారు. బిజీ జీవితాల్లో కొట్టుకుపోతూ -జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఏవిధంగా నిర్లక్ష్యం చేస్తున్నామో భావోద్వేగాలతో చూపిస్తూనే, గుండె బరువెక్కకుండా హాస్యాన్ని మిళితం చేసి వినోదం చేయడం చిన్న విషయమేమీ కాదనిపిస్తుంది.

01/04/2020 - 23:26

ఈవారం విడుదలైన మత్తు వదలరా చిత్రం మమ్మల్నెంతో ఆకట్టుకుంది. వెనె్నల రివ్యూ చదివే సినిమా చూశాం. ఓ కొత్త ప్రయోగంలా అన్పించింది. ఓ సన్నివేశాన్ని ఎక్కడ బిగి సడలకుండా చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంది. ముఖ్యంగా నటీనటులందరూ కొత్తవాళ్లు అయినా పాత్రలకు తగ్గట్టుగా నటించారు. ముఖ్యంగా నేపథ్య సంగీతం చాలా బాగుంది.

12/28/2019 - 22:58

గతవారం వచ్చిన బాలకృష్ణ రూలర్ సినిమా చూశాక -ఏ ధైర్యంతో సినిమాలు తీస్తున్నారన్న అనుమానం కలగక మానదు. చూస్తే చూడండి లేదంటే లేదన్నట్టు వస్తున్న చిత్రాలను చూసి జాలేస్తుంది. బాలయ్య వయసుకి, ఆయన చేసిన పాత్రలకీ పొంతనే లేదు. పైగా విచిత్రమైన మేకవర్, విగ్గు వ్యవహారం బోర్ కొట్టించింది. అలాగే, రెండు వారాల క్రితం వచ్చిన వెంకీమామ చిత్రం కూడా. వెంకటేష్, నాగచైతన్య కలసి నటించిన ‘వెంకీమామ’ నిరాశ పరిచింది.

12/22/2019 - 04:51

మేనమామ మేనల్లుడన్న రియల్ లైఫ్ రిలేషన్‌ను రీల్ లైఫ్‌కి అప్లై చేస్తూ -వెంకటేష్, నాగచైతన్యలతో దర్శకుడు కెఎస్ రవీంద్ర తెరకెక్కించిన మల్టీస్టారర్ ‘వెంకీమామ’. నిజానికి కంటెంట్ కంటే.. కాంబినేషనే సినిమాకు ప్రాణం అంటూ ఆంధ్రభూమిలో వచ్చిన రివ్యూ అద్భుతంగా ఉంది. రిలేషన్స్‌లోని ఎమోషన్స్ చూపించే గొప్ప సినిమా అంటూ ప్రచారం చేశారే తప్ప, చిన్న పాయంట్‌ను చెప్పిందే చెప్పి తిప్పి తిప్పి మళ్లీ చెప్పినట్టే ఉంది.

12/14/2019 - 22:54

సైరా.. ప్లాప్! సాహో ఢాం!! పాన్ ఇండియా సినిమా అంటూ తీసి అప్రతిష్టపాలైనారంటూ.. జరా శంకర్ కూడా జాగ్రత్త అని ఓ పాఠకుడు అభిప్రాయంగా రాశారు. ఆయన తీస్తున్న భారతీయుడు-2ను దృష్టిలో పెట్టుకొనే ఈ చురక వేసి ఉండొచ్చు. శంకర్‌ని ఇలా డి గ్రేడు చేయడం భావ్యమేనా? ఇది ప్రాంతీయ ద్వేషంలా తోస్తుంది. అసలు దక్షిణాది వారంటేనే ఉత్తరాదికి వారికి ద్వేషం. నేడు తెలుగువారికి సోదర తమిళ తంబిలపై ద్వేషమెందుకో?

12/10/2019 - 22:53

‘ఫేక్’ దందా మూలాలను చర్చించిన చిత్రం -అర్జున్ సురవరం తీసి పారేయతగ్గ సినిమా కాదు. సమీక్షకులు మరీ తగ్గించి రేటింగులు ఇచ్చినా, సినిమా చూసిన తరువాత.. ఇప్పుడొస్తున్న చాలా సినిమాలకంటే బెటర్ అనిపించింది. సమీక్షకులు భిన్నకోణాల్లో సినిమాను సమీక్షించినా -ఆడియన్స్ మాత్రం సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ ఉందా? బోర్ కొట్టకుండా కూర్చోగలిగామా? అన్నది మాత్రమే చూస్తారు.

11/30/2019 - 22:37

రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రగా వచ్చిన తోలుబొమ్మలాటలో తలతిక్క కథనం విసిగించింది. గతంలో ఆయన చేసిన ‘ఆ నలుగురు’, ‘మీ శ్రేయోభిలాషి’ చిత్రాల్లో ప్రధానమైన భూమిక కనిపిస్తుంది. ఓ సమస్యను చర్చించే కథలుగా ఆ సినిమాలు రాజేంద్రుడి భావోద్వేగ నటనకు అద్దంపట్టాయి. ఇప్పుడు ఆయన ఎంచుకుంటున్న కథల్లో ఆహార్యం బాగున్నా -కథనం బాగోక పాత్రలన్నీ పేలవంగా మిగులుతున్నాయి.

11/23/2019 - 22:38

ఏ రామకృష్ణా..?
తెనాలి రామకృష్ణ సమీక్ష భలేవుంది. ఆసక్తికరమైన టైటిల్ పెట్టి ఆడియన్స్‌ని థియేటర్ వరకూ రప్పించగలరుకానీ, తొలి ఆటతోనే టాక్ విస్తృతమై సినిమా చీదేస్తుందన్న విషయాన్ని చిత్రబృందం గ్రహించలేకపోయంది. అసలు టైటిల్‌కీ, సినిమాకు ఏమైనా సంబంధం ఉందా? అన్న అనుమానాలు మొదటి సీన్‌నుంచే ఆడియన్స్‌ని వెంటాడాయ. ఏదో అనుకుని ఏదేదో తీసేస్తే ఆడియన్స్ చూసేసే రోజులు పోయాయని దర్శకులు గ్రహించాలి.

11/09/2019 - 20:02

గీతాంజలిని తొలిసారిగా సీతమ్మ పాత్రలోనే చూశాం. ఆ తరువాత కథానాయికగా, వాంప్‌గా, రెండో కథానాయికగా, ముఖ్యంగా అక్కినేని చెల్లెలిగా ఆమె నటించిన ప్రతి పాత్ర వైవిధ్యమే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆమె సినిమాలన్నీ అద్భుతం. ముఖ్యంగా ఏ పాత్రలో నృత్యం అయినా సరే అద్భుతంగా చేసి మెప్పించగల నటి గీతాంజలి. ఆమె తెలుగు ప్రేక్షకులను వదిలి దూర తీరాలకు వెళ్లడం, పాత సినిమా ప్రేక్షకులకు బాధాకరం.

11/02/2019 - 20:40

తమన్నా మీద నయనతార గుస్సా అట. ఎందుకంటే సైరాలో తన పాత్రకన్నా ఆమె పాత్రే ఎక్కువని. పైగా నయన్ కంటే తమన్నాకే ప్రశంసలు ఎక్కువగా అందాయంటూ ఓ పత్రిక కథనం. ఆ అభిప్రాయాన్ని బలపరుస్తూ తమన్నా కూడా ‘సీనియర్ నటి నయన్ ఉన్నా తనకే ప్రేక్షకామోదం లభించింది’ అంటూ డబ్బాకొట్టుకుంది. పైగా రామ్‌చరణ్ భార్య ఉపాసన తమన్నా నటనకు ఫిదా అయి గిఫ్ట్ ఇచ్చిందన్న వార్త ప్రచారం పొందింది.

Pages