S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

12/11/2017 - 17:46

బాల బాలికలే ప్రధాన పాత్రలతో అనేక చిత్రాలు నిర్మిం చి విజ యం సాధించిన చిత్రాలు మచ్చుతునకలుగా చెప్పవచ్చు. బాలమిత్రుల కథ, బాలరాజు కథ (1974), మాస్టర్ రాముగా పేరు పొందిన ఆనాటి బాలనటులలో పాపం పసివాడు, ఈనాటి లిటిల్ సోల్జర్స్, మురళీమోహన్ నటించిన ‘రామదండు’ పిల్లల చిత్రంగా అలరించింది.

12/11/2017 - 17:46

సినిమా రిలీజ్ ముందు ప్రచురించే తారల, దర్శకుల ఇంటర్వ్యూలల్లో అటు ఇటూ తిప్పి అవే ప్రశ్నలు, అవే జవాబులు ప్రచురిస్తూ బోర్ కొట్టిస్తున్నాయి అన్ని పత్రికలూ. ఈ చిత్రం హిట్ అవుతుందనుకున్నారా? ఎలాంటి చిత్రాల్లో నటిస్తారు? సినిమాల్లో చేరుతానంటే పేరెంట్స్ ఒప్పుకున్నారా? పెళ్లి ఎప్పుడు? ఇలాంటివే ప్రశ్నలన్నీ. జవాబులు కూడా హిట్ అనుకున్నా కాని ఇంత పెద్ద హిట్ అనుకోలేదు. నటనకు ఆస్కారమున్న చిత్రాలే చేస్తా.

12/11/2017 - 17:45

విమర్శించేవాళ్లు విమర్శించుకోండి, ఐడోం ట్ కేర్ అన్న ధోరణిలో రెండు కళ్ళూ లేనివాడు 70 కి.మీ వేగంతో పోతున్న ట్రెయిన్‌ని పరుగు పరుగున అందుకొని రైలెక్కడంలాంటి సీన్లతో రాజా ది గ్రేట్ అనిపించిన దర్శకుని ప్రతిభకు జోహార్లు. రాబోయే చిత్రంలో రెండు కాళ్లూ లేని హీరో కప్పలాగా దుముకుతూ విమానంలోకి గెంతి కప్పగెంతులతో విలన్లని తన్ని హీరోయిన్‌ని దక్కించునే సినిమా ఈ దర్శకుడే తీయాలి. చూసి ఆంధ్రులు తరించాలి.

12/04/2017 - 18:52

ఈ సినిమా పేరును చూస్తే గౌరవం కలుగుతుంది. ఇందులోని పెద్దమనుషులు అసలు పెద్దమనుషులు కారనే వ్యంగ్యం వున్నది. ‘పరమగురుడు చెప్పినవాడు పెద్దమనిషి కాడయా’ అని పరమానందయ్య శిష్యులు సినిమాలో ఓ పాట ఉంది. గుడిని, గుడిలోని లింగాన్ని మింగే పెద్దమనుషులుగా సమాజంలో చెలామణి అయ్యేవారు అర్థశతాబ్దం క్రింద కూడా కలరని ఈ చిత్రం చెప్పింది.

12/04/2017 - 18:52

తప్పని తద్దినంలాగా బాలల చిత్రోత్సవాలు జరుపుతున్నారు గాని అవార్డులు విదేశాలే కొట్టుకుపోతున్నాయి. మన దేశానికి చాలా అరుదుగా అవార్డులు లభిస్తున్నాయి. మీరు బాలల చిత్రాలు తీయవచ్చు కదాని ప్రఖ్యాత దర్శకుడు బి.ఎన్.రెడ్డిని అడిగితే, ఏవో కొన్ని తప్ప ఇప్పుడు వస్తున్నవన్నీ బాలల చిత్రాలే కదా అన్నాడాయన!

12/04/2017 - 18:51

సినిమా ఫంక్షన్స్‌లలో గరగర స్వరంతో సరిగా వినిపించని, అర్థంకాని రీతిలో మాట్లాడే కమల్‌హాసన్ నేతగా బహిరంగ సభల్లో అనర్గళంగా మాట్లాడుతాడు అనుకోలేం. ఒక ట్వీట్‌లో అతడు హిందూ ఉగ్రవాదం అనడంతో తమిళ హిందూ సంస్థ ఒకటి ఆయన్ని చంపేయాలన్నది. కమల్‌ని సమర్థిస్తూ ప్రకాశ్‌రాజ్ రాజకీయాల్లోకి నా రాకను ఎవరూ అడ్డుకోలేదని అన్నారు. ఎవరు అడ్డుకున్నారుట?! ఆయన తప్పక రాజకీయాల్లోకి రావాలి. కమల్ పార్టీలో చేరాలి.

12/04/2017 - 18:51

అక్టోబర్ 10వ తేదీ ‘వెనె్నల’లో లవకుశ చిత్రం గురిం చి పూజారి వారు చెప్పిన నాలుగు మాటలు బాగున్నాయి. కొనసాగింపుగా మరో రెండు మాటలు.

12/04/2017 - 18:50

టీవీ కామెడీ షోలలో బూతులు కూస్తూ స్ర్తి పాత్రధారుల్ని తన్నడం, కొట్టడం చేస్తూంటే కార్యక్రమంలో మహి ళా జడ్జి పకపక నవ్వుతూ ఎంజాయ్ చేయడం చూస్తుంటాం. మన చర్మాలు కాస్త మందం కాబట్టి ఇవన్నీ కామెడీగా చెల్లిపోతున్నాయి. హిందీ నటుడు అక్కి (అక్షయ్‌కుమార్) హాస్యనటి మల్లిక జడ్జీలుగా నిర్వహించే ఒక హిందీ కామెడీ షోలో అతను ఆమెతో ‘నువ్వు ఆ గంటను మోగించు, నేను నిన్ను మోగిస్తా’ అన్నాడట.

12/04/2017 - 18:50

సుదీర్ఘకాలం మరో ధ్యాస లేకుండా నామమాత్ర పారితోషికానికి బాహుబలిలో నటించి అద్భుత విజయం అందుకున్నాడు ప్రభాస్. అతడిప్పుడు తప్పటడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది. హిందీలో డైరెక్ట్ చిత్రం కోసం ప్రఖ్యాత దర్శకుడు కరణ్ జోహార్ అతనిని సంప్రదిస్తే దిమ్మతిరిగేట్లు 20 కోట్ల పారితోషికం అడిగాడట. రజనీకాంత్‌కే నేరుగా హిందీ చిత్రాలు లేవు. అన్నీ డబ్బింగ్‌లే. నిజానికి మన హీరోలెవరూ బాలీవుడ్‌లో నిలదొక్కుకోలేకపోయారు.

12/04/2017 - 18:49

స్పైడర్‌ని ఆకాశానికి ఎత్తేస్తూ వచ్చిన లేఖ చూసి లోకోభిన్నరుచిః అని నవ్వుకున్నాం. ఎందుకంటే ఆ చిత్రం మహేష్ అభిమానులకూ తృప్తినివ్వలేదు. సాదాసీదా కథ, నటనకవకాశం లేని హీరో పాత్ర, చప్పని క్లైమాక్స్ విలన్‌కే ఎక్కువ ప్రాధాన్యం- అన్నీ కలిసి చిత్రాన్ని దెబ్బతీశాయి. నిర్మాతకు లాభాలొచ్చినా పెద్ద మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్స్ మునిగిపోయారు. తమిళంలో కూడా ఈ చిత్రం ఎవరినీ మెప్పించలేదు.

Pages