S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

12/25/2017 - 19:03

ధనికులు, మధ్యతరగతివారు తేడా లేకుం డా పన్ను ఎగ్గొట్టడానికి లే దా తక్కువ ప న్ను కట్టడానికి ప్రయత్నిస్తారు. ఈమ ధ్య నటి అమలాపాల్ పాండిచ్చేరిలో కోటి రూపాయలకుపైగా వెచ్చించి కారు కొన్నది. ఆ కారును స్వం త రాష్ట్రం కేరళలో రిజిస్ట్రేషన్ చేయిచుకుంటే 20 లక్షలు టాక్స్ పడుతుంది.

12/25/2017 - 18:54

సెంటిమెంట్‌ని గౌరవించరా? అని ప్రశ్నిస్తూ ప్రొఫెసర్ రాసిన వ్యాసం ఆలోచింపచేసింది. ఇతర మతాల జోలికి వెళ్లలేని పిరికివాళ్లు, తమకు లైసెన్సు వున్నట్లు హిందువులమీద పడతారు. వ్యాసంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందంటూ రేపు సీతా రావణులమధ్య డ్యూయెట్ పెట్టవచ్చు అన్నారు. ఆ ప్రయత్నమూ జరిగింది.

12/25/2017 - 18:54

రాజకీయ చిత్రాలకు అంతం ఎక్కడ? వ్యాసం ఆలోచింపజేసింది. బాగుంది. కానీ లక్ష్మీ పార్వతిని వ్యాంప్‌గా చూపదలచారు, ఒక స్ర్తిని అంతగా అవమానించదగునా అని అనడం ఆలూ లేదూ చూలూ లేదు అన్నట్లుగా వుంది. అది నిజమో కాదో కానీ వర్మ సినిమా వెనుక వున్నవాళ్లను చూస్తే ఎన్టీఆర్, చంద్రబాబులను టార్గెట్ చేస్తారనిపిస్తోంది.

12/25/2017 - 18:53

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో కొంతమందికి అన్యాయం జరిగింది అన్నది నిజం. అల్లు అర్జున్‌కు రుద్రమదేవి చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్రకు ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. నిజానికి అల్లు అర్జున్ మంచి పేరున్న హీరో. 2014, 15, 16 సంవత్సరాలకుగాను ఒక్క మెగా హీరోకు కూడా ఉత్తమ నటుడు అవార్డు రాకపోవడం విచిత్రం.

12/25/2017 - 18:53

ఈమధ్య వచ్చిన హారర్ చిత్రాలలో గృహం ఒకటి. అయితే కథాబలం కంటే ఫొటోగ్రఫీకి ప్రాధాన్యత ఇచ్చారు. నటీనటులు తమ పరిధిలో నటించి మెప్పించారు. పాత్రకు తగిన విధంగా సస్పెన్స్ బాగా కుదించి తీయాలన్న ఆశ నిరాశపరిచింది. కాకపోతే సన్నివేశాలకనుగుణంగా భయం పుట్టించారు. ఏది ఏమైనా చిత్రం ఫర్వాలేదు. హారర్ చిత్రాల దర్శకులు వెరైటీ కథలు ప్రేక్షకులకు అందిస్తే మరింత రాణిస్తాయి.

12/25/2017 - 18:52

మహాకవి శ్రీశ్రీ అన్నట్లు తెలుగు సినిమా నటులు రాజకీయాలకు అతీతులు. వారు దేనికీ స్పందించకపోవడం చైతన్యం కాదు. చచ్చుదనమే. సమాజానికి నటుడు అతీతుడు. వారు తమిళ సోదరులనుంచీ నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అస్థిరంగా అవినీతిలో కూరుకొనిపోయి నాటకంగా సాగుతున్న పరిపాలనపై కమల్‌హాసన్, ప్రకాష్‌రాజ్‌లు ధ్వజమెత్తడం ఆహ్వాదించదగిందే. అన్యాయంపై వౌనం ఆత్మహత్యతో సమానం. మనకెందుకులే..?

12/25/2017 - 19:01

ఆది, బ్రహ్మాజీ ముఖ్యపాత్రధారులుగా రష్మి, దెయ్యం పాత్రలో హిమజ అద్భుతంగా నటించారు. ప్రభాకర్ దర్శకత్వంలో వచ్చిన ‘నెక్స్ట్ నువ్వే’ చిత్రం వెరైటీ హారర్ చిత్రంగా మిగిలిపోయింది. అడుగడుక్కీ సస్పెన్స్‌తో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈమధ్య వచ్చిన హారర్ చిత్రాలకు ధీటుగా వుంది. పాటలు ఫర్వాలేదు, సంగీతం బాగుంది. మంచి వసూళ్ళను కూడా రాబట్టింది.
-విజయకుమార్ చోడవరపు, హైదరాబాద్

12/18/2017 - 18:48

అక్టోబర్ 10వ తేదీ వెనె్నలలో లవకుశ చిత్రం గురించి పూజారి వారు చెప్పిన నాలుగు మాటలు బాగున్నాయి. కొనసాగింపుగా మరో రెండు మాటలు.

12/18/2017 - 18:47

ఫిలిం అవార్డులే కాదు సాహిత్య, సామాజిక అవార్డులు కూడా వివాదాస్పదం అవుతూనే వున్నాయి. నాగయ్య అష్టకష్టాలు పడి అప్పులపాలై నిర్మించి దర్శకత్వం వహించిన భక్తరామదాసుకి ఒక్క నందీ రాలేదు. రామదాసుకి రాగిచెంబు అయినా ఇచ్చారు కాదని అప్పట్లో విమర్శలొచ్చాయి.

12/18/2017 - 18:47

‘సెక్స్ భాగోతాల ప్రభావం’ వ్యాసం ఆలోచింపజేసింది. నిజానికి పాశ్చాత్య దేశాల్లో సెక్స్ పవిత్ర కర్మ కాదు. అవసరాలకు శరీరాన్ని ఉపయోగించుకోవడం తప్పుకాదనుకుంటారు చాలామంది. వ్యతిరేకించిన కొద్దిమందే మీడియాకెక్కుతారు. అన్ని విషయాల్లోనూ పాశ్చాత్యుల్ని అనుకరించడం భారతీయులకు అలవాటే. పబ్బులు, సహజీవనాలు అలా వచ్చినవే. ఇవి తప్పు కానప్పుడు ఫ్రీ సెక్స్ తప్పెలా అవుతుంది? నో అనేవాళ్ళని బలవంతపెడితేనే నేరం.

Pages