S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

10/16/2017 - 19:49

సినిమాని కాక పరిశ్రమలోని వ్యక్తుల్ని తిట్టడం సినిమా ప్రమోషన్‌లో భాగం అయిపోతున్నది. ఇందులో కంగనాది అందెవేసిన చేయ! ఆమె నటించిన చిత్రం రంగూన్ విడుదల ముందు హృతిక్ తనని అన్ని విధాలా వాడుకున్నాడని ఆరోపించి అభిమానుల సానుభూతి పొంది చిత్రం హిట్ చేసుకుంది. ఆ దెబ్బతో హృతిక్ భార్య భారీ మొత్తం గుంజుకుని విడాకులు తీసుకుంది.

10/16/2017 - 19:48

చిన్న చిన్న పాత్రలు వేస్తూ హీరోయిన్స్‌గా ఉన్నత స్థాయికి ఎదిగిన నటీమణులు ఎందరో ఉన్నారు. సావిత్రి తొలినాళ్ళల్లో హీరోయిన్స్ పక్కన గుంపులో నటించిన సంఘటనలు ఉన్నాయి. షావుకారు జానకి చరణదాసిలో, కృష్ణకుమారి ఇలవేల్పు సినిమాలో రేలంగి సరసన నటించారు. అలాగే రాజసులోచన వంటివారు కూడా. వాణిశ్రీ, శారద వంటివారు సైతం చిన్న చిన్న పాత్రలతోపాటు హాస్యనటుల ప్రక్కన నటించి ఉన్నత శిఖరాలు అధిష్ఠించారు.

10/16/2017 - 19:47

బాబి పేరుతో దర్శకత్వం (జైలవకుశ) వహించిన కె.ఎస్.రవీంద్ర రాసిన కథగా మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా టైటిల్స్ చూపించారు. కాని ఆ కథ థీమ్, కొన్ని సన్నివేశాలు తను రాసిన నవల ‘నా మనసు కోరింది నినే్న’లోనివి అంటూ కాపీ రైట్ చట్టం కింద ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు, దర్శకుడు దశరథ్‌లపై రచయిత్రి శ్యామలారాణి కేసు పెట్టింది. నోటీసు అందిన తర్వాత స్పందిస్తామని దిల్‌రాజు ప్రతినిధులన్నారు. చిత్రసీమలో కాపీ లు సహజమే.

10/16/2017 - 19:46

రచయిత విజయేంద్రప్రసాద్ రాసిన కథలు ‘్భజరంగీ భారుూజాన్’, ‘బాహుబలి’ జాతీ య అంతర్జాతీయ ఖ్యాతిగాంచాయి. ఆయన పేరు చెబితే చాలు వేరే ప్రచారం అక్కరలేకుండా ఆయన రాసిన చిత్రాలు హిట్ అయిపోతాయి అంటూ ఆయన దర్శకత్వం కూడా వహించిన ‘శ్రీవల్లీ’ రిలీజ్‌కు ముందు ప్రముఖులు డబ్బాలు మోగించారు. అతి చేస్తే గతి చెడుతుందని నిరూపిస్తూ శ్రీవల్లీ ఢాం అంది! నిజానికి ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ఏదీ పెద్దగా హిట్ అవలేదు.

10/16/2017 - 19:46

‘డ్రాగన్ లార్ట్’ చిత్రంలో జాకీచాన్ జియాం జీ అనే ఆట చిత్రీకరించే సమయంలో 2500 రీటేకులు తీసుకున్నాడు. ‘ఆర్మర్ ఆఫ్ గాడ్’ చిత్రం సన్నివేశంలో చెట్టుమీదనుండి ప్రమాదవశాత్తు పడి శరీరంలోని ముఖ్యమైన ఎముకలు విరిగి తీవ్రమైన ప్రమాదానికి గురియైనాడు. అతడు మరలా జన్మనెత్తి చలన చిత్రాలలో నటిస్తాడని ఎవరూ అనుకోలేదు. అది నిజంగా దైవలీల అనుకోవచ్చు. ఆయుష్షు గట్టిదైతే ఎన్ని అపాయాలు ఎదురైనా చిరంజీవిగా ఉండటం ఎంతో విశేషం!

10/16/2017 - 19:45

గురు సినిమాను ఎలాం టి కమర్షియల్ విలువలు లేకుండా రొటీన్‌కు భిన్నం గా చక్కని కానె్సప్ట్‌తో తయారుచేశారు. గురు పాత్రలో వెంకటేశ్ ఒదిగిపోయారు. తనకున్న ఇమేజ్‌ని గురించి ఆలోచించడు ఈ ఒకే ఒక్క నటుడు వెంకటేశ్. శిష్యురాలిగా నటించిన రితికాసింగ్ చక్కని నటన ప్రదర్శించారు. తొలుత అల్లరి పిల్లగా, ఆ తర్వాత బాక్సింగ్ క్రీడాకారిణిగా చివరకు గురువుకు తగ్గ శిష్యురాలిగా నటించి మెప్పించారు.

10/16/2017 - 19:44

‘జై లవకుశ’ సినిమా క్లాస్, మాస్ అందరినీ అలరిస్తూ, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం అనిపించుకుంది. సింహాద్రి తరువాత ఎన్టీఆర్ వన్‌మ్యాన్ షో అయింది జైలవకుశ. ఆద్యంతం ఎన్‌టిఆర్ కడుపుబ్బ నవ్వించడమే గాక కంటతడి పెట్టించాడు. నవరసాలనూ అలవోకగా పోషించి, అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. మూడు పాత్రల నటనలో ఇంతవరకూ ఎవ్వరూ చూపించలేనంత వైవిధ్యం చూపించాడు.

10/09/2017 - 19:26

హరిశ్చంద్ర’ చిత్రంతో రుక్మిణిగారి నటన మొదలైంది. కథానాయకురాలుగా 40 చిత్రాలలో నటించింది. గుణసుందరి కథలో జూనియర్ శ్రీరంజనిగారితో సహచరురాలుగా నటించింది. ఎవియం సంస్థ నిర్మించిన శ్రీవల్లి చిత్రంలో నటించిన కథానాయకుడు మహాలింగం. హిందీలో లవంగి మంజరి చిత్రాలలో నటించింది. చిత్ర దర్శకుడు వై.వి.రావు వీరి భర్త! రుక్మిణి తెలుగు, హిందీ, తమిళ చిత్రాలలో నటించి మహానటిగా పేరుతెచ్చుకొన్నది.

10/09/2017 - 19:26

పాటకంకి మురిసింది. వెనె్నలలో మెరిసింది. ఇం కా కొంచెం మెరిస్తే ఇంకా బాగా కాంతులీనేది. అదేమంటే కొమ్మినేని అప్పారావు చక్రవర్తి ఎలా అయ్యా డు. ఆయన జన్మించి చనువు చాలించినదెప్పుడు? ఇంకా మరింత లోతుకెడితే, ఆయన సంతానం ఎంత? వారికేమైనా సంగీ తం అబ్బిందా? నాకు తెలిసినంతవరకు చక్రవర్తిగా నామకరణం చేసింది దాసరి నారాయణరావు. ఈ సంగీతజ్ఞుడి శిష్యుడు కీరవాణి అని ఓ టీవీ కార్యక్రమంలో చూపారు.

10/09/2017 - 19:25

విష్ణుప్రియ ప్రొడక్షన్స్ ‘వియ్యాలవారి కయ్యాలు, ‘వినాయక విజయము’, ‘కోరుకున్న మొగుడు’ చిత్రాలను గతంలో నిర్మించింది. ప్రస్తుతం ‘ప్రతిబింబాలు’ రీరికార్డింగ్, సెన్సార్ పూర్తయి ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం క్యూబ్ ప్రింటుకు డబ్బులేక ఆగిపోయింది. ఇందులో అక్కినేని, జయసుధ, గుమ్మడి, సుత్తివేలు మున్నగువారు నటించారు. మా ఆర్థిక పరిస్థితి దయనీయంగా వున్నదని ఈ పత్రిక ద్వారా తెలియజేస్తున్నాం.

Pages