S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

10/09/2017 - 19:25

తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయిక పాత్రలతో పాటు ప్రతినాయిక పాత్రలను వేసి మెప్పించిన ఎందరో ప్రముఖ నటీమణులు ఉన్నారు. భానుమతి ప్రతినాయిక పాత్ర ఉన్న తెనాలి రామకృష్ణుడు, పల్నాటియుద్ధం, పెద్దరికం వంటి పాత్రలలో అలరిపంజేశారు. తొలినాళ్ళలో అంజలీదేవి కీలుగుర్రం వంటి సినిమాల్లో నటించారు. ప్రముఖనటి సావిత్రి అభిమానం సినిమాలో ప్రతినాయిక పాత్ర ఉన్న పాత్రను పోషించారు.

10/09/2017 - 19:24

వెనె్నల (12-9-17)లో చక్రవర్తిపై వ్యాసం బాగుంది. ఆయన ‘మదనమంజరి’ అనే హిందీ నుండి అనువాద చిత్రంలో ‘ఇదిగో బాబూ మూలిక’ అనే పాట ఘంటసాలతో పాడారు. ఈ చిత్రం సుమారు 1961లో వచ్చింది.
-డి.ఎస్.శంకర్, వక్కలంక

10/09/2017 - 19:24

ఇప్పుడు రాష్ట్రంలో మున్సిపాలిటీ, కార్పొరేషన్ వాళ్లు సినిమా థియేటర్ల వారిని సినిమా వాల్‌పోస్టర్లను ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ వ్యక్తుల నివాసాల గోడలపై అంటించడం నిషేధించారు. కొన్ని పట్టణ ప్రాంతాలలో ఈ నిషేధం అమలువలన సినిమా ప్రేక్షకులకు ఏ సినిమా ఏ థియేటర్‌లో ఆడుతుందో తెలియని విచిత్ర పరిస్థితి ఏర్పడింది.

10/09/2017 - 19:23

ఎన్‌టిఆర్ నటించిన జై లవకుశ చిత్రం చాలా బావుంది. మూడు పాత్రలలో ఎన్‌టిఆర్ నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. జై, లవ, కుశ ఈ మూడు క్యారెక్టర్లకు ఎన్‌టిఆర్ జీవం పోశారని చెప్పొచ్చు.

-కె. అహల్య, మహబూబ్‌నగర్

10/02/2017 - 21:24

ఫిలిం సెన్సారింగ్‌ని నిరసిస్తూ సెన్సార్ బోర్డుని ఎత్తేసి దర్శక నిర్మాతలకు స్వయం నియంత్రణ హక్కు ఇవ్వాలని పెద్ద తలకాయలు అప్పుడప్పుడు ప్రకటిస్తూ ఉంటాయ. స్వయం నియంత్రణ అంటూ మీడియా ఎంత అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నదో చూస్తూనే ఉన్నాం. భారతీయులు అసలు నియంత్రణనే పట్టించుకోరు. పైగా స్వీయ నియంత్రణా? బూతు చిత్రాలు అనగానే కొందరు దర్శకులు జ్ఞాప కం వస్తారు. సెన్సారు బోర్డు లేకపోతే వాళ్లు విజృంభిస్తారు.

09/25/2017 - 21:40

ఐటమ్ సాంగ్ అనగానే బూతు పాట అని భావిస్తారు. ఫలానా హీరోయిన్ ఈ పాటలో నటిస్తుందంటే ఆ సినిమా కోసం ఎదురు చూస్తారు. భారీ పారితోషికం కోసం హీరోయిన్లు కూడా ఈ పాటలు చేయడానికి ఎగబడుతున్నారు. ఐటమ్ సాంగ్ అంటే చీప్ భావన వుంది కాబట్టి హీరోయిన్లు వాటిని ప్రత్యేక గీతాలు అని గొప్పలు పోతున్నారు. లేని గౌరవం ఆ పాటలకు ఆపాదిస్తున్నారు.

09/18/2017 - 22:48

గతంలో విజయవంతమైన పోకిరి చిత్రా న్ని అటుఇటుగా మార్చి పూరి జగన్నాథ్ బాలకృష్ణతో పైసావసూల్ అంటూ వచ్చాడు. అయితే ఆయన ప్రయత్నం దారుణంగా బెడిసికొట్టిం ది. బాలకృష్ణ తరచుగా చేసే పాత్రలకు భిన్నంగా తీర్చిదిద్దిన తేడా సింగ్ పాత్ర ఒక్కటే ఈ సినిమాలో ప్లస్‌పాయింట్. డిఫరెంట్ యాంగిల్‌లో ఆ పాత్రను డిజైన్ చేసినా నటుడి నటన, సంభాషణలు ఆకట్టుకోలేక పోయా యి. ఇక సినిమాలో కథ నిల్.

09/11/2017 - 22:03

ఆచూకీ దొరకని మాఫియా డాన్. అతన్ని పట్టుకోవడంలో పోలీసు డిపార్టుమెంట్ వైఫల్యం. అలాంటి డాన్‌వల్ల హీరోయిన్ ఫ్యామిలీకి సమస్యలు రావడం. ఇటు హీరోయన్ ఫ్యామిలీని రక్షించడానికి, అటు పోలీస్ డిపార్ట్‌మెంట్ పరువు నిలపడానికి -దిగొచ్చిన దేవుడిలా హీరో ఎక్కడినుంచో ఊడిపడటం. విలన్ గ్యాంగ్‌ని అంతమొందించటం. కథ సుఖాంతం. -అర్థమయ్యే ఉంటుంది ఇదేదో స్టార్ హీరో సినిమా అని.

09/04/2017 - 22:13

ఎప్పుడో చూసేసిన దేవదాసును ఇప్పటి కాలమాన పరిస్థితులు, ఆలోచనలకు అనుగణంగా మలకుంటే కనిపించే దృశ్యమే -అర్జున్ రెడ్డి. ఆధునిక దేవదాసును చూపించటంలో దర్శకుడు నిజాయితీగా నమ్మిన క్రియేటివిటీ వాడాడనిపించింది. ఇదొక బూతు సినిమా అనే వాళ్లను కాదనలేం. వైవిధ్యమైన సినిమా ప్రయోగంగా అభివర్ణించే వాళ్లను వద్దనలేం. అయితే, రెండు వర్గాలూ అతికిమించి అల్లరి చేస్తుండటంతో -చివరకు హిట్ టాక్ వచ్చేసింది.

08/28/2017 - 20:58

చూస్తూనే ఉన్నాం

Pages