S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

06/19/2017 - 21:23

దర్శకుడిగా, నటుడిగా, కథకుడిగా, మాటలు పాటల రచయితగా సినిమా పరిశ్రమకే కాదు, పత్రికాధిపతిగా, కేంద్ర మంత్రిగా ఎనలేని సేవలందించిన దర్శకరత్న దాసరి నారాయణరావు ఇక లేరంటే అభిమానులందరికీ బాధాకరమైన విషయం.

06/12/2017 - 21:57

ఇటీవల వచ్చిన తెలుగు సినిమాల్లో సీరియల్‌కంటే దారుణంగా తీసిన సినిమా అంధగాడు. కథకు ఓ ప్రాముఖ్యత లేకుండా, ఇష్టారీతిన ఏవేవో సన్నివేశాలు కలిపేసుకుంటూ, చివరకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ పాయంట్ తెచ్చేసిన బాపతు చిత్రంల అనిపించింది. ప్రేక్షకులు చూసేస్తున్నారు కదాని ఏదిబడితే అది సినిమా చేసెయ్యడం పరిశ్రమకే ముప్పు. హీరో గుడ్డివాడు కనుక ప్రేక్షకులు సైతం గుడ్డిగా సినిమా చూసేస్తారనుకోవడం పొరబాటు.

06/05/2017 - 21:27

స్వామి రారా సినిమాతో విభిన్నమైన ఇమేజ్‌ను తెచ్చుకున్న సుధీర్‌వర్మ, తాజాగా ‘కేశవ’ అంటూ వచ్చాడు. కథ, కథనాలు వైవిధ్యంగా ఉన్నాయి. అన్ని ఎమోషన్లు కంట్రోల్ చేసుకుంటూ ప్రశాంతంగా సీరియల్ హత్యలు చేసే పాత్రలో నిఖిల్ బాగా నటించాడు. రీతూవర్మ, ఇషాకొప్పీకర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. కథ చిన్నదే అయినా సస్పెన్స్ వీడకుండా, బిగి సడలకుండా వేగంగా సాగడంతో ప్రేక్షకులకు విసుగు కలగలేదు. తరువాత ఏం జరుగుతుంది?

05/29/2017 - 21:32

స్వామి రారా లాంటి కమర్షియల్ విజయాన్ని అందించిన సుధీర్ వర్మతో యువహీరో నిఖిల్ చేసిన రెండో ప్రయోగం బెడిసికొట్టింది. పగ ప్రతీకారం కానె్సప్ట్‌తో తెరకెక్కిన కేశవలో నిఖిల్ కొత్తదనాన్ని చూపించలేకపోయాడు. పోలీసులను వరుసగా చంపుకుంటూ పోతుంటే, డిపార్ట్‌మెంట్ చేతులు కట్టుకుని కూర్చున్నట్టు చూపించటం సహజంగా అనిపించదు.

05/22/2017 - 23:18

అదీ సంగతి

05/15/2017 - 21:17

అటు నటుడిగా, ఇటు దర్శకుడిగా బిజీ అవుతన్న టైంలో -చిత్రమైన చెత్త కథను చేసి అవసరాల అనవసరంగా ఖాళీ అయిపోయాడు. కొన్ని సినిమాలు వ్యక్తిగత ఇమేజ్‌పై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయనడానికి ‘బాబు బాగా బిజీ’ని ప్రస్తావించుకోవచ్చు. మన తెలుగు నేటివిటీకి ఏమాత్రం సూట్‌కాని కథలో -తన అప్పీరెన్స్‌కు అస్సలు అతకని ‘మాధవ్’ పాత్ర చేసి అవసరాల మాచెడ్డ ఇబ్బంది పెట్టాడు.

05/01/2017 - 21:42

మహాభారతం ఇతిహాసాన్ని మూడు గంటల వ్యవధిలోనో లేక రెండు భాగాలుగానో వెయ్యి కోట్లు వెచ్చించి హాలీవుడ్ లెవల్లో సినిమా నిర్మించాలనే సంకల్పం సాహసంతో కూడినదే. ఇందులో బాలీవుడ్ ముగ్గురు ఖాన్‌లు నటిస్తారట. అమీర్‌ఖాన్ కృష్ణుడని ఓ వార్త. ఇందులో మన తెలుగు నటులు ఎంతమందో మరి! ఈ నిర్మాణానికి ఇద్దరో ముగ్గురో నడుం కడుతున్నారట.

04/24/2017 - 21:11

మీ
వ్యూస్

04/18/2017 - 00:54

వెండితెరపై అద్భుత దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించగల దర్శక దిట్ట మణిరత్నం. ఆ నమ్మకంతోనే థియేటర్లకు పరిగెత్తిన వాళ్లకు నిరాశ మిగిలింది. సిల్వర్ స్క్రీన్‌పై ప్రేమ కథలను పండించటంలో ఓ స్టయిల్ వున్న దర్శకుడు మణిరత్నం నుంచి చెలియా వస్తుందని ఆశపడిన ప్రేక్షకులకు ఆయన నిరాశ మిగిల్చారు. మణిరత్నం సినిమాల్లో అత్యంత ఫ్లాప్ చిత్రం ఇదే అనుకోవాలి, అలావుంది సినిమా.

04/10/2017 - 22:17

మాయాబజార్ చిత్రాన్ని ఈరోజు చూసినా పాత చిత్రాన్ని చూసినట్టుండదు. కృష్ణుడు నిజంగా ఇలానే ఉంటాడేమో అన్నంత గొప్పగా ఎన్టీఆర్ నటించడమే కాదు, మిగిలిన పాత్రధారులంతా అద్వితీయమైన నటన ప్రదర్శించి మెప్పించారు. ‘నిజంగా నీవంతటి వాడివే అయితే ఇలా మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తావా అభిమన్యూ.. ఊ’ అన్న డైలాగ్‌లో ఎన్టీఆర్ అభినయం చూసి ఎవ్వరైనా ఫ్లాటైపోవాల్సిందే.

Pages