S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

07/17/2017 - 20:42

పూర్వం సినిమాలు శతదినోత్సవాలు జరుపుకుంటే ఎంత లాభం వచ్చిందో తెలియకపోయినా హిట్ అనేవారు. ఈ కాలంలో ఏ గొప్ప సినిమా అయినా పాతిక రోజులు ఆడకున్నా సూపర్‌హిట్టని ప్రచారం చేస్తున్నారు. వెయ్యి థియేటర్లలో వారం ప్రదర్శనలోనే ఏ మాత్రం సినిమా బాగున్నా వంద కోట్ల వర్షం కురుస్తోంది. అదే హిట్ సినిమాగా ముద్రపడిపోతోంది.

07/10/2017 - 20:44

తెలుగు సినిమా కథ ఏమిటంటే చిన్నపిల్లవాడు కూడా చెబుతాడు. పాత చింతకాయ పచ్చడికి కొత్త తాళింపు అని. భారీ హీరో, కోట్లకు కోట్లు ఖర్చులు, అత్యాధునిక హంగులు అన్నింటిమీద ఎంతో శ్రద్ధపెడుతూ కీలకమైన కథ, కథనాలనే గాలికి వదిలేస్తున్నారు. భారీ అంచనాలు పెరుగుతూ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వేయికళ్ళతో ఎదురుచూసే అభిమానులకు నిరాశే మిగులుతోంది. ఏ యేడు చూసినా విజయాలకంటే పరాజయాలే ఎక్కువగా ఉంటున్నాయి.

07/03/2017 - 20:50

వరుస విజయాలతో టాలీవుడ్‌లో కొత్త రికార్డు క్రియేట్ చేసుకున్న హీరో అల్లు అర్జున్ వేగానికి దువ్వాడ జగన్నాథం కాస్త బ్రేక్ వేసినట్టు అయ్యంది. వైవిథ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ, మాస్ హీరోయజానికి మరింత పదును పెట్టుకుంటూ వస్తున్న బన్నీ, డిజెలో చేసిన ప్రయోగం తనవరకూ ఓకే అయనా, దర్శకుడు హరీశ్ శంకర్ వైఫల్యం బన్నీ కెరీర్‌కు బ్రేక్ వేసిందా? అనిపించింది.

06/26/2017 - 21:28

తెలుగులో వచ్చే ‘ఆత్మ’ కథల పంథా మారడం లేదు. పాడుబడిన భవంతి లేదంటే కొత్త అపార్ట్‌మెంట్. అవుట్‌డోర్‌లోకి వస్తే ఓ ఫాంహౌస్ లేదంటే సిటీకి దూరంగా ఉండే అడవి. కొనే్నళ్ల క్రితం హత్యకు గురైనవాళ్లో, కొన్ని జన్మల క్రితం ఆశతీరని వాళ్లో.. ఆత్మరూపం ఎత్తడం సినిమాకు సరిపడినంత పగను కథగా అందించటం. పోస్టర్లు మారుతున్నాయ తప్ప, స్క్రీన్ మీద స్టోరీ మారడం లేదు. పోయనవారం వచ్చిన అవంతిక అందుకు మినహాయంపు కాదు.

06/19/2017 - 21:39

నిర్వహణ: జి రాజేశ్వరరావు

**

06/19/2017 - 21:23

దర్శకుడిగా, నటుడిగా, కథకుడిగా, మాటలు పాటల రచయితగా సినిమా పరిశ్రమకే కాదు, పత్రికాధిపతిగా, కేంద్ర మంత్రిగా ఎనలేని సేవలందించిన దర్శకరత్న దాసరి నారాయణరావు ఇక లేరంటే అభిమానులందరికీ బాధాకరమైన విషయం.

06/12/2017 - 21:57

ఇటీవల వచ్చిన తెలుగు సినిమాల్లో సీరియల్‌కంటే దారుణంగా తీసిన సినిమా అంధగాడు. కథకు ఓ ప్రాముఖ్యత లేకుండా, ఇష్టారీతిన ఏవేవో సన్నివేశాలు కలిపేసుకుంటూ, చివరకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ పాయంట్ తెచ్చేసిన బాపతు చిత్రంల అనిపించింది. ప్రేక్షకులు చూసేస్తున్నారు కదాని ఏదిబడితే అది సినిమా చేసెయ్యడం పరిశ్రమకే ముప్పు. హీరో గుడ్డివాడు కనుక ప్రేక్షకులు సైతం గుడ్డిగా సినిమా చూసేస్తారనుకోవడం పొరబాటు.

06/05/2017 - 21:27

స్వామి రారా సినిమాతో విభిన్నమైన ఇమేజ్‌ను తెచ్చుకున్న సుధీర్‌వర్మ, తాజాగా ‘కేశవ’ అంటూ వచ్చాడు. కథ, కథనాలు వైవిధ్యంగా ఉన్నాయి. అన్ని ఎమోషన్లు కంట్రోల్ చేసుకుంటూ ప్రశాంతంగా సీరియల్ హత్యలు చేసే పాత్రలో నిఖిల్ బాగా నటించాడు. రీతూవర్మ, ఇషాకొప్పీకర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. కథ చిన్నదే అయినా సస్పెన్స్ వీడకుండా, బిగి సడలకుండా వేగంగా సాగడంతో ప్రేక్షకులకు విసుగు కలగలేదు. తరువాత ఏం జరుగుతుంది?

05/29/2017 - 21:32

స్వామి రారా లాంటి కమర్షియల్ విజయాన్ని అందించిన సుధీర్ వర్మతో యువహీరో నిఖిల్ చేసిన రెండో ప్రయోగం బెడిసికొట్టింది. పగ ప్రతీకారం కానె్సప్ట్‌తో తెరకెక్కిన కేశవలో నిఖిల్ కొత్తదనాన్ని చూపించలేకపోయాడు. పోలీసులను వరుసగా చంపుకుంటూ పోతుంటే, డిపార్ట్‌మెంట్ చేతులు కట్టుకుని కూర్చున్నట్టు చూపించటం సహజంగా అనిపించదు.

05/22/2017 - 23:18

అదీ సంగతి

Pages