S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

02/27/2017 - 21:46

తెలుగు సినిమాలు -అతుకుల బొంతలా తయారయ్యాయ. వ్యాపార దృష్టితో నాలుగైదు సూపర్‌హిట్ సినిమాల సన్నివేశాలు కాపీకొట్టి, చేతనైనంతగా అతికించి ఇదే సినిమా అంటున్నారు. అంటే పాత మిక్స్‌డ్ పచ్చడికి కొత్త తాలింపన్న మాట. అతుకులు సరిగ్గా అమరి కొత్త డిజైన్‌లా కనిపించేవన్నీ హిట్ అవుతుంటే -అతుకులన్నీ మాసికల్లా కనిపించే ఫెయిలవుతున్న సినిమాలే ఎక్కువనిపిస్తోంది. ఎందుకు? ఈ పాత కథల పచ్చళ్లు? కొత్త కథలు దొరకడం లేదా?

02/20/2017 - 21:28

హథీరామ్ భక్తికథను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సరళంగా చెప్పడంలో దర్శకుడు రాఘవేంద్రరావు తన అనుభవాన్ని రంగరించారు. రొమాన్స్‌నైనా, భక్తినైనా -స్క్రీన్‌ను కలర్‌ఫుల్‌గా డిజైన్ చేయడంలో తెలుగు దర్శకుల్లో రాఘవేంద్ర రావును మించినవారు లేరు. ఆ విషయాన్ని ఓం నమో వేంకటేశాయ చిత్రంతో మరోసారి రుజువు చేసుకున్నాడు దర్శకుడు.

02/13/2017 - 22:11

ప్రేక్షకులకు ఓ మంచి కథాచిత్రంగా శతమానంభవతి వచ్చింది. పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడానికి తమ పిల్లలే కారణమని సినిమాలో దర్శకుడు చూపడం బాగుంది. డైలాగులు కన్నీళ్లు పెట్టించాయి. ప్రేమించినవారితో పెళ్లికాకుంటే ఎందుకు బాధపడాలి. మన ప్రేమ మనతోనే నిండిపోయింది కదా అని, ఆ ప్రేమ మనదే అని పలకడం బావుంది. కోర్టులిచ్చే విడాకులకన్నా కుటుంబం ఇచ్చే విడాకులు బాధాకరమన్న ఆలోచనను రచయత గొప్పగా అభివ్యక్తీకరించారు.

02/06/2017 - 20:47

మంచు విష్ణుకు కాలం కలిసిరావడం లేదు. ‘అదృష్టాన్ని’ టైటిల్‌కు తగిలించుకున్నా -సినిమా మాత్రం డిజాస్టర్‌గానే మిగిలింది. ‘లక్కున్నోడు’ సినిమా కథను ఎలా ఎంపిక చేసుకున్నాడన్న అనుమానం కలుగుతుంది. హీరోగా విష్ణు తన స్టామినా నిరూపించుకున్నవాడే. గతంలో హిట్టు చిత్రాలతో మెప్పించాడు. కానీ, ఇప్పుడొచ్చే సినిమాలన్నీ ‘్ఫట్’మంటున్నాయంటే -లోపం ఎక్కడుందో అర్థం చేసుకోవాలి.

01/30/2017 - 22:51

శర్వానంద్ సీజన్ నడుస్తుంది. వరుసగా పడుతున్న సినిమాలతో సీనియర్ హీరోలకు చాలెంజ్ చేసే స్థాయిక ఎదుగుతున్నాడు. పర్ఫార్మెన్స్‌లో తీసుకుంటున్న జాగ్రత్తలు, ఎంచుకుంటున్న పాత్రలు కెరీర్‌ను ‘బుల్లెట్ ట్రైన్’లా పరిగెత్తిస్తున్నాయి. ఇటీవలి వచ్చిన శతమానంభవతి చిత్రం చూసినపుడు -పాత్రను పండించటంలో శర్వా స్టామినా కనిపించింది.

01/23/2017 - 23:00

పండగ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు వచ్చిన ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి.. రెండూ కత్తులే. ‘కత్తి’ రీమేక్‌గా వచ్చిన ‘150’లో రికార్డు పెర్ఫార్మెన్స్ చూపించి చిరంజీవి తనకు తిరగులేదని అనిపించుకున్నాడు. పౌరాణిక, చారిత్రక, జానపద చిత్రాలతో తనకు తిరుగులేదనిపించుకున్న ఎన్టీఆర్ గుర్తుకొచ్చేలా ‘శాతకర్ణి’లో బాలయ్య రెచ్చిపోయాడు.

01/16/2017 - 21:54

సంక్రాంతి నేపథ్యంలో విడుదలైన సినిమాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం పరిశ్రమకు శుభపరిణామం. ఖైదీ నెంబర్ 150 అంటూ చిరంజీవి అభిమానుల కోసం రూపొందించిన చిత్రం బావుంది. గ్రామం కోసం కార్పొరేట్ కంపెనీలకు ఎదిరించే హీరోగా చిరంజీవి నటన సూపర్. పాటల్లో కాజల్ డ్యాన్స్‌లపరంగా తేలిపోయింది. ఇక తెలుగు చక్రవర్తి శాతకర్ణిగా బాలకృష్ణ నటన తారాస్థాయిని అందుకుంది. తండ్రి ఎన్టీఆర్‌ను మరిపించేలా బాలకృష్ణ చేయగలిగాడు.

01/09/2017 - 21:09

సినిమాలు.. సంబంధం లేని పేర్లు మీద వెనె్నల వ్యాసం వివరణాత్మకంగా ఉంది. పాత సినిమా పాటల పల్లవి పంక్తులనే టైటిల్స్‌గా పెట్టడం గొప్ప విషయమే అయినా, తెలుగు భాషమీద ఇప్పుడున్నవాళ్లకు అంత పట్టులేదన్న విషయం అర్థమవుతుంది. సినిమా కథకు తగినట్టు అచ్చతెనుగు టైటిల్ పెట్టుకోలేక -గత రచయితలు సృజించిన పాపులర్ పల్లవులనే పల్లవించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

01/02/2017 - 21:40

తన కెరియర్‌లో అత్యుత్తమ చిత్రంగా ‘వంగవీటి’ని చెప్పుకున్నాడు వర్మ. చిత్రం ఆదినుంచీ వివాదాస్పదమే. ‘దర్వకత్వం ఓ సృజనాత్మక కళ. ఫలానాదాన్ని కట్ చేయండి’ అనే అధికారం సెన్సార్‌కి కూడా లేదంటూ ట్వీట్లతో ఆసక్తిని రేకెత్తించాడు. వంగవీటి కుటుంబీకులు కొన్ని సన్నివేశాలకు అభ్యంతరం చెప్పినపుడూ -వర్మ ఆ విధంగానే స్పందించాడు. వాళ్లు కోర్టుకెళ్లారు.

12/26/2016 - 21:30

లాజిక్‌లేని సాకుతో అబ్బాయల్ని బకరాలు చేసి -ఆనక తూచ్ అనేసే బొమ్మరిల్లు కథల్ని ఎగబడి చూసేస్తారని అనుకుంటే -అలాంటి సినిమాలు ‘నాన్న నేను.. నా బాయ్‌ఫ్రెండ్స్’లాగే బోల్తాపడతాయ. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయ రిథమ్‌లో వినిపించిన టైటిల్ చూసి -సినిమాలో కాస్తో కూస్తో కంటెంట్ ఉంటుందిలేనని థియేటర్లకు పరిగెత్తిన ఆడియన్స్ సీన్లు చూసి బుర్రలు పట్టుకున్నారు.

Pages