S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

07/25/2016 - 21:26

అతి సర్వత్రే వర్జయేత్ అని పెద్దలు సరదాకి అన్నారా? తాజాగా విడుదలైన కబాలి సినిమా, మీడియాలో దానిపై పెంచేసిన అంచనాలు, ఆ పేరుతో కార్పొరేట్ సంస్థలు సాగించిన వ్యాపారం, విడుదల రోజు కార్యాలాయాలకు సెలవులు ఇవ్వడం.. ఇత్యాది ప్రయోగాలు, పటాటోపాలు అన్నీ అతే. విడులయ్యాక బండారం బయటపడింది.
ధనరాజు, సూళ్లూరుపేట
కోట్లతో నటన నాణ్యమవునా?

07/18/2016 - 22:15

బూతు సినిమాలు రూపొందించడంలో మాస్టర్ అనిపించుకున్న మారుతి, క్లీన్ ఎంటర్‌టైనర్‌గా పబ్లిసిటీ చేసుకున్న ‘రోజులు మారాయి’ పరమ చెత్తగా వుంది. బూతు డైలాగులు, స్కిన్ షో లాంటివి జుగుప్స కలిగించాయి.

07/11/2016 - 21:28

బాపు రమణల దృశ్యకావ్యాలు అపురూపాలు. ముత్యాలముగ్గు, అందాల రాముడు, బుద్ధిమంతుడు, పెళ్ళిపుస్తకం లాంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకుడు ఎన్నటికీ మరువడు. సంపూర్ణ రామాయణం, భక్తకన్నప్ప లాంటి చిత్రాలు అజరామరం. అలాంటి వంశవృక్షం నుండి వచ్చిన వర ముళ్ళపూడి మారిన కాలానుగుణంగా మంచి చిత్రాలు తీయాలి. అలాకాకుండా బాపు బొమ్మలాంటి హీరోయిన్ చాందినీని పెట్టుకొని ఏమాత్రం పసలేని ‘కుందనపు బొమ్మ’లాంటి సినిమా తీయడం బాధాకరం.

07/04/2016 - 22:47

నాని ద్విపాత్రాభినయం చేసిన జెంటిల్‌మన్ చిత్రం బాగుంది. ఇద్దరు అమ్మాయిలు వారి ప్రేమకథలను చెప్పుకోవడంతో ప్రారంభమైన సినిమా నెమ్మదిగా థ్రిల్లర్ రూపుదాల్చింది. తనకు కాబోయే ఫ్రెండ్ హత్య చేయబడ్డాడన్న అనుమానంతో కేథరిన్ స్వయంగా ఇనె్వస్టిగేషన్ ప్రారంభించడం, ఆ క్రమంలో ఎదురైన నాని రెండో పాత్రను వెంటాడడం, చిట్టచివరకు అసలు విషయం తెలియడంతో సినిమా పట్టు సడలకుండా నడిపించడంలో దర్శకుడి ప్రతిభ కనిపించింది.

06/27/2016 - 22:07

నితిన్, సమంతలతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రూపొందించిన చిత్రం అందంగా ఆనందంగా సాగింది. నితిన్ మూస ధోరణినుండి బయటికి వచ్చి సరికొత్తగా నటించాడు. సమంత సినిమా అంతా భుజాలపైనే మోసింది. నరేష్, నదియా, శ్రీనివాసరెడ్డి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా రావురమేష్ నటన ఆ పాత్ర ఇంకాస్త ఉంటే బాగుండుననిపించేలా వుంది. కెమెరా పనితనం పల్లె అందాలకు వనె్నలద్దింది. పాటలు, రీరికార్డింగ్ వీనులవిందుగా సాగాయి.

06/20/2016 - 21:50

పాపం.. సుమంత్ అశ్విన్. అతని కష్టానికి తగిన ఫలం దక్కడం లేదు. విసుగూ విరామం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా.. ఒక్కటీ అతని కెరియర్‌కు బ్రేక్ త్రూ కావడం లేదు. అతని ఈడు హీరోలంతా అలాఅలా పైకి ఎదిగిపోతుంటే, ఈసారైనా సినిమా పడకపోతుందా అని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు పాపం. తాజాగా విడుదలైన రైట్ రైట్ కూడా అతని కెరియర్‌కు రైట్ చెప్పలేకపోయంది. ..హోల్డాన్! అంటూ బ్రేక్ వేసేసింది.

06/13/2016 - 22:02

ఘట్టమనేని శివరామకృష్ణ ఉరఫ్ సూపర్‌స్టార్ కృష్ణ 1943 మే 31 బుర్రిపాలెంలో జన్మించి 66లో సినీ రంగ ప్రవేశం చేశారు. తేనెమనసులు చిత్రంతో హీరో అయ్యారు. సూపర్‌స్టార్‌గా ఐదుసార్లు ఎన్నికై రికార్డు సాధించారు. ఎన్టీఆర్ చేయాలనుకున్న అల్లూరి సీతారామరాజు తీసి బంపర్‌హిట్ చేశారు. గూఢచారి 116 ద్వారా యువ హీరోలకు ఓ పెన్నిధిగా నిలిచారు. ఏలూరులో ఎంపిగా ఎన్నికై ప్రజాప్రతినిధిగా మన్ననలు పొందారు.

06/06/2016 - 23:01

పాత చింతకాయపచ్చడి లాంటి సినిమాలు చేసినా చూస్తారన్న ధీమా దర్శక, నిర్మాతలకు ఉంది. అందుకే బ్రహ్మోత్సవం చిత్రాన్ని చావుదెబ్బతీశారు. హిట్టయ్యిందని అవే లాజిక్‌లు, కథనాలు పెడితే చాలదు. కథాబలం, మంచి పాటలు, కళాత్మక విలువలు వినోదభరితంగా సినిమా ఉంటే ఆదరిస్తారని మహేష్ తెలుసుకోవాలి. సినిమాలో సరైన పట్టులేకపోవడంతో బిచ్చగాడులాంటి డబ్బింగ్ సినిమాకు ఆదరణ పెరిగింది.
- పి.శేషగిరిరావు, విశాఖపట్నం

05/30/2016 - 23:30

24 చిత్రం సాదా సీదా చిత్రాలకు భిన్నంగా సాగింది. మూడు పాత్రలలో సూర్య అభినయం బాగుంది. ఆత్రేయ పాత్రలో అతి క్రూరమైన నటన ప్రదర్శించాడు. తొట్రుపాటు లేకుండా సినిమాను విక్రమ్ బాగా నడిపించాడు. నిత్యామీనన్, సమంత హీరోయిన్లుగా సోసో. తిరు ఫొటోగ్రఫీ కట్టిపడేసింది. ఎఆర్ రెహమాన్ పాటలకన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. రొటీన్ సినిమాల మధ్య కొట్టుకుపోతున్న తెలుగు ప్రేక్షకులకు 24 చిత్రం ఎడారిలో ఒయాసిస్ లాంటిది.

05/23/2016 - 21:37

శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు కనుక మహేష్‌బాబు కథానాయకుడుగా ఉన్నందుకు ఈ సినిమా ఎంత బాగుంటుందో అని థియేటర్‌లోకి వెళ్ళి కూర్చుంటే 20 ఏళ్ళ క్రితంనాటి లాగి లాగి వదిలిన ఓ టీవీ సీరియల్ చూసినట్లుగా అనిపించింది. సినిమాకుండవలసిన ఎటువంటి అర్హతలు ఈ ఉత్సవానికి లేవు. మహేష్‌బాబు కెరీర్‌లో ఇటువంటి చిత్రం చేస్తాడని కలలో కూడా అనుకోలేదు. అయినా ఓవర్‌గా ఎక్స్‌పెక్ట్ చేయడం మనదే తప్పు.

Pages