S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ వ్యూస్

01/01/2016 - 04:34

నవరాత్రిలో వెన్నెల. నవరాత్రి చిత్రంలో అష్టతారల కూటమి ఓ పిచ్చాసుపత్రిలో అద్భుతంగా చిత్రీకరించిన ప్రహసనం వెన్నెలలాంటిదే. రకరకాల వైరుధ్యాలతో పిచ్చాసుపత్రిలో వున్న సూర్యకాంతం, ఛాయాదేవి, గిరిజ, కాంచన, జమున, గీతాంజలి, జయలలిత లాంటి వారి మధ్య సావిత్రి వెళితే ఇంక ఏముంది? అంతమంది జాబిలమ్మల ముందు వెన్నెల విరగకాయదు! ఆరోజుల్లో ఈ పాటను మళ్లీమళ్లీ చూసిన అనేక మంది ఉన్నారు.

12/24/2015 - 23:38

సంపత్‌నంది దర్శకత్వంలో వచ్చిన ‘బెంగాల్ టైగర్’ లాంటి మసాలా చిత్రంలో రాశిఖన్నా అందాలు ఒలకబోసింది. రవితేజ నటనలో మార్పు లేదు. యాక్షన్ సన్నివేశాల్లో ఒకే అనిపించాడు. కెమెరా బావుంది. కథలో ఆసక్తి లేదు. ఇది రవితేజ మార్కు చిత్రమని ప్రేక్షకులు ఇట్టే గ్రహిస్తారు. ముగింపు బావుంది.
-ఎల్ ప్రపుల్లచంద్ర, ధర్మవరం

12/18/2015 - 05:01

భారతీయ సినిమాకు సెన్సార్ విధానాన్ని రద్దుచేయాలని రాంగోపాల్‌వర్మ ఇటీవల విచిత్రమైన సూచన చేసారు. ప్రతీసారి అర్ధంపర్ధం లేని ప్రకటనలు చేస్తూ వార్తల్లో వుండేందుకు ప్రయత్నించే ఈ దర్శకుడు ఈసారి తన క్రియేటివిటీని దేశంలో సినిమాకు సెన్సార్ విధానం ఎందుకు ఉండకూడదో వివరించడంలో చూపించారు. మొబైల్ ద్వారా అనవసరమైన, అశ్లీలత అంతా క్షణాల్లో ఎక్కడబడితే అక్కడ వీక్షించే వెసులుబాటు వుండవచ్చుగాక!

12/11/2015 - 05:15

డేరింగ్ సమంత

12/04/2015 - 06:06

కమల్‌హాసన్ ‘చీకటి రాజ్యం’ టైటిల్స్ నుంచి శుభం వరకు నాన్‌స్టాప్‌గా సాగింది. ఆద్యంతం ఉత్కంఠతతో సాగిన చిత్రంలో ఏమాత్రం కథ లేకపోయినా కథనంతో అద్భుతంగా నడిపించారు. బహుశా ఇలాంటి ప్రయోగం కమల్‌కే సాధ్యమేమో. రొటీన్‌తో విసుగెత్తివున్న ప్రేక్షకులకు రెండున్నర గంటల వినోదంతో కూడిన చిత్రం ఇప్పటి తరానికి కావాల్సిందే.
-జి సాహితి, కొమ్మెర

11/27/2015 - 04:55

అందరూ దెయ్యాలు సినిమాలు తీసి హిట్ అవుతున్నారన్న ఆలోచనతో స్వాతి కూడా త్రిపుర అంటూ ముందుకు వచ్చింది. కానీ ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగరగలదా? అనుష్క ‘అరుంధతి’తో హిట్ కొట్టింది అంటే, ఆమె నటనే ప్రధాన కారణం. ఆ తరువాత నందిత ‘ప్రేమకథా చిత్రమ్’ అంటూ హిట్ కొట్టిందంటే అది దర్శకుడి ప్రతిభ. కానీ, త్రిపురలో ఏముందని ఆమె ఇలాంటి సినిమాలు చేసిందో అర్ధంకాదు.

Pages